అసెంబ్లీలో వంశీ బరస్ట్…ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని వినతి

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీపై ధ్వజమెత్తారు. నియోజకవర్గ సమస్యలపై తాను ముఖ్యమంత్రిని కలిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని వల్లభనేని వంశీ అన్నారు. ఈరోజు [more]

Update: 2019-12-10 03:55 GMT

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీపై ధ్వజమెత్తారు. నియోజకవర్గ సమస్యలపై తాను ముఖ్యమంత్రిని కలిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని వల్లభనేని వంశీ అన్నారు. ఈరోజు సమావేశాలు ప్రారంభం కాగానే వల్లభనేని వంశీ ప్రసంగించారు. వల్లభనేని వంశీ మాట్లాడుతుండగా తెలుగుదేశం పార్టీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి స్పీకర్ తమ్మినేని సీతారాం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది తెలుగుదేశం పార్టీ కార్యాలయం కాదని, సభలో సభ్యుడికి మాట్లాడే హక్కు ఉందని అన్నారు. సభలో సభ్యుల గొంతునొక్కే ప్రయత్నం చేస్తే సహించనని స్పీకర్ హెచ్చరించారు. సీఎంను కలిస్తే చంద్రబాబుకు ఉలుకెందుకని వల్లభనేని వంశీ ప్రశ్నించారు.

నియోజకవర్గ అభివృద్ధి కోసమే….

తాను నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు, నీటి పంపిణీ గురించి మాత్రమే తాను సీఎం జగన్ ను కలిశానన్నారు. అయితే తాను సీఎం జగన్ ను కలిస్తే చంద్రబాబు తన సోషల్ మీడియా ద్వారా అసభ్యకరంగా కామెంట్స్ పెట్టారన్నారు. పోలవరం కుడికాల్వ విద్యుత్తు కోసమే కలిశానని వల్లభనేని వంశీ చెప్పారు. తాను ముఖ్యమంత్రి జగన్ ను కలవడం ఇదే లొతిసారి కాదని వల్లభనేని వంశీ తెలిపారు. దీనికి తెలుగుదేశం పార్టీ తనను బహిష్కరించిందన్నారు. దీనిపై టీడీపీ అనేక రాద్ధాంతం చేసిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై తాను ముఖ్యమంత్రిని అభినందించానన్నారు. తన తల్లిదండ్రులిద్దరూ టీచర్లు కావడంతో ఇంగ్లీష్ మీడియం అవసరం తనకు తెలుసునన్నారు వల్లభనేని వంశీ.

పప్పు బ్యాచ్ వల్లనే…..

తాను జగన్ మంచిపనులు చేస్తుంటే పప్పు బ్యాచ్ సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేసిందన్నారు. జయంతికి వర్థంతికి తేడా తెలియని వాళ్లు ట్విట్టర్ కే పరిమితమయ్యారన్నారు. నలభై ఏళ్ల ఇండ్రస్ట్రీ అనే చంద్రబాబు ఎందుకు తాను మాట్లాడుతుండగా బయటకు వెళ్లిపోయారన్నారు. ఇసుక కొరత మీద కూడా తాను ప్రభుత్వ పక్షాన నిలవడానికి కారణం వరదల వల్లనేనని తనకు తెలుసునన్నారు. ఎన్నడూ లేనంత వర్షాలు కురిశాయన్నారు. వర్షాల వల్లనే ఇసుక కొరత వచ్చిందన్నారు. అయినా ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వకుండా టీడీపీ రాద్ధాంతం చేసిందన్నారు వల్లభనేని వంశీ. పిడివాదన సరికాదన్న తనను పలావు పొట్లాం గాళ్లతో తనపై విమర్శలు చేశారన్నారు. తాను కూడా ఇక టీడీపీలో కొనసాగే పరిస్థితి లేదని, తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించి తన హక్కులను కాపాడాల్సిందిగా వల్లభనేని వంశీ స్పీకర్ ను కోరారు.

Tags:    

Similar News