వల్లభనేని వంశీ రాజీనామా

తెలుగుదేశం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ కొద్దిసేపటి క్రితం రాజీనామా చేశారు. ఆయన ఎమ్మెల్యే పదవితో పాటు టీడీపీ ప్రాధమిక శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు కొద్దిసేపటి [more]

Update: 2019-10-27 11:46 GMT

తెలుగుదేశం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ కొద్దిసేపటి క్రితం రాజీనామా చేశారు. ఆయన ఎమ్మెల్యే పదవితో పాటు టీడీపీ ప్రాధమిక శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం మీడియాకు లేఖను విడుదల చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు తన రాజీనామా లేఖను పంపారు. అయితే తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని వల్లభనేని వంశీ చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. రెండు సార్లు తనకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు అవకాశం కల్పించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే గన్నవరం వైసీపీ ఇన్ ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు రేపు ముఖ్యమంత్రి జగన్ ను కలవనున్నారు.

Tags:    

Similar News