అందుకే ఆ పార్టీలోకి….?

వంగవీటి రాధా… తప్పుడు అంచనాలు… సరైన వ్యూహాలు లేక తికమకపడుతూనే ఉన్నారు. యువకుడైన వంగవీటి రాధా ఇప్పటికి నాలుగు పార్టీలు మారారు. ఐదో పార్టీ మారేందుకు రెడీ [more]

Update: 2019-09-06 03:30 GMT

వంగవీటి రాధా… తప్పుడు అంచనాలు… సరైన వ్యూహాలు లేక తికమకపడుతూనే ఉన్నారు. యువకుడైన వంగవీటి రాధా ఇప్పటికి నాలుగు పార్టీలు మారారు. ఐదో పార్టీ మారేందుకు రెడీ అవబోతున్నారు. నిజం… ఇంత చిన్న వయసులో ఇన్ని పార్టీలు మారి వంగవీటి రాధా పొలిటకల్ రికార్డులు బ్రేక్ చేసేశారు. ఆయన లాగా పార్టీలు మారిన నేతలు భవిష్యత్తులో అతి తక్కువగా రాజకీయాల్లో కన్పిస్తారేమో.

ఐదో పార్టీకి….

వంగవీటి రాధా తాజాగా జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత కాంగ్రెస్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వంగవీటి రాధా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని నిలుపుకోలేదు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఓటమిపాలయ్యారు. తర్వాత ప్రజారాజ్యాన్ని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ వైసీపీలో చేరినప్పటికీ 2014లో వైసీపీ అధికారంలోకి రాలేదు. రాధా గెలవలేదు. దీంతో ఆయన 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఈసారి వంగవీటి రాధా పోటీ చేయకపోయినప్పటికీ టీడీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ వస్తుందని హామీ ఇచ్చారు. కానీ 2019 లో టీడీపీ అధికారంలోకి రాలేదు.

పవన్ తో భేటీతో…..

ఇక తాజాగా వంగవీటి రాధా జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన నిన్న దిండిరిసార్ట్స్ లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. ముందు నాదెండ్ల మనోహర్ తో చర్చించిన తర్వాత ఆయన పవన్ కల్యాణ్ తో భేటీ కావడం విశేషం. తన రాజకీయ భవిష్యత్ గురించి చర్చించేందుకే వంగవీటి రాధా పవన్ కల్యాణ్ ను కలిశారన్న చర్చ జరుగుతోంది. వీరి మధ్య చర్చల సారాంశం బయటకు రాకపోయినప్పటికీ వంగవీటి రాధా పవన్ తోనే కలసి నడవాలని నిర్ణయించుకున్నట్లు సమచారం.

పొత్తు ఉంటుందనేనా?

తెలుగుదేశం పార్టీ చేరే సమయంలో వంగవీటి రంగా హత్య పై రాధా చేసిన వ్యాఖ్యలు సొంత సామాజికవర్గానికే ఆగ్రహం తెప్పించాయి. దీంతో కాపు సామాజిక వర్గంకూడా వంగవీటి రాధా నాయకత్వాన్ని పెద్దగా ఇష్టపడటం లేదు. దీంతో తనకు జనసేన అయితేనే బెటర్ అని వంగవీటి రాధా నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల నాటికి జనసేన, టీడీపీ కలసి పోటీ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే తాను జనసేన కోటా నుంచి విజయవాడ సెంట్రల్ సీటును దక్కించుకోవచ్చన్నది వంగవీటి రాధా ఆలోచనగా ఉంది. మరి వంగవీటి ఈ నిర్ణయమైనా సక్సెస్ అవుతుందో? లేదో? చూడాలి.

Tags:    

Similar News