Ycp : హమ్మయ్య… ఎట్టకేలకు పదవి దక్కింది…?

ఎంత నిరీక్షణ.. ఎంతకాలం ఓపిక.. ఒక దశలో పార్టీ పదవికి రాజీనామా చేయాలనుకున్నారు. చెప్పేశారు కూడా. చివరకు తేరుకుని తూచ్ అనేశారు. ఎంతో కాలం నుంచి వేచి [more]

Update: 2021-11-12 14:30 GMT

ఎంత నిరీక్షణ.. ఎంతకాలం ఓపిక.. ఒక దశలో పార్టీ పదవికి రాజీనామా చేయాలనుకున్నారు. చెప్పేశారు కూడా. చివరకు తేరుకుని తూచ్ అనేశారు. ఎంతో కాలం నుంచి వేచి చూస్తున్న పదవి ఇప్పుడు లభిస్తుంది. ఆయనే విశాఖ జిల్లాకు చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్. ఆయన ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న పదవి లభించింది. స్థానిక సంస్థల కోటాలో జగన్ ఆయనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. విజయం నామమాత్రమే కావడంతో ఆయన ఎమ్మెల్సీ కావడమే తరువాయి.

తొలి నుంచి….

వంశీకృష్ణ శ్రీనివాస్ తొలి నుంచి వైసీపీలోనే ఉన్నారు. జగన్ పార్టీ పెట్టిన రోజున తొలిసారిగా విశాఖ నుంచి జెండా పట్టుకున్నది ఆయనే జగన్ ఓదార్పు యాత్ర చేసే సమయంలోనూ ఆయన ఇంట్లోనే బస చేశారు. అలాంటి వంశీకృష్ణ శ్రీనివాస్ కు 2014లో విశాఖ తూర్పు నియోజకవర్గం టిక్కెట్ ను కేటాయించారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన వైసీపీలోనే ఉన్నా పార్టీ పదవులకే పరిమితమయ్యారు.

నాడు టిక్కెట్ ఆశించి….

2019 ఎన్నికలలో విశాఖ తూర్పు టిక్కెట్ ను వంశీకృష్ణ శ్రీనివాస్ ఆశించినా జగన్ ఆయనకు ఇవ్వలేదు. వీమ్మార్డీఏ ఛైర్మన్ పదవి వస్తుందనుకున్నారు. కానీ ఆ పదవికి అక్రమాని విజయనిర్మలను జగన్ ఎంపిక చేశారు. ఇక ఆయనకు విశాఖ మేయర్ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఎన్నికల సమయంలో పక్కన పెట్టేశారు. దీంతో వంశీకృష్ణ శ్రీనివాస్ కొంత ఫైర్ అయ్యారు. విశాఖ వైసీపీ అర్బన్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. కానీ వెంటనే తాను ఆ ప్రకటన చేయలేదని చెప్పడంతో ఆ వివాదం సద్దుమణిగింది.

ఎట్టకేలకు….?

అనంతరం తన కుటుంబ సభ్యులతో వంశీకృష్ణ శ్రీనివాస్ జగన్ ను కలసి వచ్చారు. ఆ సమయంలోనే జగన్ ఎమ్మెల్సీ హామీ ఇచ్చినట్లు తెలసింది. అనుకున్న ప్రకారమే జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. పన్నెండేళ్ల నుంచి ఎదురు చూస్తున్న పదవిని ఎట్టకేలకు ఆయనను వరించబోతుంది. యాదవ సామాజికవర్గానికి చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్ ఎంపిక పార్టీకి విశాఖలో ఎంతో ఉపయోగపడుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Tags:    

Similar News