ఆయనకే మినహాయింపు ఎందుకో?

పదవీకాలం పూర్తయిన అందరు గవర్నర్లను మార్చారు. కాని ఆయనను ఒక్కడిని మాత్రం అలాగే ఉంచారు. ఆయనే కర్ణాటక గవర్నర్ వాజూభాయ్ వాలా. కర్ణాటకలో ఇంకా రాజకీయ అనిశ్ఛితి [more]

Update: 2019-09-02 16:30 GMT

పదవీకాలం పూర్తయిన అందరు గవర్నర్లను మార్చారు. కాని ఆయనను ఒక్కడిని మాత్రం అలాగే ఉంచారు. ఆయనే కర్ణాటక గవర్నర్ వాజూభాయ్ వాలా. కర్ణాటకలో ఇంకా రాజకీయ అనిశ్ఛితి కొనసాగుతుంది. మంత్రి వర్గ విస్తరణ, శాఖల కేటాయింపు తర్వాత బీజేపీ సీనియర్లలో అసంతృప్తి పెల్లుబుకుతోంది. ఇప్పటికి కొంత సద్దుమణిగినట్లు కన్పిస్తున్నప్పటికీ ఎప్పుడు ఏమైనా జరగొచ్చన్నది మాత్రం వాస్తవం. అందుకే పదవీకాలం ముగిసినా కర్ణాటక గవర్నర్ వాజూభాయ్ వాలాను మాత్రం కేంద్ర ప్రభుత్వం కొనసాగించింది.

పదవీ కాలం ముగిసినా…..

నిజానికి వాజుభాయి వాలా పదవీకాలం ఆగస్టు 31వ తేదీతోనే ముగిసింది. ఆయన కర్ణాటకలో ఐదేళ్ల పాటు గవర్నర్ గా కొనసాగారు. అయినా ఆయనను ప్రస్తుతానికి గవర్నర్ పదవి నుంచి తప్పించలేదు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, తెలంగాణ గవర్నర్ నరసింహన్, రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్, కేరళ గవర్నర్ సదాశివంలను మాత్రం తప్పించారు. వారి స్థానంలో వేరే వారిని నియయించారు. వీరిలో విద్యాసాగర్ రావు, కల్యాణ్ సింగ్ లు బీజేపీ నేతలే.

నలుగురు గవర్నర్లు మార్చినా….

అయినా వారికి గవర్నర్లుగా మళ్లీ నియమించలేదు. వారి స్థానంలో కొత్త వారిని నియమించారు. అయితే కర్ణాటక గవర్నర్ వాజూభాయ్ వాలా విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం భిన్నంగా ఆలోచించింది. ఆయన పదవీకాలం ఐదేళ్లు పూర్తయినప్పటికీ ఆయనన కర్ణాటక గవర్నర్ గానే కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లుంది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. యడ్యూరప్ప ప్రభుత్వం ఇంకా కుదురుకోలేదు.

అనిశ్చితి కారణంగానేనా?

అంతేకాదు వాజూభాయ్ వాలా ప్రధాని నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడని పేరుంది. ఆయనను మరో టర్మ్ కొనసాగించాలని మోడీ భావిస్తున్నారు. దీనికి తోడు కర్ణాటక రాజకీయాలు కూడా కలసి వచ్చాయి. పదిహేడు స్థానాలకు ఉప ఎన్నికలువచ్చే అవకాశముండటం, యడ్యూరప్ప సర్కార్ నేటికీ ప్రమాదం అంచున ఉండటంతో తనకు అత్యంత నమ్మకస్థుడైన వాజూభాయ్ వాలా ఉంటేనే బెటరని మోదీ, షాలు భావించినట్లుంది. అందుకే మిగిలిన వారికి భిన్నంగా ఆయనను గవర్నర్ పదవి నుంచి తప్పించలేదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News