కెప్టెన్ ఇంకా డిసైడ్ కాలేదట

తమిళనాడు ఎన్నికలకు ఇంకా నెలలు మాత్రమే సమయం ఉంది. అయితే కెప్టెన్ విజయకాంత్ పరిస్థితి ఏంటో అర్థం కాకుండా ఉంది. విజయకాంత్ కు తమిళనాడులో ప్రత్యేకమైన ఓటు [more]

Update: 2020-11-27 18:29 GMT

తమిళనాడు ఎన్నికలకు ఇంకా నెలలు మాత్రమే సమయం ఉంది. అయితే కెప్టెన్ విజయకాంత్ పరిస్థితి ఏంటో అర్థం కాకుండా ఉంది. విజయకాంత్ కు తమిళనాడులో ప్రత్యేకమైన ఓటు బ్యాంకు ఉంది. జయలలిత కు పోటీగా ఆయన దేశీయ ముర్పొక్కు ద్రవిడ కజగం పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన తొలి ఎన్నికల్లోనే విజయకాంత్ 18 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నారు. ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించారు.

ఏదో ఒక పార్టీతో…..

అయితే తొలి నుంచి విజయకాంత్ ఏదో ఒక పార్టీతో పొత్తులతో దిగుతుండటంతో ఓటు బ్యాంకు కొంత చెల్లా చెదురయినట్లు చెబుతున్నారు. తొలి ఎన్నికల్లో విజయం తర్వాత ఆయన ప్రభావం పెద్దగా ఏ ఎన్నికల్లో కనిపించలేదు. గత పార్లమెంటు ఎన్నికల్లోనూ అన్నాడీఎంకేతో పొత్తుతో బరిలోకి దిగినా స్థానాలను సాధించలేకపోయారు. ప్రస్తుతం డీఎండీకే పార్టీ అన్నాడీఎంకే కూటమిలోనే కొనసాగుతుంది.

అన్నాడీఎంకే కూటమితో…..

విజయ్ కాంత్ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు చాలా కాలం నుంచి దూరంగా ఉంటున్నారు. పార్టీని పూర్తిగా విజయ్ కాంత్ సతీమణి ప్రేమలత చూపుతున్నారు. ఈ సమయంలో విజయకాంత్ ఒంటరిగా పోటీ చేస్తారా? లేక కూటమిలో ఉంటారా? అన్నది ఇంకా తేలలేదు. అన్నాడీఎంకే కూటమిలో విజయకాంత్ ఉండరన్నది దాదాపు స్పష్టమయింది. ఈ కూటమికి విజయావకాశాలు లేవని గ్రహించి ఆయన కూటమి నుంచి తప్పుకుంటారన్న ప్రచారం జరుగుతోంది.

ఎటువైపు మొగ్గు చూపుతారో?

కమల్ హాసన్ డీఎండీకే మరికొన్ని చిన్నా చితకా పార్టీలతో కలసి డీఎంకే, అన్నాడీఎంకే లకు ప్రత్యామ్నాయంగా కూటమిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ కూటమిలో చేరేందుకు కూడా విజయకాంత్ పెద్దగా ఇష్టపడటం లేదు. ఆయనకు డీఎంకే నుంచి కూడా ఆహ్వానం అందిదంటున్నారు. మొత్తం మీద కెప్టెన్ విజయకాంత్ కు బలమైన ఓటు బ్యాంకు ఉండటంతో ఆయనను అన్ని పార్టీలూ ఆహ్వానిస్తున్నాయి. చివరకు ఎటువైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News