వర్లను ఎందుకు బలి చేస్తున్నారు?

పార్టీలో సీనియర్ నేత వర్ల రామయ్యను రాజ్యసభ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వర్ల రామయ్యను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడం హర్షణీయమే. దానిని [more]

Update: 2020-03-11 03:30 GMT

పార్టీలో సీనియర్ నేత వర్ల రామయ్యను రాజ్యసభ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వర్ల రామయ్యను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడం హర్షణీయమే. దానిని ఎవరూ కాదనలేరు. కానీ బలం ఉన్నప్పుడు చేసి ఉంటే అందరూ సంతోషించేవారు. కానీ ఓడిపోతారని స్పష్టంగా తెలిసినప్పుడు వర్ల రామయ్యను బరిలోకి దింపి చంద్రబాబు మరో అప్రదిష్టను మూటగట్టుకున్నారు.

గతంలో రాజ్యసభకు…..

గతంలో రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అప్పుడు టీడీపీ ఖచ్చితంగా గెలిచే అవకాశముంది. అప్పుడు మాత్రం వర్ల రామయ్య గుర్తుకు రాలేదు. టీజీ వెంకటేష్, సీఎం రమేష‌, సుజనా చౌదరి, కనకమేడల రవీంద్రకుమార్ లాంటి వాళ్లు మాత్రమే చంద్రబాబుకు గుర్తుకు వచ్చారు. అప్పట్లో కూడా వర్ల రామయ్య రాజ్యసభ పదవిని ఆశించారు. కానీ అప్పటి పరిస్థితుల మేరకు కనకమేడల రవీంద్ర కుమార్ ను ఎంపిక చేసినట్లు చంద్రబాబు తెలిపారు.

బలం లేకపోయినా…..

అయితే ఇప్పుడు రాజ్యసభ స్థానాలను గెలుచుకునే బలం చంద్రబాబుకు లేదు. శాసనసభలో కేవలం 23 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. వారిలో ఇద్దరు పార్టీకి దూరంగా ఉన్నారు. అంటే 21 మంది సభ్యులతో రాజ్యసభ ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో వర్ల రామయ్యను బరిలోకి దింపడం వెనక కూడా వేరే వ్యూహం ఉందంటున్నారు. ఎస్సీ సామాజికవర్గం నుంచి వర్ల రామయ్యను పోటీకి దింపామని వైసీపీ ఎమ్మెల్యేలు ఆలోచించి ఓటు వేయాలని చంద్రబాబు చెప్పడం కూడా విడ్డూరంగా ఉంది.

విప్ జారీ చేసి…..

రాజ్యసభ ఎన్నికల సందర్భంగా టీడీపీ శాసనసభ్యులకు విప్ జారీ చేస్తారు. ఓటు చూపించి వేయాల్సి ఉంటుంది. దీంతో పార్టీకి దూరంగా ఉన్న వల్లభనేని వంశీ, మద్దాలిగిరిలను ట్రబుల్ లోకి చంద్రబాబు నెట్టేవీలుంది. అలాగే మిగిలిన 21 మంది ఎమ్మెల్యేలను కూడా ఈ ఎన్నికతో కట్టడి చేసుకునే వీలుంది. అంతే తప్ప వర్ల రామయ్యకు పెద్దగా ఒనగూరే ప్రయోజనం లేదు. గెలవలేమన్నప్పుడే దళిత సామాజిక వర్గం చంద్రబాబుకు కనపడుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తతున్నాయి. అనవసర విమర్శలను ఎదుర్కొనడం తప్ప చంద్రబాబుకు ఉపయోగం ఏమీ లేదన్నది వాస్తవం.

Tags:    

Similar News