అందరినీ దూరం చేసుకున్నారు… ఇప్పుడు దగ్గరవుతారా?

వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కు అసలైన సవాల్ ముందుంది. ఇప్పటి వరకూ ఎలాగోలా నెట్టుకొచ్చిన వరప్రసాద్ ఇక అందరినీ కలుపుకుని పోక తప్పదు. గత ఎన్నికల్లో వైసీపీ [more]

Update: 2020-10-01 02:00 GMT

వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కు అసలైన సవాల్ ముందుంది. ఇప్పటి వరకూ ఎలాగోలా నెట్టుకొచ్చిన వరప్రసాద్ ఇక అందరినీ కలుపుకుని పోక తప్పదు. గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా గూడూరు నుంచి వరప్రసాద్ గెలుపొందారు. అంతకు ముందు ఆయన తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినా పట్టుబట్టి జగన్ గూడూరుకు వరప్రసాద్ న తీసుకొచ్చారు. గూడూరు నియోజకవర్గంలో పార్టీని ఒక గాడిన పెడతారని జగన్ భావించారు.

ఎన్నడూ లేనంత అసంతృప్తి…..

కానీ ఈ పదిహేను నెలల్లో వరప్రసాద్ ఎన్నడూ లేనంత అసంతృప్తిని మూటగట్టుకున్నారు. నిజానికి గతంలోనే గూడూరు నియోజకవర్గంలో పార్టీ బాగుండేది అన్నంతగా. నిజానికి గూడూరు నియోజకవర్గంలో టీడీపీకి మంచి పట్టుంది. 1985, 1994,1999, 2009 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ విజయం సాధించింది. అయితే వైసీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఆ పార్టీ జెండాయే ఎగురుతుంది. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గెలిచిన పాశం సునీల్ కుమార్ ఆ తర్వాత టీడీపీలో చేరిపోయారు.

ఈజీగానే గెలిచారు కానీ….

అయితే ఇక్కడ నేదరుమిల్లి, ఆనం కుటుంబాలకు పట్టుఉండటం, టీడీపీ నేత బల్లి దుర్గాప్రసాదరావు వైసీపీలో చేరడంతో వరప్రసాద్ గెలుపు మరింత సులువయింది. పాశం సునీల్ కుమార్ టీడీపీకి వెళ్లిన నాటినుంచి అక్కడ మేరిగ మురళి పార్టీ బాగోగులను చూసుకున్నారు. ఆయన మేకపాటి రాజమోహన్ రెడ్డి అనుచరుడు. కానీ వరప్రసాద్ ఈయనను పక్కన పెట్టారు. ఈయన వర్గానికి కూడా పనులు ఏవీ దక్కకుండా అడ్డుకుంటున్నారు. అనేక మంది వైసీపీ నేతలను దూరం చేసుకున్నారు.

ఏ నేతతో పడకపోవడంతో….

మరోవైపు ఇదే నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత పేర్నేటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి నేతలు బహిరంగ విమర్శలకు దిగారు. ఈ నేపథ్యంలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో గూడూరు నియోజకవర్గం కీలకంగా మారనుంది. ఇక్కడ అసంతృప్తులను తొలగించాల్సిన బాధ్యత ఇప్పుడు వరప్రసాద్ పైనే ఉంది. అయితే మరణించిన బల్లి దుర్గాప్రసాద్ ఇదే నియోజకవర్గానికి చెందిన నేత కావడంతో సానుభూతితో ఈ నియోజకవర్గంలో పార్టీకి మెజారిటీ వస్తుందని భావించి ఎప్పలిలాగానే ఉంటారో చూడాలి.

Tags:    

Similar News