రెడ్డి గారు… సౌండ్ లేదేం ?

ఏపీలో ఎన్నో పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. ఓ వైపు మూడు రాజధానుల విషయంలో గవర్నర్ పచ్చ జెండా ఊపారు. కోర్టులో దీని మీద విచారణ జరుగుతోంది. ఇంకోవైపు [more]

Update: 2020-08-05 06:30 GMT

ఏపీలో ఎన్నో పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. ఓ వైపు మూడు రాజధానుల విషయంలో గవర్నర్ పచ్చ జెండా ఊపారు. కోర్టులో దీని మీద విచారణ జరుగుతోంది. ఇంకోవైపు ఎన్నడూ లేని విధంగా వైసీపీ టీడీపీల మధ్య రాజీనామాల సవాళ్ళు జరుగుతున్నాయి. కానీ ఒక కీలకమైన నాయకుడు మాత్రం మౌనవ్రతం పట్టినట్లుగా ఉన్నారు. ఆయనెవరో కాదు, జగన్ నీడగా భావించే వి విజయసాయిరెడ్డి. ఆయన పాలనారాజధాని కాబోతున్న విశాఖ సహా ఉత్తరాంధ్రా పార్టీ వ్యవహారాలు చూసే ఇంచార్జిగా ఉన్నారు. మరి ఇంతటి ప్రాధాన్యత ఉన్న అంశాల్లో విజయసాయిరెడ్డి ఎందుకో నోరు చేసుకోవడంలేదు. ఇది నిజంగా వింతా విడ్డూరమే.

కరోనా తరువాత …

విజయసాయిరెడ్డి ట్విట్టర్ కూత చూస్తే కరోనా ముందు తరువాత అన్నట్లుగా చాలా తేడా కనిపిస్తోంది. తనకు కరోనా వచ్చిందని విజయసాయిరెడ్డి చెప్పేంతవరకూ ఆయన ట్విట్టర్ ఏకే ఫార్టీ సెవెన్ గన్ లాగే మోత మోగించింది. చంద్రబాబు మొదలు విపక్ష నేతలందరినీ చీల్చిచెండాడింది. అటువంటి ట్విట్టర్ ఇపుడు కూత లేకుండా ఉందంటే కారణం ఏమైఉంటుందబ్బా అని వైసీపీలో చర్చ సాగుతోంది. దానికి అనేక రకాలైన విషయాలు కూడా కళ్ల ముందు కనిపిస్తున్నాయట.

గంట మోగడంతో……

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, టీడీపీ దిగ్గజ నాయకుడు గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి రావడం విజయసాయిరెడ్డికి సుతరామూ ఇష్టం లేదని అంటున్నారు. అందుకే ఆయన మౌనం దాల్చారని వినిపిస్తోంది. అది కూడా కరోనా వంటి వ్యాధితో తాను పోరాడుతూ ఆసుపత్రిలో ఉన్న వేళ తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి సజ్జల రామక్రిష్ణారెడ్డి వంటి వారు చక్రం తిప్పి మరీ గంటాకు స్వాగతం పలకడాన్ని విజయసాయిరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. ఇక గంటా చేరిక విషయంలో జగన్ సైతం తనను సైడ్ చేశారన్న ఆవేదన కూడా రెడ్డి గారిలో ఉన్నట్లుంది. దాంతో ఆయన ఫుల్ సైలెంట్ అయ్యారని టాక్.

అలక వీడేనా…?

జగన్ కి విజయసాయిరెడ్డికి మధ్య ఎవరికీ తెలియని అనుబంధం ఉందని అంటారు. జగన్ విజయసాయిరెడ్డిని ఎప్పటికీ దూరం చేసుకోరని కూడా అంటారు, జగన్ కి ఈ అవకాశవాద చేరికల వెనక ఉన్న రాజకీయం కూడా బాగా తెలుసు అని చెబుతారు. అందుకే ఆయన పార్టీ ప్రయోజనాలు, అన్నింటికీ మించి చంద్రబాబుని దెబ్బకొట్టే అవకాశాలను వదులుకోరని అంటారు, తనను తిట్టిన బొత్స సత్యనారయణను చేర్చుకోవడం వెనక కూడా పార్టీ కోసమే అంటారు. ఇపుడు విశాఖ రాజధాని విషయంలో బాబుకు భారీ షాక్ ఇప్పించాలంటే అది గంటా ద్వారానే సాధ్యమని జగన్ మాస్టర్ స్కెచ్ వేశారని చెబుతున్నారు. అందువల్ల ఆయన విజయసాయిరెడ్డికి నచ్చచెబుతారని, అంతా కలసి పనిచేస్తారని పార్టీలో వినిపిస్తోంది. ఇక విజయసాయిరెడ్ది ట్వీట్లకు కూడా బయట రాజకీయాల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. వారంతా ఎప్పటిలాగానే రెడ్డి గారు కసిమీద ట్వీటితే చూడాలనుకుంటున్నారుట. మరి చూడాలి,

Tags:    

Similar News