వర్ల ఓకే చెప్పింది అందుకేనట.. టీడీపీలో టాక్ ఇదే?

ఖ‌చ్చితంగా ఓడిపోతాన‌ని తెలిసి తెలిసి ఎవ‌రైనా పోటీకి దిగుతారా? ఎట్టి ప‌రిస్థితిలోనూ గెలిచేది లేద‌ని తెలిసి ఎవ‌రైనా బ‌రిలోకి దూకుతారా ? బుర్రున్న ఏ రాజ‌కీయ నాయ‌కుడు [more]

Update: 2020-03-24 09:30 GMT

ఖ‌చ్చితంగా ఓడిపోతాన‌ని తెలిసి తెలిసి ఎవ‌రైనా పోటీకి దిగుతారా? ఎట్టి ప‌రిస్థితిలోనూ గెలిచేది లేద‌ని తెలిసి ఎవ‌రైనా బ‌రిలోకి దూకుతారా ? బుర్రున్న ఏ రాజ‌కీయ నాయ‌కుడు కూడా ఈ ప‌నిచేసేది లేద‌ని తెగేసి చెబుతాడు. కానీ, టీడీపీలో చిత్రంగా వ‌ర్ల రామ‌య్య మాత్రం తాను ఓడిపోతాన‌ని తెలిసి కూడా రాజ్యస‌భ‌కు పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ బ‌లం టెక్నిక‌ల్‌గా 23. కానీ, ఇక్కడ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు త‌ట‌స్థంగా (అంటే వైసీపీకి మ‌ద్దతుగా) ఉన్నారు. దీంతో పూర్తి బ‌లం 20. మ‌రి ఈ నేప‌థ్యంలో రాజ్యస‌భ‌కు వెళ్లాలంటే.. వ‌ర్లకు ఎమ్మెల్యేల ఓట్లు ఏమాత్రం కూడా స‌రిపోవు. ఈ విష‌యం ఆయ‌న‌కు తెలియ‌దా ? అంటే తెలియ కుండా ఆయ‌న పోటీకి సిద్ధప‌డ‌లేదు.

ఓడిపోతానని తెలిసీ…..

సో.. తాను ఓడిపోతాన‌ని తెలిసి తెలిసి.. వ‌ర్ల రామ‌య్య పోటీకి దిగారు. ఎస్సీ వ‌ర్గానికి చెందిన రామ‌య్యను చంద్రబాబు వ్యూహా త్మకంగానే రాజ‌కీయంగా జ‌గ‌న్‌ను డిఫెన్స్‌లో ప‌డేసేందుకే రంగంలోకి దింపార‌నే ప్రచారం కొత్తదికాదు. స‌రే.. బాబు వ్యూహాల గురించి ప‌క్కన పెడితే.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో పామ‌ర్రు నుంచి పోటీ చేయాల‌ని చంద్రబాబు కోరిన‌ప్పుడు వ‌ర్ల రామయ్య మౌనం పాటించారు. త‌న ద‌గ్గర అంత డ‌బ్బు లేద‌ని అందుకే తాను పోటీకి దూర‌మ‌ని ఆయ‌న బ‌హిరంగంగానే ప్రక‌టించారు. అయితే ఇప్పుడు ఆయ‌న అనూహ్యంగా రాజ్యస‌భ రేసులోకి ఎందుకు వ‌చ్చారు? అనేది కీల‌క ప్రశ్న. ఇక్కడే టీడీపీలోని కొన్ని వ‌ర్గాల అన‌ధికార స‌మాచారం ప్రకారం.. రెండు విష‌యాలు వైర‌ల్ అవుతున్నాయి.

అనేక హామీలతోనే…?

వీటిలో ఒక‌టి.. పార్టీ త‌ర‌ఫున వ‌ర్ల రామయ్యకు ఆర్ధికంగా చంద్రబాబు భారీగానే సాయం చేస్తాన‌ని హామీ ఇచ్చార‌ట‌. అదే స‌మ‌యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ గెలిచి అధికారంలోకి రాగానే మంత్రి వ‌ర్గంలోకి తీసుకుంటామ‌ని, ఒక‌వేళ‌ అప్పటికి మండ‌లి ర‌ద్దయిపోతే, వ‌ర్ల ఎమ్మెల్యేగా గెల‌వ‌క‌పోతే.. రాజ్యస‌భ‌కు పంపుతామ‌ని హామీ ఇచ్చార‌ట‌. అదే స‌మ‌యంలో ఇప్పుడు ఆయ‌న‌ను పార్టీలో ఎలాగూ పొలిట్ బ్యూరో మెంబ‌ర్‌గా ఉంచారు క‌నుక ప్రతి రెండేళ్లకు ఈ క‌మిటీలో మెంబ‌ర్లను మార్చినా.. కొత్తవారిని చేర్చుకున్నా.. మ‌ళ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కు వ‌ర్ల రామయ్యకు అదే ప‌ద‌విలో ఉంచుతామ‌ని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీల నేప‌థ్యంలోనే తాను ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని తెలిసి కూడా వ‌ర్ల రామయ్య పోటీకి సిద్ధమ‌య్యార‌ని అంటున్నారు. మొత్తానికి వ‌ర్ల రామయ్య పోటీ వెనుక ఇంత ల‌బ్ధి ఉంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

Tags:    

Similar News