ప్లాన్ ప్రకారమే పక్కకు తప్పుకున్నారా?

తమిళనాట విజయకాంత్ ది ప్రత్యేక శైలి. కెప్టెన్ గా ఆయన తమిళనాడు మొత్తానికి సుపరిచితులు. లక్షలాదిమంది అభిమానులున్న కెప్టెన్ విజయ్ కాంత్ తమిళనాడు రాజకీయాల్లో ప్రవేశించిన నాటి [more]

Update: 2021-03-22 17:30 GMT

తమిళనాట విజయకాంత్ ది ప్రత్యేక శైలి. కెప్టెన్ గా ఆయన తమిళనాడు మొత్తానికి సుపరిచితులు. లక్షలాదిమంది అభిమానులున్న కెప్టెన్ విజయ్ కాంత్ తమిళనాడు రాజకీయాల్లో ప్రవేశించిన నాటి నుంచి పెద్దగా రాణించలేదు. సినిమాల్లో తెచ్చుకున్న పేరు ప్రఖ్యాతులు, ఫేమ్ కూడా రాజకీయాల్లో పెద్దగా పని చేయలేదు. అప్పటికే ఉన్న జయలలిత, కరుణానిధిల ఎదుట విజయకాంత్ క్లిక్ కాలేకపోయారు.

కూటమి నుంచి తప్పుకోవడంతో….

ఇక వారి మరణానంతరం తాను రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. మరోవైపు సహనటుడు కమల్ హాసన్ పార్టీ పెట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్ కాంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాము అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. తమిళనాట రాజకీయాల్లో పెద్ద కుదుపుగానే పేర్కొనాలి. అసలే అంతంత మాత్రంగా ఉన్న అన్నాడీఎంకే కూటమి విజయ్ కాంత్ వైదొలగడంతో మరిం ఇబ్బందుల్లో పడింది.

రాజకీయంగా….

విజయకాంత్ 2006లో డీఎండీకే పార్టీని స్థాపించారు. ఆ ఎన్నికలలో కేవలం ఒక్క స్థానాన్ని గెలుచుకున్నారు. అయినా నిరాశపడలేదు. తర్వాత 2011 లో పోటీ చేసిన విజయకాంత్ పార్టీ 18 స్థానాలను గెలుచుకుంది. 2016లో అన్నాడీఎంకేతో విజయ్ కాంత్ పొత్తు కుదుర్చుకున్నారు. కానీ ఆశించిన ఫలితాలు రాలేదు. గత కొన్నాళ్లుగా విజయ్ కాంత్ అనారోగ్యం పాలయి బయటకు రావడం లేదు. పార్టీని కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. పార్టీ బాధ్యతలను కూడా భార్య ప్రేమలతకు అప్పగించారు.

అన్నాడీఎంకేకు నష్టమా?

అయితే విజయ్ కాంత్ ఈసారి అన్నాడీఎంకే నుంచి తప్పుకుంటారని ఏడాది నుంచి ప్రచారం జరుగుతుంది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో విజయ్ కాంత్ అన్నాడీఎంకేను 41 స్థానాలను కోరారు. కానీ కేవలం 15 స్థానాలు మాత్రమే ఇస్తామని చెప్పింది. మరో పార్టీ పీఎంకేకు మాత్రం 23 స్థానాలను కేటాయించింది. దీంతో విజయ్ కాంత్ అన్నాడీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చారు. తొలి నుంచి ఒక ప్లాన్ ప్రకారం అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలిగారు. విజయకాంత్ నిర్ణయం ఆయన పార్టీకి ఎంత మేరకు లాభం చేకూరుస్తుందో తెలియదు కాని, అన్నాడీఎంకే కూటమికి మాత్రం నష్టం తెస్తుందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News