ఈ లీకేజీకి కారణం ఎవరు? ఇప్పటికైనా తెలిసిందా?

సలహాదారులు ఉన్నది ఎందుకో వాళ్ళకే తెలియదు…. వాళ్ళ సలహాలు సీఎం తీసుకోరు అనే క్లారిటీ కూడా వాళ్ళకి బాగానే ఉంది. అధికారంలోకి వచ్చాక ఏదొక పదవి ఇవ్వకపోతే [more]

Update: 2020-05-08 06:30 GMT

సలహాదారులు ఉన్నది ఎందుకో వాళ్ళకే తెలియదు…. వాళ్ళ సలహాలు సీఎం తీసుకోరు అనే క్లారిటీ కూడా వాళ్ళకి బాగానే ఉంది. అధికారంలోకి వచ్చాక ఏదొక పదవి ఇవ్వకపోతే ఏడుస్తారనే అంతరంగీకుల సూచనతో ఇలాంటి సలహాదారులు, వారి అనుచరులు అప్పన్నంగా ఆంధ్రా ప్రజల సొమ్మును హైదరాబాద్ లో కూర్చుని ఫలహారంలా తింటున్నారు. తమకు వత్తాసు పలికే వాళ్ళు, భజన చేసే వాళ్ళకి అధికారుల సాయంతో ఉద్యోగాలు ఇప్పించుకుంటూ నిస్సిగ్గుగా బతికేస్తుంటారు.

ఒకే రోజు రెండు ఘటనలు…..

ఆంధ్రప్రదేశ్ లో కనివిని ఎరుగని విషాదం చోటు చేసుకుంది.విశాఖ సంఘటన స్పందన బాగున్నా…
విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ లో స్తైరిన్ గ్యాస్ లీకైన ఘటనలో వందలమంది అస్వస్థతకు గురయ్యారు. 12మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో స్థానిక యువత, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, వైద్య సిబ్బంది తీవ్రంగా శ్రమించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి కూడా వెంటనే విశాఖపట్నం వెళ్లి బాధితులకు అండగా నిలిచారు. ప్రమాద ఘటనల్లో బాధితుల ప్రాణాలను వెనక్కి తీసుకు రాలేకున్నా దేశంలో మునుపెన్నడూ లేని స్థాయిలో పరిహారం ప్రకటించారు. ఒక్క దెబ్బతో ప్రతిపక్షాలు, విమర్శకుల నోళ్లు మూటపడేలా ఆయన భరోసా ఇచ్చారు. ప్రమాదంపై విచారణ జరుగుతుందని ప్రకటించారు. అయితే వీటికంటే మరో రెండు విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత లభించింది.

విజయసాయిరెడ్డి వీడియో….

మొదటి ఘటనలో సీఎం విశాఖ బయలుదేరి వెళ్లే సమయంలో తాడేపల్లి నివాసం నుంచి బయటకు వచ్చి ఆయన వెనుక విజయ సాయి రెడ్డి, సీఎం వ్యక్తిగత సహాయకుడు అదే వాహనంలో ఎక్కి కూర్చున్నారు. సీఎం కారు ఎక్కిన తర్వాత వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని కారు దగ్గరకు వెళ్లి కొద్ది సెకన్ల పాటు మాట్లాడారు. ఆ తర్వాత సాయి రెడ్డి కారు దిగి ఆళ్ల నానిని కారు ఎక్కమని సైగ చేయడం కనిపించింది. సీఎం కాన్వాయ్ హెలిప్యాడ్ కి చేరకముందే ఈ వీడియో మీడియా గ్రూప్ లలో ప్రత్యక్షం అయ్యింది. తలకిందులుగా ట్రాన్స్ఫర్ అయిన వీడియోలో సీఎం ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కారు ఎక్కి బయటకు వెళ్లే వరకు అన్ని రికార్డ్ అయ్యాయి. సిఎంవోలో ఉన్న ఒకరి అత్యుత్సాహం లేనిపోని అపోహలకు కారణం అయ్యింది. ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రజల్లోకి రాకపోవడానికి, కరోనా సమయంలో నేరుగా మీడియాతో మాట్లాడకుండా రికార్డ్ చేసిన వీడియోలతో అభాసు పాలవడానికి ఇదే వ్యక్తి కారణమని అధికార వర్గాల్లో ప్రచారం ఉంది.

