టిడీపీ ఓడిపోవడంతో ఆ నేత…?

విజయనగరం జిల్లాలో సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న మాజీ ఎమ్మెల్సీ వాసిరెడ్డి వరద రామారావు రాజీనామా చేశారు. ఆయన ఎన్నికల ముందే టీడీపీలో చేరారు. అంతకు [more]

Update: 2019-07-17 03:30 GMT

విజయనగరం జిల్లాలో సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న మాజీ ఎమ్మెల్సీ వాసిరెడ్డి వరద రామారావు రాజీనామా చేశారు. ఆయన ఎన్నికల ముందే టీడీపీలో చేరారు. అంతకు ముందు వైసీపీలో వుండేవారు. రెండేళ్ల క్రితం ఆయన జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. బొబ్బిలి టికెట్ ని ఆశించారు. అయితే దక్కపోవడంతో విజయనగరం జిల్లా రాజుల సమక్షంలో సైకిలెక్కేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తారని హామీ దక్కించుకున్నారు. అయితే ఘోరంగా టీడీపీ ఓడిపోవడంతో వాసిరెడ్డి మంచి టైం చూసుకుని మరీ పార్టీకి గుడ్ బై కొట్టేశారు. పోతూ పోతూ టీడీపీని నానా మాటలు అనేశారు.

పార్టీలు మార్చేస్తున్న పెద్దాయన….

వాసిరెడ్డి వరద రామారావు సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే. చంద్రబాబు కాలం నాటి వారు. 1978 ఎన్నీకల్లో తొలిసారి కాంగ్రెస్ తరఫున తెర్లాం అసెంబ్లీ సీటు నుంచి గెలిచిన ఆయన 1983లో టీడీపీ వేవ్ లో ఓడిపోయారు. తిరిగి 1999 ఎన్నికల్లోనే మళ్ళీ కాంగ్రెస్ తరఫున గెలిచారు. ఆ తరువాత ఆయనకు ఎక్కడా చాన్స్ దక్కలేదు. 2009 నాటికి అసెంబ్లీ సీట్ల పునర్వ్యస్తీకరణలో తెర్లాం సీటు పోయింది. దాంతో రామారావు బొబ్బిలి సీటు మీద కన్నేశారు. ఆయన టీడీపీలో చేరి లోకల్ బాడీ కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తరువాత వైసీపీలో చేరారు. మళ్లీ ఎన్నికల వేళ టీడీపీ గూట్లోకి వచ్చేశారు. ఇపుడు మళ్ళీ సైకిల్ దిగేశారు.

బీజేపీలోకేనట…

ఇదిలా ఉండగా వరద రామారావు తన రాజకీయ జీవితంలో అన్ని పార్టీలు మారారు. ఇపుడు ఇక మిగిలింది బీజేపీ. రేపటి రోజున అధికారంలోకి వస్తామన్న గ్యారంటీ టీడీపీకి లేకపోవడంతో ఆయన కేంద్రంలో అధికరంలో ఉన్న బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీకి కూడా చెప్పుకోవడానికి ఓ పెద్ద నేత తమ పార్టీలో చేరారన్న సంత్రుప్తి ఉంటుంది. దాంతో ఉభయకుశలోపరి గా ఆయన బీజేపీ వైపు వెళ్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ వయసులో పెద్దాయన కాషాయం పార్టీకి చేసేదేమీ ఉండదు, ఇక తాను అధికార పార్టీలో ఉన్నానన్న సంత్రుప్తి ఆయనకు ఉంటుంది.

Tags:    

Similar News