Vidadala rajani : వివాదాలే విడదలకు సమస్యగా మారనుందా?

అతి సర్వత్రా వర్జయేత్.. అంటారు. ఒక్కోసారి శృతి మించిన ప్రచారం కూడా వికటిస్తుంది. చేసేది తక్కువ చెప్పుకునేది ఎక్కువగా అన్న ముద్ర పడిపోతే నిజం చెప్పినా జనం [more]

Update: 2021-10-23 14:30 GMT

అతి సర్వత్రా వర్జయేత్.. అంటారు. ఒక్కోసారి శృతి మించిన ప్రచారం కూడా వికటిస్తుంది. చేసేది తక్కువ చెప్పుకునేది ఎక్కువగా అన్న ముద్ర పడిపోతే నిజం చెప్పినా జనం నమ్మలేని పరిస్థితికి వస్తుంది. ఇప్పుడు చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజనీ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఆమె అడుగు వేస్తే వెంటనే ఫొటోలో సోషల్ మీడియాలో దర్శనమిస్తాయి. ఆమె కోసం ఏకంగా ఒక టీం పనిచేస్తుంది. అలా సోషల్ మీడియా ద్వారా ఎమ్మెల్యేగా ఎన్నికయిన నాటి నుంచి విడదల రజనీ విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు.

చేసింది తక్కువ….

కరోనా సమయంలోనూ ఆమె చేసింది తక్కువ చెప్పింది ఎక్కువ అన్నట్లు ప్రచారం చేసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. విడుదల రజనీ ఫేస్ బుక్, వాట్సప్, ట్విటర్ ద్వారా ప్రజల్లో నిత్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అప్పుడప్పుడు అధికారులకు వార్నింగ్ లు ఇవ్వడం కూడా కన్పిస్తాయి. ఒకరకంగా చెప్పాలంటే రజనీ ఏ చిన్న పనిచేసినా క్షణాల్లో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తాయి. విడుదల రజనీకి ఈ ప్రచారం ఇబ్బంది పెట్టేలా కన్పిస్తుంది.

మంత్రి పదవి రేసులో….

విడదల రజనీ మంత్రి పదవిని ఆశిస్తున్నారు. తొలి సారి గెలిచినప్పటికీ సామాజికవర్గం కోటాలో ఆమె జగన్ కేబినెట్ లో చేరాలనుకుంటున్నారు. గుంటూరు జిల్లాకు జగన్ వస్తే చాలు విడదల రజనీ హడావిడి ఇక చెప్పలేం. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సహకారంతో తనకు మంత్రి పదవి వస్తుందని విడదల రజనీ గట్టిగా విశ్వసిస్తున్నారు. అందుకోసం ఇటీవల కాలంలో ప్రచారాన్ని ఎక్కువగా చేసుకుంటున్నారు.

వివాదాలు ఎక్కువవడంతో…

అయితే వివాదాలతో ఆమెకు మంత్రి పదవి దక్కకపోయే ఛాన్సుంది. విడదల రజనీ స్థానికంగా మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ తో సఖ్యత లేదు. అలాగే నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో కూడా పొసగడం లేదు. కమ్మ సామాజికవర్గం నేతలతో గొడవలు ఆమెను పదవికి దూరం చేసేలా ఉన్నాయి. అంతేకాకుండా తొలిసారి ఎమ్మెల్యే కావడం, గుంటూరు జిల్లా లో బీసీ నేత కావడం విడదల రజనీకి మైనస్ పాయింట్లు అని చెబుతున్నారు.

Tags:    

Similar News