వాసుపల్లిని బుక్ చేశారా…?

వాసుపల్లి గణేష్ కుమార్. విశాఖ వంటి మెగా సిటీకి టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అంతే కాదు, రెండో సారి వరసగా విశాఖ సౌత్ నుంచి గెలిచి [more]

Update: 2020-09-01 00:30 GMT

వాసుపల్లి గణేష్ కుమార్. విశాఖ వంటి మెగా సిటీకి టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అంతే కాదు, రెండో సారి వరసగా విశాఖ సౌత్ నుంచి గెలిచి సత్తా చాటారు, బీసీ సామాజిక వర్గానికి చెందిన వాసుపల్లి గణేష్ కుమార్ ని బాబు రాజకీయంగా వాడుకుంటున్నారు. ఇపుడు విశాఖ పాలనారాజ‌ధాని అవుతోంది. దాంతో ఈ బలమైన బీసీ నేత నుంచే విశాఖకు రాజధాని వద్దు అని చెప్పించాలని హై కమాండ్ ఆలోచనగా ఉందిట. దీని మీద మీడియా మీట్ పెట్టి పార్టీ స్టాండ్ చెప్పమని చాలా పెద్ద ఎత్తున వత్తిడి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే వాసుపల్లి గణేష్ కుమార్ స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని తాను విశాఖ పౌరుడిగా ఇక్కడే రాజధాని కోరుకుంటానని చెప్పుకొచ్చారు. అదే సమయంలో పార్టీకి బాధ్యుడిగా అమరావతి అన్న పార్టీ స్టాండ్ కి కట్టుబడి ఉంటానని కూడా చెప్పేశారు.

జై అమరావతి …

ఇక ఇలా రెండు విధాలుగా మాట్లాడి కీలకమైన ఈ రాజకీయ పరిస్థితుల నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ గట్టెక్కడానికి చూస్తూంటే ఆయన అమరావతి రాజధానికి అనుకూలమని టీడీపీ హై కమాండ్ ప్రచారం చేస్తోందిట. పైగా ఆయన అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాల‌ని కోరుతూ రాసిన లేఖను సోషల్ మీడియాలో పెట్టించారని కూడా అంటున్నారు. దాంతో ఖంగు తిన్న వాసుపల్లి గణేష్ కుమార్ తాను అలా చేయలేదని, తానెపుడు లేఖ రాశానంటూ షాక్ అవుతున్నారుట. తాను విశాఖ ప్రజల మనోభావాలను గౌరవిస్తానని కూడా చెబుతున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ పట్ల మాత్రం వాసుపల్లి గణేష్ కుమార్ వర్గం గుర్రుమీద ఉందిట.

ఎవరు చేశారో ..?

కాగా చంద్రబాబును, పార్టీని నమ్మి తాను ఉంటే తనకు వ్యతిరేకంగా పార్టీలో ఈ రకమైన కుట్రను ఎవరు చేశారన్నది బాధగా ఉందని వాసుపల్లి గణేష్ కుమార్ అంటున్నారు. తాను విశాఖ రాజధానిని ఎందుకు వద్దంటానని, ఇది ప్రజలతోనూ తన రాజకీయ జీవితంతోనూ చెలగాటం ఆడే ప్రమాదకరమైన కుట్ర అని కూడా అంటున్నారుట. తాను పార్టీకి విధేయుడినేనని, అంత మాత్రాన తాను ఉంటున్న ప్రాంతానికి వ్యతిరేకంగా ఎలా మాట్లడగలను అని కూడా వాసుపల్లి గణేష్ కుమార్ అనుచరులతో తన వేదనను పంచుకుంటున్నారుట.

లేఖ రాశారా….?

కాగా, అమరావతి రాజధానికు మద్దతుగా వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీ పెద్దలకు నిజంగా లేఖ ఎపుడైనా ఇచ్చారా అన్నది ఇపుడు చర్చగా ఉంది. అలా కనుక ఆయన లేఖ ఇస్తే అది రాజధానిగా విశాఖను చట్టబద్ధంగా ఆమోదించడానికి ముందు అయి ఉంటుందా ఇవన్నీ తమ్ముళ్ళకు ప్రశ్నలే. ఇక నాడు టీడీపీ నేతలు ఏమన్నా కూడా ఇపుడు చట్టబధ్ధంగా రాజధానిగా విశాఖ ఏర్పాటు అయ్యాక అంతా సైలెంట్ గానే మద్దతు ఇస్తున్నారు. అలాటపుడు పాత లేఖ ఉన్నా కూడా దాన్ని ఈ సమయంలో బయటపెట్టడం అంటే వాసుపల్లి గణేష్ కుమార్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడమేనని ఆయన వర్గీయుల మాటగా ఉంది. అమరావతి రాజధాని టీడీపీ పెద్దలకే ముఖ్యం. కాబట్టి అంతపురంలోనే ఈ రాజకీయాలు నడిచాయా అన్నది పెద్ద డౌట్ గా ఉందిట.

పచ్చ మార్క్ పాలిటిక్సా…?

రాజకీయాల్లో తన పర భేదాలు ఉండవు, ఇపుడు చూస్తూంటే అదే నిజం అనిపిస్తోందని అంటున్నారు. విశాఖ టీడీపీ ప్రెసిడెంట్ గా బీసీ నేతగా వాసుపల్లి గణేష్ కుమార్ చేతనే జై అమరావతి అనిపిస్తే ఆ ప్రభావం గట్టిగా ఉంటుందని తలపోసే ఈ రకమైన రాజకీయానికి సొంత పార్టీలోనే తెర తీశారా అన్న డౌట్లు తమ్ముళ్ళకు వస్తున్నాయిట. వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీకి నిబధ్ధత కలిగిన నేత అని అటువంటి నేత పేరిట లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవడం అంటే పార్టీలోనే కుట్ర జరిగినట్లుగా భావిస్తున్నారుట. మరి దీని మీద చంద్రబాబు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

Tags:    

Similar News