వంగవీటికి మరో షాక్…. అక్కడికి షిప్ట్ చేస్తారటగా..?

రాజ‌కీయాల్లో కీల‌క నాయ‌కుడిగా ఎదుగుతున్న క్రమంలో చేసుకున్న స్వయంకృతం కార‌ణంగా వంగ‌వీటి రంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా ఇప్పుడు రాజ‌కీయ‌ న‌డిసంద్రంలో కొట్టిమిట్టాడుతున్నా డు. [more]

Update: 2020-03-28 00:30 GMT

రాజ‌కీయాల్లో కీల‌క నాయ‌కుడిగా ఎదుగుతున్న క్రమంలో చేసుకున్న స్వయంకృతం కార‌ణంగా వంగ‌వీటి రంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా ఇప్పుడు రాజ‌కీయ‌ న‌డిసంద్రంలో కొట్టిమిట్టాడుతున్నా డు. ఎప్పటిక‌ప్పుడు వ్యూహాలు వేసుకుని ముందుకుసాగిన వంగ‌వీటి రంగాకు.. వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన రాధా.. వ్యూహాల లేమితో .. ఎటు గాలి వీస్తే.. అటు కొట్టుకునే తెర‌చాప మాదిరిగా మారిపోయాడ‌నే వ్యాఖ్యలు విజ‌య‌వాడ‌లో ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. వంగవీటి రాధా కన్నా కూడా చాలా వెనుక రాజ‌కీయాల్లోకి వచ్చి న వారు విజ‌య‌వాడ‌లో దూకుడు ప్రద‌ర్శిస్తున్నారు.

ఫ్యాన్స్ కే నచ్చని విధంగా…..

అయితే వంగవీటి రాధా మాత్రం ఎక్కడిగొంగ‌ళి అక్కడే అన్న చందంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఎన్నో అంచ‌నాల‌తో 2004లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆయ‌న పొలిటిక‌ల్ కెరీర్ కేవ‌లం ఐదేళ్లకే 2009కే ముగిసిపోయింద‌నే అనుకోవాలి. ఆ త‌ర్వాత రెండు ఎన్నిక‌ల్లో రెండు పార్టీల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రాజ‌కీయంగా ఆయ‌న వేసి రాంగ్‌స్టెప్పులు ఆయ‌న్ను రాజ‌కీయంగా ప‌త‌నం అంచుకు చేర్చేశాయి. ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో ఆయ‌న యాక్టివ్ రోల్ ప్లే చేయ‌డం లేద‌ని జ‌గ‌న్ విజ‌య‌వాడ న‌గ‌ర రాజ‌కీయాల నుంచి త‌ప్పించేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న త‌న అభిమానుల‌కే న‌చ్చని విధంగా తెలుగుదేశంలోకి జంప్ చేశారు.

విజయం అంటే ఏంటో తెలియక..?

ఇప్పుడు టీడీపీకే భ‌విష్యత్తు ఉందా ? అన్న సందేహాల నేప‌థ్యంలో వంగవీటి రాధా ఎప్పటికి పుంజుకుంటారు? ఎప్పటికి కీల‌క నాయ‌కుడిగా ఎదుగుతారు? అనే ప్రశ్నల‌కు స‌మాధానం ల‌భించ‌డం లేదు. పోనీ ఈయ‌న‌కు కేడ‌ర్ లేదా ? అంటే.. తండ్రి వార‌స‌త్వంగా వ‌చ్చిన కేడ‌ర్ భారీగానే ఉంది. అదే సమయంలో కాపు సామాజిక వ‌ర్గం మొత్తం ఆయ‌న‌కు అండ‌గా నిలుస్తుంది. అయినా కూడా వంగవీటి రాధా వీరిని త‌న‌కు అనుకూలంగా వినియోగించుకోవ‌డంలో మాత్రం పూర్తిగా వెనుక‌బ‌డ్డార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గ‌తంలో కాంగ్రెస్ నుంచి విజ‌యం సాధించిన త‌ర్వాత ఇప్పటి వ‌ర‌కు ఆయ‌న విజ‌యం అంటే ఏమిటో కూడా చూడ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

నగరంలో పరిస్థితి….

2009, 2014 ఎన్నిక‌ల్లో క‌నీసం పోటీ చేసినా.. 2019లోకి వ‌చ్చే స‌రికి త‌న త‌ల‌బిరుసు త‌న‌మే త‌న‌ను పోటీకి దూరం చేసింది. పైగా చంద్రబాబు ప్రభుత్వం ప‌డిపోతుంద‌నే విష‌యం తెలిసి ఆ పార్టీలోనే కొంద‌రు పోటీకి దూరంగా ఉన్నారు. పార్టీ మారిపోయారు. వైసీపీ పంచ‌కు చేరిపోయారు. కానీ వైసీపీలోనే ఉండి.. జ‌గ‌న్‌కు అత్యంత అనుచ‌రుడిగా పేరు తెచ్చుకున్న వంగవీటి రాధా.. ఆ పార్టీని వ‌దిలేసి బ‌య‌ట‌కు వ‌చ్చి.. మ‌ళ్లీ వైసీపీలోకి వెళ్లే మార్గాల‌ను కూడా స్వయంగా మూసేసుకున్నారు. దీంతో ఆయ‌న ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మారిపోయింది. అంతేకాదు, ఆయ‌న‌కు ఇటు తూర్పు, అటు సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఓట్లు ప‌డే ప‌రిస్థితి లేకుండా చేసుకున్నారు.

ఎప్పటికి బయపడేనో?

కొస‌మెరుపు ఏంటంటే జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల‌కు ముందు రాధాను విజ‌య‌వాడ నుంచి త‌ప్పించి అవ‌నిగ‌డ్డ లేదా బంద‌రు ఎంపీ సీటు ఇస్తాన‌ని ప్రతిపాద‌న పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు రాధాను ఏకంగా జిల్లా దాటించి గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి (కోడెల మృతితో ఖాళీగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం) సీటును ఇవ్వాల‌ని.. అక్కడ బాధ్య‌త‌లు అప్పగించాల‌ని ఆలోచ‌న చేస్తున్నార‌ట‌. మ‌రి రాధా ఈ గంద‌ర‌గోళ ప‌రిస్థితి నుంచి ఎప్పటికి బ‌య‌ట ప‌డ‌తారో చూడాలి.

Tags:    

Similar News