వైసీపీలో చేరినా టీడీపీ ఎమ్మెల్యేనట ?

అవును మరి. ఎన్నికల్లో చెడ తిట్టుకున్నారు. ఎన్నికల తరువాత ఏడాదిన్నర పాటు కూడా అలాగే గొడవలు సాగాయి. జగన్ ని అయితే నానా మాటలు అన్న పెద్ద [more]

Update: 2020-11-18 14:30 GMT

అవును మరి. ఎన్నికల్లో చెడ తిట్టుకున్నారు. ఎన్నికల తరువాత ఏడాదిన్నర పాటు కూడా అలాగే గొడవలు సాగాయి. జగన్ ని అయితే నానా మాటలు అన్న పెద్ద మనిషి అతను. విశాఖలో జగన్ భూ కబ్జాల మీద మీటింగ్ పెడితే జగన్ పాదం మోపిన ప్రదేశం అపవిత్రం అయిందని అతి పెద్ద కలరింగ్ ఇచ్చేసి మొత్తానికి మొత్తం ప్రాంతాన్ని పాలూ, పసుపు నీళ్ళతో కడిగిన అచ్చ పసుపు పెద్ద మనిషి ఆయన. ఇక జగన్ ని చంద్రబాబు కంటే ఎక్కువగా, అది వ్యక్తిగతంగా దూషించిన రికార్డు కూడా అయన‌దే. ఆయనే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఆయన ఇపుడు వైసీపీ నీడన చేరారు.

ఒప్పుకోరా….?

వాసుపల్లి గణేష్ కుమార్ గోడమీద పిల్లి అని వైసీపీ నేతలు అంటున్నారు. ఆయన తో మాకు పనేంటి అని కూడా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు. వాసుపల్లి విషయంలో అధినాయకత్వం తప్పు చేసిందని కూడా వాపోతున్నారు. ఇదిలా ఉంటే విశాఖ సౌత్ లో వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీలో చేరినా కూడా ఆయన టీడీపీ వర్గాన్నే తన వెంట తిప్పుకుంటున్నారు. టీడీపీ నుంచి తనతో వచ్చిన వారినే వెంట ఉంచుకుని రాజకీయం చేస్తున్నారు. తన సొంత అజెండాతో పనిచేస్తున్నారు అని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక వైసీపీకి సౌత్ ఇంచార్జిగా ఉన్న కోలా గురువులు అయితే వాసుపల్లి పొడ గిట్టకుండా ఉంటున్నారు. ఆయనతో అసలు పనిచేయమని కూడా తెగేసి చెప్పేస్తున్నారు.

ఎవరికి వారే….?

జగన్ పాదయాత్ర మూడేళ్ళు పూర్తి అయిన సందర్భంగా చేపట్టిన కార్యక్రమాలు కూడా విశాఖ సౌత్ లో రెండు వర్గాలుగానే సాగుతున్నాయి. సీనియర్ నేత, మాజీ ఎమెల్యే ద్రోణం రాజు శ్రీనివాస్ మరణించారు కానీ లేకపోతే సౌత్ లో మరో వర్గం కూడా ఉండేది. ఇక ద్రోణంరాజు రాజకీయ వారసుడిగా ఉన్న కుమారుడు శ్రీ వాత్సవ తన మద్దతు కోలా గురువులుకే ప్రకటించారు. ఆయనతో కలసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. . కోలా గురువులుకు మత్స్యకార సంఘం చైర్మన్ పదవిని జగన్ ఇచ్చారు. దీంతో ఆ పదవితో ఆయన మళ్ళీ హవా చాటుకుంటున్నారు. ఇంకో వైపు విడిగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పాదయాత్ర చేస్తున్నారు. వైసీపీ నేతలు ఎవరూ ఆయనతో కనిపించడంలేదు.

వాసుపల్లి విన్నపాలు ….

ఇదిలా ఉంటే విశాఖ సౌత్ ఎమ్మెల్యేగా తాను ఉన్న కాబట్టి తననే నియోజకవర్గం ఇంచార్జిగా ప్రకటించాలని వాసుపల్లి గణేష్ కుమార్ అపుడే విన్నపాలు చేసుకుంటున్నారు. వేరేగా ఇంచార్జిని నియమించడం ద్వారా రెండు గ్రూపులు వస్తాయని ఆయన వైసీపీ పెద్దలకు చెబుతున్నారుట. తనకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే పటిష్టం చేస్తానని ఆయన హామీ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇంచార్జి అంటే వచ్చే ఎన్నికల్లో ఆయనకే టికెట్ కూడా కన్ ఫర్మ్ అన్నమాట. ఇక్కడే కోలా గురువులు వర్గం అడ్డు తగులుతోంది. పదేళ్ళుగా పార్టీ కోసం పనిచేసి అన్నీ కోల్పోయి తాము ఉంటే నిన్నటి దాకా అధికార టీడీపీలో ఉన్న వాసుపల్లి గణేష్ కుమార్ రాజకీయ లబ్ది కోసమే వైసీపీలోకి వచ్చారని మండిపడుతున్నారు. ఆయనకు ఇంచార్జి పదవి ఇవ్వవద్దు అని వారు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు 2024 ఎన్నికల్లో టికెట్ కోలా గురువులుకే ఇవ్వాలని కూడా కోరుతున్నారు. మొత్తానికి విశాఖ సౌత్ లో వర్గ పోరు యమ రేంజిలో ఉంటోంది. వైసీపీ పెద్దలకు తలనొప్పిగా మారుతోంది అంటున్నారు.

Tags:    

Similar News