వెంక‌య్య ఎఫెక్ట్‌: తిరుప‌తిలో బీజేపీ స‌త‌మ‌తం

ఏమాట‌కామాటే చెప్పే ఉప‌రాష్ట్ర ప‌తి, కేంద్ర మాజీ మంత్రి వెంక‌య్యనాయుడు.. తాజాగా చేసిన వ్యాఖ్యలు.. బీజేపీలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. తిరుప‌తి ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇప్పుడు వెంక‌య్య చేసిన [more]

Update: 2021-04-05 06:30 GMT

ఏమాట‌కామాటే చెప్పే ఉప‌రాష్ట్ర ప‌తి, కేంద్ర మాజీ మంత్రి వెంక‌య్యనాయుడు.. తాజాగా చేసిన వ్యాఖ్యలు.. బీజేపీలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. తిరుప‌తి ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇప్పుడు వెంక‌య్య చేసిన వ్యాఖ్యల‌ను అధికార పార్టీ వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవాల‌ని నిర్ణయించ‌డం.. ఈ వ్యాఖ్యల‌ను ఎలా తిప్పికొట్టాలి ? అని బీజేపీ నేత‌లు త‌ర్జన భ‌ర్జన ప‌డుతుండ‌డం రాజ‌కీయంగా చ‌ర్చకు దారితీసింది. తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి త్వర‌లోనే ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుద‌లైంది. అయితే.. ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కి మోడీకి కానుక ఇవ్వాల‌ని బీజేపీ నాయ‌కులుగ ట్టి ప‌ట్టుద‌ల ‌తో ఉన్నారు. ఈ క్రమంలో వైసీపీపై విమ‌ర్శలు గుప్పిస్తున్నారు.

తిరుమలపైనే ఎక్కువగా….?

మ‌రీ ముఖ్యంగా హిందూ సామాజిక వ‌ర్గాన్ని టార్గెట్ చేసుకుని.. వైసీపీ ఓట్ను కొల్లగొట్టేందుకు బీజేపీ నేత‌లు పెద్ద ఎత్తున వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రధానంగా తిరుమ‌ల ప‌విత్రత‌త‌ను.. ఇక్కడి ఆచారాల‌ను వైసీపీ ప్రభుత్వం భ్రష్టు ప‌ట్టిస్తోంద‌ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునేందుకు బీజేపీ నాయ‌కులు రెడీ అయ్యారు. ముఖ్యంగా ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక హిందూ దేవాల‌యాల‌పై జ‌రుగుతోన్న దాడులు, హిందూ సంస్కృతిని బ్రష్టు ప‌ట్టిస్తున్నారంటూ బీజేపీ ఇప్పటికే వైసీపీని టార్గెట్ చేస్తోంది.

హిందుత్వ అజెండాను…..

తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లోనూ ఈ హిందూత్వ ఎజెండాను గ‌ట్టిగా వాడుకుని వైసీపీని ఇరుకున పెట్టాల‌ని బీజేపీ ప్లాన్‌. ఇప్పటికే ఈ దిశగా ప్రణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే.. ఇంతలోనే ఉప‌రాష్ట్రప‌తిగా ఉన్న వెంక‌య్య నాయుడు సంచ‌ల‌న కామెంట్లు చేశారు. తిరుమ‌ల‌లో ప‌రిస్థితి చాలా బాగుంద‌ని కితాబు ఇచ్చారు. అంతేకాదు.. ఇక్కడి ప‌రిస్థితిని ఆయ‌న మెచ్చుకుంటూ.. దాదాపు 20 నిముషాల పాటు ప్రసంగించారు. సాంకేతికతను సరైన విధంగా వినియోగించుకోవడం ద్వారా తిరుమల దర్శన విధానంలో వచ్చిన సానుకూల మార్పులను వెంకయ్యనాయుడు ప్రశంసించారు. అసౌకర్యానికి తావు లేకుండా రోజూ 70 వేల నుంచి లక్ష మంది దర్శనం చేసుకుంటున్న ఆ విధానాన్ని ఆదర్శంగా తీసుకుని, వివిధ రంగాల్లో సానుకూల సాంకేతిక సౌకర్యాలు రావాలని సూచించారు.

ఏ విమర్శలయితే చేయాలనుకున్నారో?

అంతేకాదు.. తిరుమ‌ల పాల‌క మండ‌లి కూడా అద్భుతంగా ప‌నిచేస్తోంద‌న్నారు. దీంతో ఇప్పటి వ‌ర‌కు బీజేపీ నేత‌లు ఏదైతే విమ‌ర్శించాల‌ని నిర్ణయిం చుకున్నారో.. ఎవ‌రినైతే టార్గెట్ చేయాల‌ని అనుకున్నారో.. వారిపైనే ప్రశంస‌లు రావ‌డంతో ఇప్పుడు ఎలా ముందుకు వెళ్లాల‌నే విష‌యంలో త‌ర్జన భ‌ర్జన ప‌డుతున్నారు. ఇక‌, వైసీపీ మాత్రం.. వెంక‌య్య వ్యాఖ్యల‌కు మంచి ఫోక‌స్ ఇస్తోంది. సోష‌ల్ మీడియాలోనూ ఆయ‌న వీడియోను జోరుగా వైర‌ల్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News