ఏడాది అంతా విడదల వివిదాల రాజకీయమేనా?

“అంతా నాయిష్టం! ఎడా పెడా ఏం చేసినా.. అడిగేదెవ‌డ్రా నాయిష్టం!|“- ఓ సినిమా సాంగ్ గుర్తుందా? ఒక‌వేళ లేక‌పోతే.. మీరు ఒక్కసారి గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గానికి [more]

Update: 2020-06-25 13:30 GMT

“అంతా నాయిష్టం! ఎడా పెడా ఏం చేసినా.. అడిగేదెవ‌డ్రా నాయిష్టం!|“- ఓ సినిమా సాంగ్ గుర్తుందా? ఒక‌వేళ లేక‌పోతే.. మీరు ఒక్కసారి గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్తే.. అంద‌రూ ఇప్పుడు ఈ పాటేపాడుకుంటున్నారు. అవును! నిజం అంటున్నారు. ఇంత‌కీ ఈ మార్పు ఎప్పుడు వ‌చ్చిందంటే మాత్రం అంద‌రూ ముక్తకంఠంతో చెప్పేమాట‌.. ఏడాది నుంచే అని. ఏడాది కింద‌ట జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థినిగా విజ‌యం సాధించారు విడ‌ద‌ల ర‌జ‌ని. ఎన్నారై మ‌హిళ అయిన ఆమె మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శిష్యురాలిగా ఎంట్రీ ఇచ్చి చివ‌ర‌కు ఆయ‌న‌కే ఏకు మేక‌య్యారు. ఉన్నత విద్యావంతురాలు అయిన విడ‌ద‌ల ర‌జ‌ని రెండు, మూడు భాష‌ల‌ను అన‌ర్గళంగా మాట్లాడే శైలి సొంతం చేసుకున్నారు. ఉన్నది ఉన్నట్టు కుండ‌బ‌ద్దలు కొట్టేలా మాట్లాడ‌డ‌మే విడ‌ద‌ల ర‌జ‌ని నైజం. అంతేకాదు, ఎలాం టి వారినైనా ఢీ అంటే ఢీ అనే ధైర్యం కూడా విడ‌ద‌ల ర‌జ‌ని సొంతం. అయితే, ఇది రాజ‌కీయంగా వినియోగించ‌డంతో ఈ ఏడాది కాలంలో ఆమె మంచిగా కంటే కూడా వివాదాస్పద రీతిలోనే ప్రముఖ వ్యక్తిగా మారారు.

ప్రత్యేకంగా క్యాడర్ ను ….

రాష్ట్రంలో ఈ ఏడాది కాలంలో వివాదాస్పద‌మైన ఎమ్మెల్యే ఎవ‌రైనా ఉన్నారంటే అందులో వైసీపీ ఎమ్మెల్యేల్లో విడ‌ద‌ల ర‌జ‌ని ఖ‌చ్చితంగా ఉంటారు. ఆమె అభివృద్ధి ప‌రంగా కంటే వివాదాల‌తోనే ఎక్కువుగా పాపుల‌ర్ అయిపోయార‌ట‌. త‌న‌కు టికెట్ ఇచ్చేందుకు స‌హ‌క‌రించిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ను, త‌న గెలుపున ‌కు కృషి చేసిన సీనియ‌ర్లను కూడా విడ‌ద‌ల ర‌జ‌ని లెక్కచేయ‌డం లేద‌న్న టాక్ నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ కేడ‌ర్‌లోనే వినిపిస్తోంది. పోనీ.. నియోజ‌క‌వ‌ర్గంలోఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయా? అని త‌ర‌చి చూసినా ఒక్కటీ క‌నిపించ‌డం లేద‌ని వైసీపీ నేతలే ఆరోపిస్తోన్న ప‌రిస్థితి. సొంత పార్టీలోనే వేరు కుంప‌ట్లు పెట్టుకుని, త‌న‌కంటూ ప్రత్యేక క్యాడ‌ర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ వెంట ప‌దేళ్ల పాటు ఉన్న కేడ‌ర్ ఇప్పుడు ఆమె వెన‌క క‌న‌ప‌డ‌డం లేదు.

వివాదాలతోనే సమయమంతా…..

అదే స‌మ‌యంలో జిల్లాకే చెందిన సొంత పార్టీ ఎమ్మెల్యేల‌తోనూ వైరం పెంచుకున్నారు. ఇక‌, ఈ ఏడాది కాలంలో ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌ని సాధించిన విజ‌యాల విష‌యానికి వ‌స్తే.. ఒక్కటి కూడా క‌నిపించ‌డం లేద‌నేది స్థానిక వ‌ర్గాల మాట‌. పార్టీలోను, నియోజ‌క‌వ‌ర్గం లోనూ పైచేయి సాధించేందుకు విడ‌ద‌ల ర‌జ‌ని చేస్తున్న ప్రయ‌త్నాల‌తో సీనియ‌ర్లు సైతం బెంబేలెత్తిపోతున్నారట‌. ఎమ్మెల్యేగా ఉన్న ఆమెతో పాటు ఆమె మ‌రిది, బంధువులు కూడా రాజ‌కీయంగా వివాదాల‌కు సై అంటున్నార‌ని ప‌లువురు చెవులు కొరుక్కుంటున్నారు. న‌ర‌సారావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవ‌రాయులు కారుపై ప‌డి పిడిగుద్దులు కురిపించ‌డం ఎంత వివాద‌మైందో చూశాం.

ఆమెతో సఖ్యతగా….

ఇక ఎంపీ కృష్ణదేవ‌రాయులు తో ఇప్పటికే కోట‌ప్పకొండ ప్రభ‌ల విష‌యంలో వివాదం న‌డుస్తూనే ఉంది. ఇరు వ‌ర్గాలు రోడ్డెక్కాయి కూడా. ఇక‌, పార్టీలో సీనియర్లు ప‌క్కకు త‌ప్పుకొనేలా విడ‌ద‌ల ర‌జ‌ని బాగానే చ‌క్రం తిప్పారు. అదేస‌మ‌యంలో ప్రతిప‌క్ష నేత మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు కూడా అడుగ‌డుగునా చెక్ పెడుతున్నారు. ఆయ‌న హ‌వాను త‌గ్గించే ప్రయ‌త్నం చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఏం జ‌రిగినా.. త‌న‌కు చెప్పాల‌నే ఆదేశాలు ఉన్నాయి. అదే స‌మ‌యంలో త‌న మాట కూడా నెగ్గించుకుంటున్నారు. దీంతో వైసీపీలో నేత‌లు ఎవ‌రూ కూడా విడ‌ద‌ల ర‌జ‌నితో క‌లిసి ముందుకు సాగే ప‌రిస్థితి లేకుండా పోయింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంద‌ని అంటున్నారు. ఇలా మొత్తంగా ఈ ఏడాది స‌మ‌యంలో చిల‌క‌లూరి పేట ఎమ్మెల్యేగా విడ‌ద‌ల ర‌జ‌ని రికార్డు స్థాయి వివాదాలే సాధించారు త‌ప్ప.. రికార్డులు సాధించ‌లేద‌ని స్థానికంగా ప్రజ‌లు అభిప్రాయ ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News