అనిత పార్ట్ టైం పాలిటిక్స్‌కు బాబు ఫుల్ మార్కులు

ఏపీలో విప‌క్ష టీడీపీలో ఇటీవ‌ల ప‌ద‌వులు పందేరం త‌ర్వాత తీవ్రమైన అసంతృప్తి, అస‌హ‌నాలు వ్యక్తమ‌వుతున్నాయి. ఊరూ పేరు లేని వాళ్లకు కూడా బాబు కీల‌క ప‌ద‌వులు క‌ట్టబెట్టడాన్ని [more]

Update: 2020-12-17 00:30 GMT

ఏపీలో విప‌క్ష టీడీపీలో ఇటీవ‌ల ప‌ద‌వులు పందేరం త‌ర్వాత తీవ్రమైన అసంతృప్తి, అస‌హ‌నాలు వ్యక్తమ‌వుతున్నాయి. ఊరూ పేరు లేని వాళ్లకు కూడా బాబు కీల‌క ప‌ద‌వులు క‌ట్టబెట్టడాన్ని చాలా మంది జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇక కొంద‌రికి ప‌ద‌వులు లేవురా బాబు అంటే.. మ‌రి కొంద‌రికి రెండు, మూడు ప‌ద‌వులు క‌ట్టబెట్టేశారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత‌కు కీల‌క ప‌ద‌వులు క‌ట్టబెట్టడంతో పార్టీలో చాలా మంది నేత‌ల‌తో పాటు సీనియ‌ర్ మ‌హిళా నేత‌లు కూడా జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇప్పటికే ఏపీ టీడీపీ మ‌హిళా అధ్యక్షురాలిగా ఉన్న వంగ‌ల‌పూడి అనిత‌ను పోలిట్‌బ్యూరోలోకి కూడా తీసుకున్నారు. కానీ వాస్తవంగా చూస్తే నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో కూడా పార్టీని న‌డిపించ‌లేని ఆమెకు ఏకంగా రాష్ట్రస్థాయిలో కీల‌క ప‌ద‌వులు అని ప‌లువురు తేరుకోలేక‌పోతున్నారు.

సొంత నియోజకవర్గంలోనే…..

టీచ‌ర‌మ్మగా ఉన్న వంగ‌ల‌పూడి అనిత‌ మాజీ మంత్రి గంటా ప్రోత్సాహంతో 2014 ఎన్నిక‌ల్లో పార్టీలోకి రావ‌డంతోనే పాయ‌క‌రావుపేట సీటు ద‌క్కించుకుని తొలి ప్రయ‌త్నంలోనే ఎమ్మెల్యే అయ్యారు. అసెంబ్లీలో కాస్త వాయిస్ వినిపించ‌డంతో పాటు అందరి దృష్టిని ఆక‌ర్షించారు. అనుభ‌వం లేకుండానే ఎమ్మెల్యే అయిన ఈ మాజీ టీచ‌ర‌మ్మ సొంత నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర వ్యతిరేక‌త ఎదుర్కోవ‌డంతో పాటు వంగ‌ల‌పూడి అనిత‌కు సీటిస్తే ఓడిస్తామ‌ని సొంత పార్టీ నేత‌లే భారీ ర్యాలీలు చేశారు. చంద్రబాబు ఆమె ఎలాగైనా అసెంబ్లీలో ఉండాల‌ని జిల్లాలు దాటించి మ‌రీ ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కొవ్వూరులో పోటీ చేయించినా ప్రస్తుత మంత్రి తానేటి వనితో చేతిలో ప‌రాజ‌యం పాల‌వ్వక త‌ప్పలేదు.

ఇంత అసంతృప్తి ఉన్నా….

ఎన్నిక‌ల్లో ఓడిన వంగ‌ల‌పూడి అనిత‌కు బాబు మ‌ళ్లీ పాయ‌క‌రావుపేట ఇన్‌చార్జ్ ప‌గ్గాలు ఇచ్చారు. ఆమెకు అక్కడ పార్టీ బాధ్యత‌లు ఇవ్వడం నియోజ‌క‌వ‌ర్గంలో కాపు, మ‌త్స్యకార పార్టీ నేత‌ల‌తో పాటు ఎస్సీల్లోనే చాలా మందికి ఇష్టం లేదు. వీరి మ‌ద్దతు లేనిదే పాయ‌క‌రావుపేట‌లో పార్టీ జెండా ఎగ‌ర‌దు. పైగా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు సౌమ్యుడు. అంద‌రిని క‌లుపుకుని పోయే మ‌న‌స్తత్వం ఉన్న వ్యక్తి. ఆయ‌న్ను అనిత లాంటి అస‌మ్మతి, అసంతృప్తి ఇమేజ్ ఉన్న నేత ఢీ కొట్టడం సాధ్యమ‌య్యే ప‌నికాదు. వీటికి తోడు చాల‌ద‌న్నట్టుగా ఆమె పార్టీలో ప్రమోష‌న్ల మీద ప్రమోష‌న్లు, ప‌ద‌వులు ఇచ్చేస్తున్నారు.

నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకునే తీరికేది .. ?

వంగ‌ల‌పూడి అనిత‌కు రాష్ట్ర స్థాయిలో కీల‌కంగా పార్టీ ప‌గ్గాలు ఇచ్చినా ఆమెకు నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకున్న తీరికే లేద‌న్న విమ‌ర్శలు వస్తున్నాయి. సొంత పార్టీ నేత‌లే ఈ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విశాఖ న‌గ‌రంలోని పెద వాల్తేరులో నివాసం ఉండే ఆమె చుట్టుపు చూపుగా మాత్రమే పాయ‌కారావుపేట వ‌చ్చి వెళుతుంటారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఆమెను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గ్రూపుల‌కే స‌ర్దిచెప్పుకోలేని ఆమె ఇక రాష్ట్ర స్థాయిలో పార్టీని ఏం ఉద్దరిస్తారు ? ఎలా ప్లస్ అవుతార‌న్నది కూడా బాబు వేసుకోవాల్సిన ప్రశ్నే.. విశాఖ నుంచి అనిత‌కు పాయ‌క‌రావుపేట‌కు రావ‌డానికి మూడు గంట‌లు.. వెళ్లడానికి మ‌రో మూడు గంట‌లు ప‌డుతుంది.

రెండు మూడు నెలలకు….

ఇమె పాయ‌క‌రావుపేట‌కు వ‌చ్చినా ఇక్కడ ఉండే ప్రస‌క్తే లేదు. సాయంత్రానికి విశాఖ‌కు చెక్కేయాల్సిందే. వంగ‌ల‌పూడి అనిత‌కు పాయ‌క‌రావుపేట గుర్తొచ్చిన‌ప్పుడు రెండు నెల‌ల‌కో, మూడు నెల‌ల‌కో వ‌చ్చినా ఆమె ఇక్కడ గంట‌కు మించి ఉండ‌ని ప‌రిస్థితి. ఈ లెక్కన అక్కడ పార్టీ ఏం బ‌ల‌ప‌డుతుంది ? వంగ‌ల‌పూడి అనిత‌ నాయ‌క‌త్వాన్ని ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న నేత‌లు సైతం ఆమెను ఎలా ? అంగీక‌రిస్తారో ? కూడా తెలియ‌ని ప‌రిస్థితి. నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌బ‌లం ఉన్న బ‌ల‌మైన నేత‌ల‌ను ప‌క్కన పెట్టిన అనిత జ‌నాలు లేని చెక్క భ‌జ‌న రాయుళ్లను వెంటేసుకోవ‌డం వ‌ల్లే గ‌త ఎన్నిక‌ల్లో ఆమెకు ఇక్కడ టిక్కెట్ రాలేదు.

ఇప్పుడు కూడా….

ఇప్పుడు కూడా ఆమె పాయ‌క‌రావుపేట‌లో పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తూ రాష్ట్ర ప‌ద‌వుల‌ను వెల‌గ‌బెట్టడం చూస్తే బాబుకు ఈ ప‌ద‌వులు ఇవ్వడానికి వంగ‌ల‌పూడి అనిత‌కు మించిన గ‌తి లేదా ? అని ఆ పార్టీ వాళ్లే చెప్పుకుంటున్నారు. రాష్ట్ర స్థాయిలో కీల‌క ప‌ద‌వుల్లో ఉండేవారు స్థానికంగా తిరుగులేకుండా ఉండాలి. అనిత‌పై అక్కడ సొంత పార్టీలో ఉన్న వ్యతిరేక‌త ఇలాగే ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఆమెకు ప‌రాజ‌యం అయితే త‌ప్పదు. మ‌రి ఆమె త‌న రూటు ఎలా ? మార్చుకుంటుందో ?

Tags:    

Similar News