రాజీనామా ఖాయమట

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు వ‌స్తాయో.. నాయ‌కులు ఎలా మ‌న‌సు మార్చుకుంటారో కూడా చెప్పడం క‌ష్టం. అచ్చు ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి కృష్ణాజిల్లాలో చోటు చేసుకుంటోంద‌ని అంటున్నారు [more]

Update: 2019-08-17 13:30 GMT

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు వ‌స్తాయో.. నాయ‌కులు ఎలా మ‌న‌సు మార్చుకుంటారో కూడా చెప్పడం క‌ష్టం. అచ్చు ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి కృష్ణాజిల్లాలో చోటు చేసుకుంటోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. విజ‌య‌వాడ‌కు స‌మీపంలో కృష్ణాజిల్లా ప‌రిధిలోకి వ‌చ్చే గన్నవరం నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురించి భారీ ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో వల్లభనేని వంశీ విజ‌యం సాధించారు. వాస్తవానికి ఎన్నిక‌ల‌కు ముందు కూడా ఈయ‌న పై పొరుగు రాష్ట్రం ఒత్తిళ్లు ఉన్నాయ‌ని, పార్టీ మారాల‌ని బ‌ల‌వంతం చేస్తున్నార‌ని వార్తలు వ‌చ్చాయి. అయితే, అప్పట్లో ఇవి నిజ‌మో కాదో తెలియ‌దు కానీ… వల్లభనేని వంశీ మాత్రం పార్టీ మారింది లేదు.

వైసీపీలోకి వెళ్లేందుకు…..

అంతేకాదు, జ‌గ‌న్ సునామీలోనూ ఆయ‌న టీడీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించారు వల్లభనేని వంశీ. స్వల్ప మెజార్టీతో వైసీపీ అభ్యర్థిపై వల్లభనేని వంశీ విజ‌యం సాధించారు. అయితే, పార్టీ ఓడిపోయిన నేప‌థ్యంలో ఇప్పటి వ‌రకు వల్లభనేని వంశీ యాక్టివ్‌గా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు, పార్టీలో నేతల‌ను కూడా స‌రిగా ప‌ట్టించుకోలేదు. రెండు రోజుల కింద‌ట జ‌రిగిన పార్టీ రాష్ట్రస్థాయి స‌మావేశానికి కూడా వల్లభనేని వంశీ గైర్హాజ‌రయ్యారు. దీంతో ఆయ‌న రాజ‌కీయ వ్యూహంపై ఏదో జ‌రుగుతోంద‌ని అంద‌రూ అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే స‌ద‌రు ఎమ్మెల్యేకి అత్యంత అనుచ‌రులుగా ఉండే కొంద‌రు వెల్లడించిన విష‌యాన్ని బ‌ట్టి.. వల్లభనేని వంశీ పార్టీని వీడి.. త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి అధికార పార్టీలోకి జంప్ చేస్తార‌ని అంటున్నారు.

బీజేపీ ఆఫర్ ఉన్నా….

వల్లభనేని వంశీకి టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఓ కీల‌క నేత బీజేపీలోకి రావాల‌ని ఆఫ‌ర్ ఇచ్చారు. వల్లభనేని వంశీకి ఆ బీజేపీ నేత‌కు మ‌ధ్య ద‌గ్గరి బంధుత్వం ఉండ‌డంతో ఆయ‌న ఆ ఎమ్మెల్యేపై ప్రెజ‌ర్ చేసినా ఆయ‌న మాత్రం టీడీపీలోనే కొన‌సాగుతున్నారు. వల్లభనేని వంశీకి సీఎం జ‌గ‌న్‌తో పాటు అదే జిల్లాకు చెందిన ఓ డైన‌మిక్ మంత్రితోనూ చాలా స్నేహం ఉంది. ఆయ‌న పార్టీ మారాల‌నుకుంటే అక్కడ కూడా రెడ్ కార్పెట్ వేసి మ‌రీ స్వాగ‌తం ప‌లికేందుకు రెడీగా ఉన్నారు.

ఉప ఎన్నికకు వెళతారా?

ఇక వల్లభనేని వంశీ స‌న్నిహితులు చెపుతోన్న దానిని బ‌ట్టి చూస్తే దీనిలో నిజం ఎంత ? అనే విష‌యం రోజులు గ‌డిస్తేనే త‌ప్ప చెప్పలేం. అయితే, వాస్తవానికి గ‌తంలో నూ ఇలాంటి అసంతృప్తులు చాలా మంది ఆయా ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసి వేరే పార్టీల త‌ర‌పున పోటీ చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు..తెలంగాణ‌లోని ఆసిఫ్‌న‌గ‌ర్ లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో అప్పటి కాంగ్రెస్ నాయ‌కుడు దానం నాగేంద‌ర్ కాంగ్రెస్ టిక్కెట్ రాక‌పోవ‌డంతో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. వైఎస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆ పార్టీలో చేరిపోయారు. ఈ క్రమంలోనే త‌న ఎమ్మెల్యే ప‌ద‌వి వ‌దులుకుని మ‌రీ మ‌ళ్లీ కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. అప్పుడు ఆసిఫ్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక వ‌చ్చింది. దానిలో గెలిచి స‌త్తాచాటుతాన‌ని చెప్పిన ఆయ‌న ఎంఐఎం దెబ్బకి ఓట‌మి పాల‌య్యారు. ఆ త‌ర్వాత తెలంగాణ ఉద్యమ స‌మ‌యంలో ఎంతో మంది ఇత‌ర పార్టీల‌కు చెందిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోకి వెళ్లి ఆ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు… ఒక‌రిద్దరు ఓడారు. మ‌రి ఇలాంటి క్రిటిక‌ల్ ప‌రిస్థితిని వల్లభనేని వంశీ ఎదుర్కొంటారా ? లేదా ? అన్నది కూడా డౌటే.

Tags:    

Similar News