అంతః పుర కుట్రలు…..

సరైన సూచనలు ఇవ్వకుండా ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టించడంలో అనుభవరాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇక గురువారం బయటకు వచ్చిన వీడియో మొబైల్ లో రికార్డ్ చేసి హడావుడిగా బయటకు వదిలేశారు. క్షణాల్లో అది వైరల్ అయ్యింది. దీంతో మంత్రి నాని వివరణ ఇచ్చుకున్నా ఫలితం లేకపోయింది. మరోవైపు వీడియో విడుదల పొరపాటో, యాదృచ్ఛికమో అనుకోడానికి కూడా వీల్లేదు. నిజానికి వైసీపీలో విజయ సాయి రెడ్డి స్థాయి మిగతా వారికంటే అందనంత ఎత్తులో ఉంటుంది. పార్టీలో ఆయన పాత్ర చాలామంది దగ్గరి వారికి గిట్టదు. బంధువులు, వైఎస్ కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నవారు, జగన్ తో సన్నిహిత సంబంధం ఉన్నవారు ఇలా ఎవరైనా విజయ సాయిరెడ్డి తర్వాతే పాత్రలకే పరిమితం అవ్వడం గమనార్హం. విజయ సాయి పరిధి తగ్గించడానికి అంతః పుర కుట్రలు కూడా కొట్టి పారేయలేం. విశాఖపట్నం మీద జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి ఉంది. అన్నీ కలిసి వస్తే మే చివరకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు కూడా జరిగిపోయేది. ఇలాంటి సమయంలో జరిగిన దుర్ఘటన విషయంలో నష్ట నివారణ కోసం సీఎం అన్ని ప్రయత్నాలు చేస్తుంటే, రాజకీయ దుమారం రేపేలా వీడియో లీక్ చేసి రచ్చకు కారణం అయ్యారు.

సలహాలు ఇవ్వకుండానే……

ఇక జాతీయ స్థాయిలో ఏపీ పరువు తీయడానికి కంకణం కట్టుకున్నట్టు వ్యవహరించారు తెలంగాణకి చెందిన జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్. టైమ్స్ నౌ ఛానల్ నావికా నిర్వహించిన షోలో తాను హైదరాబాద్ లో ఉన్నానని, తాను ఏమి జరుగుతుందో ఎలా చెప్పగలను అని ఓ సారి, విచారణ ఎన్ని రోజులు పడుతుందో తనకేమీ తెలుసని, సమాధానాలు చెప్పడానికి తనకు సలహాదారు పదవి ఇవ్వలేదని, తన పదవి సలహాలు ఇవ్వడానికే అంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యల మీద విస్తృతంగా వివరణ ఇచ్చే అవకాశాన్ని తన వైఖరితో వదిలి పెట్టడమే కాకుండా దేశ వ్యాప్తంగా ఏపీలో ఎదో జరిగిపోతుందనే అనుమానాలు వచ్చేలా మాట్లాడారు. దేవులపల్లి ఏమి పని చేస్తారో, ఏపీ, హైదరాబాద్ లలో ఆఫీస్ లు, ఢిల్లీ, హైదరాబాద్ లలో సమన్వయ కర్తలతో ఏమి ఒరుగుతుందో తెలీదు కానీ సర్కారు పరువు మంట కలపడానికి మాత్రం కృషి చేస్తున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి వైఖరి బయటకు ప్రచారంలో ఉన్నట్టు నిజంగా ఉండి ఉంటే ఇలాంటి వారికి ఎప్పుడో కత్తెర పడేది. బయటి వాళ్ళకి తెలియనంత లోతులో ఉండి పోవడంతో ఈ వ్యక్తిత్వ హనన ప్రచారాలు జోరుగా సాగుతుంటే, ఆముదం వృక్షాలు ఏపుగా ఎదిగి పోతున్నాయి.

Tags:    

Similar News