ఆ క‌మ్మ టీడీపీ ఎమ్మెల్యే సైలెన్స్ వెన‌క‌…?

తూర్పు గోదావ‌రి జిల్లాలో గ‌త ఏడాది జ‌గ‌న్ సునామీని త‌ట్టుకుని మ‌రీ విజ‌యం సాధించిన మండ‌పేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వర‌రావు కేంద్రంగా రాజ‌కీయాలు వేడెక్కాయి. ఆయ‌న వివాద [more]

Update: 2020-11-14 03:30 GMT

తూర్పు గోదావ‌రి జిల్లాలో గ‌త ఏడాది జ‌గ‌న్ సునామీని త‌ట్టుకుని మ‌రీ విజ‌యం సాధించిన మండ‌పేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వర‌రావు కేంద్రంగా రాజ‌కీయాలు వేడెక్కాయి. ఆయ‌న వివాద ర‌హితుడు.. అంద‌రినీ కొలుపుకొని పోయే మ‌న‌స్తత్వం ఉన్నారు. అంతేకాదు.. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నారు. కానీ, ఇప్పుడు అస‌లు ఆయ‌న పార్టీలో ఉంటారా ? ఉండ‌రా ? ఒక్కసారిగా ఆయ‌న సైలెన్స్ వెన‌క కార‌ణం ఏంటి ? అనే ప్రశ్నలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. దీనికి కార‌ణం.. ఆయ‌న‌పై త‌న‌కుటుంబం ప‌రంగా వ‌స్తున్న ఒత్తిళ్లు. ఇత‌ర‌త్రా స‌మ‌స్యలే కార‌ణం అన్న గుస‌గుస‌లు స్థానికంగా వినిపిస్తున్నాయి.

పెద్దదిక్కుగా…..

వ్యాపారాలు ఎక్కువ‌గా ఉన్న వేగుళ్ల జోగేశ్వర‌రావుకు నియోజ‌క‌వ‌ర్గంలో మంచి గుర్తింపు ఉంది. రాజ‌కీయంగా ఆయ‌న ఎంత దూకుడుగా ఉన్నారో.. వ్యాపార ప‌రంగా అంతే దూకుడుగా ఉన్నారు. వివిధ వ్యాపారాల‌తో ఆయ‌న త‌ల‌మున‌క‌ల‌వుతున్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న ఇప్పుడు ఫ్యామిలీ ప‌రంగా ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నార‌ట‌. మండ‌పేట మునిసిప‌ల్ చైర్మన్‌గా ప్రస్థానం ప్రారంభించిన ఆయ‌న ఆ త‌ర్వాత హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు. 2009 ఎన్నిక‌ల్లో 13 వేల మెజారిటీతోను, 2014 ఎన్నిక‌ల్లో 36 వేల ఓట్ల మెజారిటీతోను, 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీ ఉన్నప్పటికీ.. 13 వేల ఓట్ల మెజారిటీతోనూ ఆయ‌న విజ‌యం సాధించారు. అంతేకాదు.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వేగుళ్ల జోగేశ్వర‌రావే టీడీపీకి పెద్దదిక్కు.

ఆయనను టార్గెట్ చేయడంతో…..

అయితే.. వైసీపీ ఈయ‌న‌ను టార్గెట్ చేసింద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఈయ‌న‌ను త‌ప్పించి.. పార్టీలోకి చేర్చుకుంటే.. టీడీపీ ఇక్కడ క‌నుమ‌రుగ‌య్యే ప‌రిస్థితి ఉంటుంద‌ని వైసీపీ నేత‌లు భావిస్తున్నారు. 2009లో వైఎస్ వేవ్‌ను.. మొన్న ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ వేవ్‌ను త‌ట్టుకుని ఇక్కడ వేగుళ్ల విజ‌యం సాధించ‌డం అంటే ఆయ‌న ఎంత బ‌లంగా ఉన్నారో స్పష్టమ‌వుతోంది. ప్రస్తుతం అమ‌లాపురం పార్లమెంట‌రీ జిల్లా ఇంచార్జ్‌గా ఉన్న తోట త్రిమూర్తులు.. ఈ వ్యూహంతోనే ముందుకు సాగుతున్నార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ రామ‌చంద్రాపురం ఎమ్మెల్యేగా ఉండ‌డంతో అక్కడ త్రిమూర్తుల‌ను సర్దుబాటు చేయ‌లేక జ‌గ‌న్ మండ‌పేట ప‌గ్గాలు కూడా అప్పగించారు. మండ‌పేట ఇన్‌చార్జ్‌గానే కాకుండా అమ‌లాపురం పార్లమెంట‌రీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తోట మండ‌పేట‌లో వేగుళ్ల జోగేశ్వర‌రావును ఢీకొట్టేందుకు సై అంటున్నారు.

వ్యాపారాలపై…….

స్థానికంగా తోట దూకుడుగా ఉండ‌డం.. అటు పార్టీ అధిష్టానం సైతం పైనుంచి వేగుళ్ల జోగేశ్వర‌రావు వ్యాపారాలను టార్గెట్ చేస్తుండ‌డంతో ఆయ‌న పూర్తిగా సైలెంట్ అయిన ప‌రిస్థితే క‌నిపిస్తోంది. వేగుళ్ల సైలెంట్ నేప‌థ్యంలో టీడీపీ కంచుకోట మండ‌పేట‌లో టీడీపీ పుంజుకుంటుందా ? లేదా ? అనే సందేహాలు వ‌స్తున్నాయి. ఒక‌వేళ వేగుళ్ల జోగేశ్వర‌రావే టీడీపీకి దూర‌మ‌య్యే ప‌రిస్థితే వస్తే మండ‌పేట‌లో సై కిల్ అయిన‌ట్టే.. బాబు ఆశ‌లు ఇక్కడ గ‌ల్లంతైన‌ట్టే..!

Tags:    

Similar News