వంగవీటి మరో ప్లాన్

వంగవీటి రాధా కృష‌్ణ టీడీపీలోకి వెళ్లడం మంచిదా? లేక మరో పార్టీ మారాలా? ఇదే చర్చ ఇప్పుడు వంగవీటి అభిమానుల్లో జరుగుతోంది. వంగవీటి రాధాకృష్ణ ను టీడీపీ [more]

Update: 2019-11-19 00:30 GMT

వంగవీటి రాధా కృష‌్ణ టీడీపీలోకి వెళ్లడం మంచిదా? లేక మరో పార్టీ మారాలా? ఇదే చర్చ ఇప్పుడు వంగవీటి అభిమానుల్లో జరుగుతోంది. వంగవీటి రాధాకృష్ణ ను టీడీపీ నుంచి బయటకు తీసుకురావాలని వంగవీటి రాధాకు అత్యంత సన్నిహితులు కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టీడీపీ ముద్ర పడితే వంగవీటి రాధా రాజకీయంగా మరింత దెబ్బతినే అవకాశముందని భావిస్తున్న సన్నిహితులు గత కొంతకాలంగా టీడీపీ నుంచి బయటకు రావాలని సూచిస్తున్నారు. ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు దీక్ష వద్దకు కూడా వంగవీటి రాధా రాలేదు.

టీడీపీలో చేరి….

వంగవీటి రాధా ఇప్పటికే రాజకీయ అవగాహన లేమితో అన్ని పార్టీలూ మారారు. అధికారంలోకి వచ్చే సమయంలో ఆయన పార్టీలు మారడం ఆయన బ్యాడ్ లక్ అని చెప్పాలా? స్వయంకృతాప రాధమనుకోవాలా? అన్నది దగ్గరి సన్నిహితులకు కూడా అర్థం కాకుండా ఉంది. గత ఎన్నికలకు ముందు వైసీపీలో ఉన్న వంగవీటి రాధా చివరి క్షణాల్లో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. చేరిపోవడమే కాకుండా తన తండ్రి రంగా హత్యకు, టీడీపీకి సంబంధంలేదంటూ ప్రకటించి రంగా అభిమానుల్లోనూ, కాపు సామాజిక వర్గంలోనూ అలజడి రేపారు.

సన్నిహితుల సమావేశంలో….

గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఎమ్మెల్సీ అయ్యేవారు. కానీ ఇప్పట్లో వంగవీటి రాధాఎమ్మెల్సీ అయ్యే ఛాన్స్ లేదు. మరో వైపు తెలుగుదేశ పార్టీలోనే కొనసాగినా వచ్చే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ దక్కుతుందన్న ఆశలేదు. ఇప్పటికే అక్కడ బోండా ఉమామహేశ్వరరావు ఉన్నారు. ఆయన ఇటీవల టీడీపీలో యాక్టివ్ గా కన్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో వంగవీటి రాధా భవితవ్యం మీద రంగా సన్నిహితులు ఇటీవల సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది.

వత్తిడి తీసుకువచ్చి….

అందుకే వంగవీటి రాధా జనసేనలో చేరేలా వత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. దేవినేని అవినాష్ కూడా టీడీపీని వీడి పోవడం తమకు కలసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలసి పోటీ చేసే అవకాశాలు ఉండటంతో జనసేన కోటాలో సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ ను వంగవీటి రాధా దక్కించుకోవచ్చన్న అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ‌్ కూడా పాలిటిక్స్ ను సీరియస్ గా తీసుకోవడం, టీడీపీ ముద్ర వంగవీటి రాధామీద లేకుండా చేయడంతోనే మళ్లీ వంగవీటి రాధాకు రాజకీయ భవిష్యత్ ఉంటుందని భావిస్తున్నారు. దీనిపై వంగవీటి రాధా త్వరలోనే నిర్ణయంతీసుకునే అవకాశముంది.

Tags:    

Similar News