గేమ్ సక్సెస్… ప్రత్యర్థులకు మైండ్ బ్లాంక్ కావాల్సిందేనా?

మైండ్ గేమ్ ఎప్పుడూ పాలిటిక్స్ లో సక్సెస్ అవుతుంది. ప్రధానంగా ప్రత్యర్థులపై మైండ్ గేమ్ ఆడి సక్సెస్ కావడంలో విజయసాయిరెడ్డి ముందుంటారు. ఆయన ఆడిటర్ వృత్తి నుంచి [more]

Update: 2020-08-03 02:00 GMT

మైండ్ గేమ్ ఎప్పుడూ పాలిటిక్స్ లో సక్సెస్ అవుతుంది. ప్రధానంగా ప్రత్యర్థులపై మైండ్ గేమ్ ఆడి సక్సెస్ కావడంలో విజయసాయిరెడ్డి ముందుంటారు. ఆయన ఆడిటర్ వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఆయన పట్టును బాగానే పట్టేశారు. జగన్ కు బాగా ఉపయోగపడుతున్నారు. ఇప్పుడే కాదు అధికారంలో ఉన్నప్పుడు కూడా విజయసాయిరెడ్డి మైండ్ గేమ్ ఆడి అప్పడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని అనేక సార్లు ఇరకాటంలోకి నెట్టారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా….

తెలుగుదేశం, బీజేపీల మధ్య మైత్రి చెడిపోవడానికి విజయసాయిరెడ్డి మైండ్ గేమ్ ప్రధాన కారణమంటారు. విజయసాయిరెడ్డి తరచూ ప్రధాని కార్యాలయానికి వెళ్లడం ఇక్కడ కూర్చున్న చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించేది. తమ ప్రత్యర్థులకు ఎలా అపాయింట్ మెంట్లు ఇస్తారని ప్రశ్నించారు. అయితే విజయసాయిరెడ్డి ప్రధాని కార్యాలయంలోకి వెళ్లి ఏం చేశారన్నది పక్కన పెడితే అదే చంద్రబాబుకు బీజేపీపై కోపం పెరగడానికి ప్రధమ కారణమని ఇప్పటికీ అంటారు.

ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చేందుకు….

ప్రత్యేక హోదా విషయంలోనూ రాజీనామాల మైండ్ గేమ్ తో టీడీపీని ఇరకాటంలోకి నెట్టారు. అదే అంశంపైనే చంద్రబాబు ఎన్డీఏ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మోదీ పార్లమెంటు సాక్షిగానే వైసీపీ ట్రాప్ లో పడొద్దని చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఇలా విజయసాయిరెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మైండ్ గేమ్ తో అధికార పక్షాన్ని ఒక ఆటాడుకున్నారు. ఇక తాజాగా కన్నా లక్ష్మీనారాయణ విషయంలోనూ విజయసాయరెడ్డి ఆడిన మైండ్ గేమ్ సక్సెస్ అయింది. ఆయన నేరుగా కన్నా ను విమర్శించడం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపైనే ఆయన అవినీతి ఆరోపణలు చేశారు.

కన్నాపై మామూలుగా…..

ఎన్నికల నిధులను దుర్వినియోగం చేయడం, చంద్రబాబు నుంచి 14కోట్లు తీసుకున్నారన్న ఆరోపణలతో కన్నాపై విరుచుకుపడ్డారు. సవాల్ మీద సవాల్ విసిరారు. ఈ మైండ్ గేమ్ బీజేపీ అధిష్టానం మీద బాగానే పనిచేసిందని చెప్పాలి. నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఆరోపణలపై కేంద్ర నాయకత్వం కూడా ఆరా తీసింది. అసలు విజయసాయికి ఈ విషయంలో ఉప్పందించింది బీజేపీ నేతలే అని చెబుతారు. మూడు రాజధానుల విషయంలోనూ కన్నాను రెచ్బగొట్టడంలో విజయసాయిరెడ్డి సక్సెస్ అయ్యారు. కన్నా గవర్నర్ కు లేఖ రాయడం కూడా పార్టీలో వివాదమయింది. ఇలా విజయసాయిరెడ్డి మైండ్ గేమ్ తో తన ప్రధాన ప్రత్యర్థులను ఆటాడుకుంటున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Tags:    

Similar News