వైసీపీలో వంశీ భవిష్యత్తు ఏంటో…?

విశాఖ మేయర్ అభ్యర్ధిత్వం కోసం రేగిన చిచ్చు అధినాయకత్వానికి కొంత ఇబ్బంది కలిగించింది అని చెప్పాలి. ఏపీలో 74 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో చైర్మన్లు, మేయర్ పదవులకు [more]

Update: 2021-04-06 15:30 GMT

విశాఖ మేయర్ అభ్యర్ధిత్వం కోసం రేగిన చిచ్చు అధినాయకత్వానికి కొంత ఇబ్బంది కలిగించింది అని చెప్పాలి. ఏపీలో 74 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో చైర్మన్లు, మేయర్ పదవులకు సజావుగా అభ్యర్ధులను ఎంపిక చేసిన హై కమాండ్ కి ఎక్కడా పెద్దగా చికాకులు తలెత్తలేదు. కానీ విశాఖ మేయర్ విషయంలో మాత్రం కొంత రచ్చ జరిగింది. అది టీడీపీ అనుకూల మీడియాలో బాగా హైలెట్ అయింది కూడా.

ఫోకస్ ఉన్న చోట…?

విశాఖను పాలనా రాజధానిగా చేసిన జగన్ ఎవరిని మేయర్ చేస్తారు అన్న ఆలోచన కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. దాంతో అందరి చూపూ జగన్ వైపే ఉంది. ఇక జగన్ అనూహ్యమైన నిర్ణయంతో విశాఖ మూల వాసినే మేయర్ ని చేసి బయట జనాల చేత శభాష్ అనిపించుకున్నారు. కానీ సొంత పార్టీలో మాత్రం అదే అసమ్మతికి దారితీసింది. తనకు మేయర్ సీటు నేరుగా జగనే హామీ ఇచ్చారంటూ ఆ పార్టీ విశాఖ నగర ప్రెసిడెంట్ వంశీ కృష్ణ శ్రీనివాస్ హై కమాండ్ ని పాయింట్ అవుట్ చేస్తూ మాట్లాడిన మాటలు మీడియాలో హైలెట్ అయ్యాయి. అంతే కాదు. ఆయన అనుచరులు సృష్టించిన హడావుడి కూడా పార్టీ పెద్దల ఆగ్రహానికి గురి అయింది.

రాజీనామాతో …….

ఇక విశాఖ సిటీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసిన వంశీ కృష్ణ శ్రీనివాస్ తన కార్పొరేటర్ పోస్ట్ ని సైతం వదులుకుంటానని చెప్పడమూ హై కమాండ్ దృష్టిని దాటిపోలేదు. ఆయన ఇలా ఫైర్ అవుతున్న వేళ టీడీపీ సహా ఇతర పార్టీలకు చెందిన వారు మద్దతుగా మాట్లాడడం, ఆయనకు అన్యాయం జరిగిందని పేర్కొనడంతో మొత్తానికి వంశీ కృష్ణ శ్రీనివాస్ కార్నర్ అయిపోయారు. ఆయనకు పార్టీ అన్యాయం చేయదు అని విజయసాయిరెడ్డి హామీ ఇచ్చినా వంశీ అనుచరులు మొదట్లో చేసిన రచ్చ కారణంగా వంశీ కృష్ణ శ్రీనివాస్ కి వైసీపీ పెద్దలకు మధ్య గ్యాప్ ఏర్పడింది అంటున్నారు.

గుడ్ బై కొడతారా…?

ఇక వైసీపీని నమ్ముకుని పదేళ్ళుగా పనిచేశానని సర్వస్వం ధారపోశానని వంశీ కృష్ణ శ్రీనివాస్ చెబుతున్నారు. తనకు ఏ పదవీ ఇప్పటిదాకా దక్కలేదని కూడా ఆయన అంటున్నారు. వైసీపీ హై కమాండ్ మాత్రం వంశీ కృష్ణ శ్రీనివాస్ కి ఒక నామినేటెడ్ పదవి ఇచ్చి శాంతపరచాలని చూస్తోంది. కానీ వంశీ కృష్ణ శ్రీనివాస్ మద్దతుదారులు దీంతో ఆగుతారా అన్నది చూడాలి. ఇంకో వైపు ఆయన వైసీపీని వీడి బయటకు వెళ్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. మెగాస్టార్ వీరాభిమాని అయిన వంశీ కృష్ణ శ్రీనివాస్ అప్పట్లో ప్రజారాజ్యం టికెట్ సంపాదించారు అంటారు పైగా ఆయనకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో కూడా సన్నిహిత పరిచయాలు ఉన్నాయి. దీంతో వంశీ కృష్ణ శ్రీనివాస్ ప్రస్తుతానికి సైలెంట్ అయినా భవిష్యత్తులో మాత్రం సంచలనంగానే మారుతారు అన్నది పార్టీ లోపలా బయటా మాట. కానీ తాను మాత్రం జగన్ని వీడిపోనని వంశీ కృష్ణ శ్రీనివాస్ అంటున్నారు. చూడాలి మరి

Tags:    

Similar News