ఈ ఎమ్మెల్యే ఎంత స్ట్రాంగ్ అన్నది ఇప్పడు అర్థమవుతుందా?

తెలుగుదేశం పార్టీని నాయకులను తయారు చేసే కర్మాగారంగా అధినేత చంద్రబాబు ఎపుడూ అభివర్ణిస్తూ ఉంటారు. ఒకరు పోతే వందమందిని తయారు చేసి చూపిస్తాను అని గట్టిగానే చెబుతారు. [more]

Update: 2021-01-23 08:00 GMT

తెలుగుదేశం పార్టీని నాయకులను తయారు చేసే కర్మాగారంగా అధినేత చంద్రబాబు ఎపుడూ అభివర్ణిస్తూ ఉంటారు. ఒకరు పోతే వందమందిని తయారు చేసి చూపిస్తాను అని గట్టిగానే చెబుతారు. మరి అటువంటి టీడీపీ నుంచి ఒక ఎమ్మెల్యే వైసీపీలోకి ఫిరాయించి నెలలు గడుస్తున్నా ఆయన ప్లేస్ లో మరో నేతను ఎంపిక చేయలేకపోతోంది పసుపు శిబిరం. విశాఖ అర్బన్ జిల్లాలో సౌత్ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కి ధీటు అయిన నేత ఎవరూ ఆ పార్టీకి కనిపించడంలేదు అంటున్నారు.

పాతుకుపోయారా…?

వాసుపల్లి గణేష్ కుమార్ ది పద్నాలుగేళ్ల రాజకీయం. విశాఖ సౌత్ లో కూడా ఆయన గత రెండు దశాబ్దాలుగా పాతుకుపోయారు. ముందు సామాజిక సేవా కార్యక్రమాలు విరివిగా చేపట్టి ఆనక టీడీపీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. దానికి ముందు ఆర్మీలో పనిచేసిన వాసుపల్లిది అంతా మిలట్రీ క్రమశిక్షణ. అందువల్ల టీడీపీలో తనకు అనుకూలంగా బలమైన అనుచర వర్గాన్ని తయారు చేసుకున్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ తోనే పార్టీ అన్నట్లుగా ఆయన హవా చలాయించారు. ఇపుడు ఆయన వైసీపీలోకి జంప్ చేయగానే మొత్తానికి మొత్తం ఆయన అనుచరులు, ఇతర‌ బలగం అంతా అటు వైపుగా షిఫ్ట్ అయిపోయింది.

తలలు పట్టుకున్నా….?

వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీని వీడి నెలలు గడచిన తరువాత తాపీగా ఈ మధ్యన టీడీపీ సౌత్ ఇంచార్జి ఎంపిక మీద పార్టీ నేతలు కసరత్తు మొదలెట్టారు. చాలా మంది పేర్లు పరిశీలనకు వచ్చినా కూడా వాసుపల్లికి ధీటు అయిన నాయకులు మాత్రం ఎవరూ లేకపోవడంతో పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. టీడీపీలో ఉన్నపుడు సర్వం సహా తానే అన్నట్లుగా వాసుపల్లి గణేష్ కుమార్ వ్యవహరించారు. ద్వితీయ శ్రేణి లీడర్ షిప్ ఎదగకుండా జాగ్రత్త పడ్డారు. ఇపుడు అదే టీడీపీకి అసలైన చిక్కులను తెచ్చిపెడుతోంది. దాంతో ఇపుడు ఉన్న వారిలో ఎవరిని ఎంపిక చేసినా టీడీపీకి మునుపటి వైభవం రాదు అన్న మాట వినిపిస్తోంది.

లోటు భర్తీ కానిదే….?

ఇక విశాఖ సౌత్ నియోజకవర్గాన్ని టీడీపీకి పెట్టని కోటలా మార్చిన ఘనత వాసుపల్లి గణేష్ కుమార్ దే. ఇక్కడ ఒకపుడు కాంగ్రెస్ కూడా బలంగా ఉండేది. దాంతో ఆ పార్టీ తరఫున చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే తన సామాజిక వర్గం అండదండలతో పాటు, తన దూకుడు రాజకీయంతో వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీకి ఎనలేని విజయాలు చేకూర్చారు. దాంతో జగన్ వేవ్ ఎంత బలంగా వీచినా కూడా వాసుపల్లి సౌత్ ని నుంచి మరో మారు గెలిచారు. ఆయన ఉండగా వైసీపీకి విజయం కష్టమని నమ్మే ఆ పార్టీ అధినాయకత్వం ఈ వైపునకు లాగేసింది. దాంతో ఇపుడు నాయ‌కత్వ లేమి అన్నది టీడీపీకి పట్టుకుంది. ఎవరిని ఎంపిక చేసినా కూడా వాసుపల్లి లేని లోటు భర్తీ చేయడం కష్టమేనని ఆ పార్టీలో అంటున్నారంటే ఈ సౌత్ ఎమ్మెల్యే ఎంత స్ట్రాంగ్ అన్నది ఇపుడిపుడే అధినాయకత్వానికి తెలిసివస్తోందిట.

Tags:    

Similar News