టీడీపీలో ఎస్సీల వార్‌… వర్ల టార్గెట్ అయ్యాడే..!

ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో కొత్త ర‌గ‌డ తెర‌మీదికి వ‌చ్చింద‌ని అంటున్నారు. ముఖ్యంగా పార్టీ ఎవ‌రినైతే.. బ‌లంగా ఉండాల‌ని కోరుకుంటోందో.. ఎవ‌రికైతే.. పార్టీ తర‌ఫున ప్రాధాన్యం పెంచాల‌ని విశ్వసిస్తోందో.. [more]

Update: 2020-10-26 14:30 GMT

ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో కొత్త ర‌గ‌డ తెర‌మీదికి వ‌చ్చింద‌ని అంటున్నారు. ముఖ్యంగా పార్టీ ఎవ‌రినైతే.. బ‌లంగా ఉండాల‌ని కోరుకుంటోందో.. ఎవ‌రికైతే.. పార్టీ తర‌ఫున ప్రాధాన్యం పెంచాల‌ని విశ్వసిస్తోందో.. ఆ వ‌ర్గంలోనే తీవ్రమైన అంత‌ర్గత కుమ్ములాట‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. అధికార పార్టీ వైసీపీకి బ‌ల‌మైన సామాజిక వ‌ర్గంగా అండ‌గా ఉంది ఎస్సీలు. గ‌త ఎన్నిక‌ల్లోనూ.. అంత‌కు ముందు ఎన్నిక‌ల్లోనూ వైసీపీ త‌ర‌ఫునే ఎస్సీలు నిల‌బ‌డ్డారు. అంతేకాదు, కాంగ్రెస్ సానుభూతిప‌రులుగా ఉన్న ఎస్సీలు వైసీపీ వైపు మ‌ళ్లారు. దీంతో టీడీపీ వీరిని ఎంత ద‌రిచేర్చుకుందామ‌నుకున్న ఫ‌లితం లేకుండా పోయింది.

ఎస్సీలకు ప్రాధాన్యత ఇవ్వాలని……

ఇది ఎన్నిక‌ల్లోనూ తీవ్రంగా ప్రభావం చూపించింది. గెలుస్తార‌ని అనుకున్న నాయ‌కులు అంతా ఓడిపోయారు. ఒక్క ప్రకాశం జిల్లాలోని కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గం మిన‌హాయిస్తే.. ఎక్కడా ఎస్సీ నాయ‌కులు గెలుపు గుర్రం ఎక్కలేదు. దీంతో ఎస్సీ వ‌ర్గాన్నిబ‌లోపేతం చేసేందుకు చంద్రబాబు కంక‌ణం క‌ట్టుకున్నారు. ఈ క్రమంలోనే రాజ‌మండ్రి పార్లమెంట‌రీ జిల్లా పార్టీ ప‌ద‌వికి ఎంతో మంది క‌మ్మ నేత‌లు పోటీ ప‌డినా.. ఎస్సీ వ‌ర్గానికి చెందిన మాజీ మంత్రి జ‌వ‌హ‌ర్‌కు ఇచ్చారు. అలానే ఇత‌ర ప‌ద‌వుల విష‌యంలోనూ ఆయ‌న సానుకూలంగా ఉన్నారు. అంటే.. పార్టీ ప‌రంగా ఎస్సీల‌ను మోయాల‌ని దాదాపు నిర్ణయానికి వ‌చ్చారు.

వర్ల రామయ్య దెబ్బకు…..

పార్టీ ప‌రంగా ఎస్సీల‌ను అక్కున చేర్చుకునేందుకు ఇంత జ‌రుగుతుంటే.. ఇదే పార్టీలో కీల‌కంగా ఉన్న పొలిట్ బ్యూరో స‌భ్యుడు, ఎస్సీ వ‌ర్గానికి చెందిన వ‌ర్ల రామ‌య్యపై గ‌తంలో ఎన్నడూ లేని విధంగా విమ‌ర్శలు వ‌స్తున్నాయి. ఆయ‌న‌ కార‌ణంగా.. తాము ఎద‌గ‌లేక‌పోతున్నామంటూ.. టీడీపీలో ఎస్సీ నాయ‌కులు గ‌గ్గోలు పెడుతున్నారు. అంతేకాదు.. రాష్ట్రంలో ఎస్సీల‌పై దాడులు జ‌రుగుతున్నా.. ఆయ‌న పెద్దగా స్పందించ‌డం లేద‌ని.. సొంత లాభం కోసం వెతుక్కుంటున్నార‌ని అంటున్నారు. జిల్లా ప‌ర్యట‌న‌ల‌కు వ‌చ్చినా.. ఎస్సీ నేత‌ల‌తోనే అన్నీ ఖ‌ర్చు చేయిస్తున్నార‌ని, స‌మ‌స్యలు వినిపించుకోవ‌డం లేద‌ని ఆ వ‌ర్గం నేత‌లు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

ఆయన పర్యటన అంటేనే….

పైగా.. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎస్సీ నేత‌ల మ‌ధ్య వివాదాలు, ఆధిప‌త్య ధోర‌ణలు ఉన్నాయి. వీటిని ప‌రిష్కరించే బాధ్యత‌లను చంద్రబాబు వ‌ర్ల రామయ్యకు అప్పగించార‌ని.. అయితే, ఆయ‌న మాత్రం త‌న‌కు ఏదైనా లాభం ఉంటుందా ? అనేకోణంలో వ్యవ‌హ‌రిస్తున్నారని చెబుతున్నారు. మీడియా మీటింగుల‌కు అయ్యే ఖ‌ర్చుల‌ను కూడా ఎస్సీ నేత‌ల‌పైనే మోపేస్తున్నార‌ని అంటున్నారు. ఈ వివాదం ఏ రెండు మూడు జిల్లాల‌కో ప‌రిమితం కాలేద‌ని తెలుస్తోంది దాదాపు ఐదారు జిల్లాల‌కు విస్తరించింద‌ని.. దీంతో వ‌ర్ల రామయ్య ప‌ర్యట‌న అంటేనే ఎస్సీ నేత‌లు బెంబేలెత్తుతున్నార‌ని తెలుస్తోంది.

బాబు కార్యాలయానికి…..

ఒక‌వేళ వర్ల రామయ్య వ‌స్తున్నాడ‌ని తెలిసి.. డుమ్మాకొడితే.. ఫోన్ చేసి మ‌రీ దూషిస్తున్నట్టు నాయ‌కులు చెప్పడం మ‌రింత వివాదంగా మారింది. ప్రస్తుతం ఇది బాబు కార్యాలయంలోకి చేరింద‌ని కూడా స‌మాచారం. ఇక ఇప్పటికే పార్టీని వీడిన కొంద‌రు నేత‌లు అయితే బిర్యానీ ప్యాకెట్లు, కారుకు ఫుల్ ట్యాంకు చేయిస్తే రాజ‌కీయం చేస్తున్నార‌ని కూడా వ‌ర్ల రామయ్యపై ప‌రోక్షంగా విరుచుకు ప‌డ్డారు. ఈ విమ‌ర్శల నేప‌థ్యంలో బాబు వ‌ర్ల రామయ్య విష‌యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ? చూడాలి.

Tags:    

Similar News