బాబు అక్కడ పుట్టడం దురదృష్టకరమట

ఎంత మాట అనేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబుపై రాజకీయ విమర్శలు ఎంతో మంది ఎన్నో సార్లు చేశారు కానీ విజయసాయిరెడ్డి చేసే విమర్శలు హార్ష్ గా [more]

Update: 2019-12-16 09:30 GMT

ఎంత మాట అనేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబుపై రాజకీయ విమర్శలు ఎంతో మంది ఎన్నో సార్లు చేశారు కానీ విజయసాయిరెడ్డి చేసే విమర్శలు హార్ష్ గా ఉంటాయని అంటారు. ఆయన ట్విట్టర్లో చెలరేగిపోతే చంద్రబాబు మీద తిట్ల జడివాన అలా కురిసితీరాల్సిందే. ఇవన్నీ పక్కన పెడితే తాజాగా విజయసాయిరెడ్డి చంద్రబాబు మీద ఘాటైన మాట వాడేశారు. బహుశా ఇంటువంటి ఆలోచన కూడా ఎవరూ చేసి ఉండరేమో. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పుట్టడం ప్రజలు చేసుకున్న దురదృష్టమని రెడ్డి గారు అంటూ మాటల మంటలే పుట్టించారు. అంతేనా చంద్రబాబు ని నెగిటివ్ మనిషి అని కూడా అన్నారు. ఆయన ఎపుడూ ప్రతికూల ఆలోచనలే చేస్తారని కూడా గట్టిగా తగులుకున్నారు. మరి చంద్రబాబు మీద వైసీపీ ఎంపీ ఇంత ఆగ్రహం వ్యక్తం చేయడం వెనక రీజనేంటి అంటే..

రాజకీయమేనట…

ఎప్పటికీ తానే ముఖ్యమంత్రి సింహాసనం మీద ఉండాలనుకునే చంద్రబాబు జగన్ సీఎం కావడాన్ని అసలు ఓర్వలేకపోతున్నారుట. ఆయన ప్రతి అభివ్రుధ్ధి పధకానికి అడ్డుతగులుతూ కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారుట. తాను పుట్టిన ఏపీ ప్రగతి పధంలో నడవాలన్న కోరిక ఒక పౌరుడిగా కూడా చంద్రబాబు కు లేకపోవడం కంటే బాధాకరం లేదని విజయసాయిరెడ్డి అంటున్నారు. నవరత్నాల ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేయాలనుకుంటున్న జగన్ కి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ బాబు రాష్ట్రాన్ని తిరోగమనం వైపునకు తీసుకుపోతున్నారని కూడా విజయసాయి హాట్ కామెంట్స్ చేశారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా ఏపీకి శాశ్వతమైన అభివ్రుధ్ధిని చేసి చూపించలేకపోయిన చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండి కూడా సహకరించకపోవడం బట్టి చూస్తే ఆయన అభివ్రుధ్ధి నిరోధకుడు అని అర్ధమవుతోందని రెడ్డి గారు అంటున్నారు.

మాటలే వెంటాడాయా…?

మరి తెర వెనక చంద్రబాబు గారు ఏ రకమైన రాజకీయం చేస్తూ వైసీపీని ఇబ్బంది పెడుతున్నారో జనాలకు తెలియ‌దు కానీ బాబు లాంటి వారు ఏపీకి భారం అనేంతగా కఠినమైన మాటను విజయసాయి వాడేశారు. ఓ విధంగా చంద్రబాబు గతంలో అన్న కొన్ని మాటలే ఇలా ఆయన్ని వెంటాడాయా అని ఇక్కడ అనిపించకమానదు. దళితుల్లో ఎవరైనా పుట్టాలా అనుకుంటారా అని చంద్రబాబు సీఎం గా ఉండగా ఒక కులాన్ని అవమానించినట్లుగా ప్రచారం జరిగింది. దానికి ప్రతిఫలమా అన్నట్లుగా ఇపుడు విజయసాయిరెడ్డి వంటి వారు అసలు చంద్రబాబు ఏపీలో పుట్టడమే ప్రజలకు పెద్ద బ్యాడ్ లక్ అంటున్నారు.

యాంటి బ్రాండ్ ఇమేజ్ …

మరి చంద్రబాబు రాజకీయ జీవితంలో చూసుకుంటే ముమ్మార్లు ముఖ్యమంత్రిగా తాను ఎన్నో చేశానని, ఉమ్మడి ఏపీ అభివ్రుధ్ధికి దిక్సూచిని తానేనని ని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. హైదరాబాద్ వంటి నగరం నాలుగువందలేళ్ళుగా ఉందని, చంద్రబాబు లాంటి వారు కొత్తగా వచ్చి చేసిందేమీ లేదని కేసీయార్ సహా అంతా అనడమూ జరిగింది. కానీ విజయసాయిరెడ్డి చంద్రబాబు లాంటి ప్రతికూల శక్తులు ఏపీలో పుట్టడమే ప్రజలు చేసుకున్న పాపం అన్న తరహాలో చేసిన విమర్శలు మాత్రం టీడీపీ అధినేత ఇప్పటివరకూ ఎదుర్కోలేదు. మరి ఈ హై ఓల్టేజ్ కామెంట్స్ పట్ల టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News