జంక్షన్ దాటి బయటపడటం కష్టమే?

గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వి. వ‌ర‌ప్రసాద్ వ్యవ‌హారం పార్టీలో తీవ్ర చ‌ర్చకు దారితీస్తోంది. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో అనూహ్యంగా గూడూరు టికెట్‌ను సంపాయించుకున్న ఆయ‌న‌.. త‌ర్వాత కాలంలో [more]

Update: 2020-11-13 05:00 GMT

గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వి. వ‌ర‌ప్రసాద్ వ్యవ‌హారం పార్టీలో తీవ్ర చ‌ర్చకు దారితీస్తోంది. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో అనూహ్యంగా గూడూరు టికెట్‌ను సంపాయించుకున్న ఆయ‌న‌.. త‌ర్వాత కాలంలో తీవ్ర వివాదానికి కేంద్రంగా మారార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. త‌మిళ‌నాడు కేడ‌ర్‌కు చెందిన వ‌రప్రసాద్‌ స్వస్థలం కృష్ణాజిల్లా ముదినేప‌ల్లి. అయితే, ఉన్నతాధికారి కావ‌డంతో ఆయ‌న త‌మిళ‌నాడులోనే ఎక్కువగా ఉన్నారు. త‌ర్వాత 2014లో అనూహ్యంగారాజ‌కీయ తెర‌మీదికి వ‌చ్చిన వ‌ర‌ప్రసాద్.. తిరుప‌తి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపు గుర్రం ఎక్కారు.

ఆయన మారడంతో….

వైసీపీకి, జ‌గ‌న్‌కు కూడా ఎంతో స‌న్నిహితంగా ఉంటూ.. ఆయ‌న క‌నుస‌న్నల్లోనే కార్యకలాపాలు నిర్వహించారు. పార్లమెంటులోనూ త‌న‌దైన వాణిని వినిపించారు. అయితే, ఎక్కువ‌గా అగ్రవ‌ర్ణ నేత‌ల‌కు అందుబాటులో ఉండ‌ర‌నే విమ‌ర్శలు వున్నాయి. ఇదిలావుంటే.. బ‌ల్లి దుర్గాప్రసాద్ వైసీపీలోకి రావ‌డంతో తిరుప‌తి ఎంపీ స్థానాన్ని ఆయ‌న‌కు కేటాయించారు. దీంతో వ‌ర‌ప్రసాద్‌కు ఇక‌, టికెట్ లేద‌ని అనుకున్నారు. కానీ, అదృష్టం క‌లిసి వ‌చ్చి.. నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేశారు. ఇది వ‌ర‌ప్రసాద్‌కు క‌లిసి వ‌చ్చింది.

గూడూరు టిక్కెట్ సాధించి…..

లేద‌నుకున్న టికెట్ గూడూరు రూపంలో ఆయ‌న‌కు అందివ‌చ్చింది. ఇక‌, అక్కడ నుంచి పోటీ చేసి వ‌రప్రసాద్‌ విజ‌యం సాధించారు. అయితే, ఆయ‌న త‌న వివాద‌స్పద వైఖ‌రితో త‌ర‌చుగా మీడియాలో ఉంటున్నారు. తాను సొంతంగా భారీగా డ‌బ్బు పెట్టి గెలిచాన‌ని.. వ్యాఖ్యానిస్తున్నారు. ఏ ఒక్కరికి ప‌ని చేసి పెట్టాల‌న్నా.. వ‌సూళ్లకు పాల్పడుతున్నార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అధికారులను బెదిరించి మ‌రీ పనులు చేయించుకుంటున్నార‌నే విమ‌ర్శలు కూడా ఉన్నాయి.

రెడ్డి సామాజికవర్గం నేతలను….

ఇక‌, నెల్లూరులో కీల‌క‌మైన రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని ఎమ్మెల్యే వ‌ర‌ప్రసాద్ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని క‌నీసం ప‌నులు కూడా చేయించ‌డం లేద‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శలు వ‌స్తున్నాయి. ఎంత పెద్ద నేత‌లు వ‌చ్చినా డ‌బ్బు ముట్టచెప్పందే ప‌నులు చేయ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లు ఆయ‌న‌పై తీవ్రంగా వ‌స్తున్నాయి. అదేమంటే మీరు జ‌గ‌న్‌కు అయినా చెప్పుకోండి… నేను నా సొంత డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టి గెలిచాను… ఇప్పుడు సంపాదించుకోలేక‌పోతే ఎలా ? అని ప్రశ్నలు వేస్తున్నార‌ట‌.

వేమిరెడ్డి పంచాయతీ చేసినా…..

ఈ వ్యవ‌హారంపై ఇప్పటికే ప‌లువురు పార్టీ నేత‌లు జిల్లా స్థాయిలో ఏం చేయ‌లేక చేతులు ఎత్తేసి వేమిరెడ్డి ప్రభాక‌ర్‌రెడ్డి వ‌ద్దకు తీసుకువెళ్లారు. ప్రభాక‌ర్‌రెడ్డి సైతం సౌమ్యుడు కావ‌డంతో ఆయ‌న కూడా ఒక‌టికి రెండుసార్లు వ‌ర‌ప్రసాద్‌కు చెప్పినా ఉప‌యోగం లేదు స‌రిక‌దా.. వ‌ర‌ప్రసాద్ మ‌రింత రెచ్చిపోతున్నారు. ఆయ‌న తీరుతో పార్టీ కేడ‌ర్ గ‌గ్గోలు పెడుతోంది. జ‌గ‌న్ ఏదైనా జోక్యం చేసుకుంటేనే త‌ప్పా వ‌ర‌ప్రసాద్ లైన్ లోకి వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని వైసీపీ కీల‌క నేత‌లే త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

Tags:    

Similar News