ఇక్కడ ఇంత చెత్తగా ఉన్నామా? ఇలాగైతే?

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు ఈసారి భారతీయ జనతా పార్టీకి చుక్కలు చూపనున్నాయి. గత ఎన్నికలకు ముందున్న వాతావరణం ప్రస్తుతానికి లేదు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు [more]

Update: 2020-09-15 16:30 GMT

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు ఈసారి భారతీయ జనతా పార్టీకి చుక్కలు చూపనున్నాయి. గత ఎన్నికలకు ముందున్న వాతావరణం ప్రస్తుతానికి లేదు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉన్నప్పటికీ బీజేపీ కేంద్ర నాయకత్వంలో కంగారు మొదలయింది. ప్రధానంగా ఇక్కడ ఎస్సీ, కాంగ్రెస్ పార్టీలు కొంత పుంజుకుంటున్నట్లు కనపడటమే ఇందుకు కారణం. ఇంటలిజెన్స్ నివేదికల మేరకు ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీకి సానుకూల వాతావరణం లేదని అర్ధమయింది.

మొన్నటి ఎన్నికల్లో….

గతంలో జరిగిన ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. గత ఎన్నికల్లో బీజేపీ రివర్స్ సోషల్ ఇంజనీరింగ్ చేసి బీజేపీ సక్సెస్ అయింది. ప్రధానంగా ఉత్తర్ ప్రదేశ్ లో కులాల వారీగా ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయన్న సంగతి అందరికీ తెలిసిందే. సమాజ్ వాదీ పార్టీకి యాదవులు అండగా నిలుస్తూ వస్తున్నారు. అలాగే మాయావతి బహుజన్ సమాజ్ పార్టీకి దళితులు అండగా ఉన్నారు. ఇక ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ నుంచి మరలి ఎస్పీ వైపు మళ్లారు.

సోషల్ ఇంజినీరింగ్ తో…..

కానీ గత ఎన్నికల్లో బీజేపీ యాదవేతర బీసీలను తనకు అనుకూలంగా మలచుకోవడంలో సక్సెస్ అయింది. బీజేపీకి బ్రాహ్మణ, బనియా, ఠాకూర్లు మద్దతుగా నిలిచారు. ట్రిపుల్ తలాక్ బిల్లు తేవడంతో ముస్లిం మహిళల ఓటర్లను ఆకర్షించగలిగారు. దీంతో గత ఎన్నికల్లో అనేక నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించగలిగింది. అయితే ఈసారి ఇది రివర్స్ అవుతుందన్న భయం బీజేపీని పట్టుకుంది.

మరలిపోతున్న ఓటు బ్యాంకు……

యోగి ఆదిత్యానాధ్ పాలనలో ప్రజల్లో ఎక్కువగా అసంతృప్తి కలిగిందంటున్నారు. అలాగే ఇంతకాలం బీజేపీకి అనుకూలంగా ఉన్న బ్రాహ్మణ, ఠాకూర్ ఓటర్లలో ఎక్కువ మంది కాంగ్రెస్ వైపు మరలుతున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. ముస్లిం ఓటర్లు కూడా ఎస్సీని వదిలేసి కాంగ్రెస్ వైపు నిలబడతారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. దీంతో బీజేపీ కేంద్ర నాయకత్వం అప్రమత్తమయింది. దీనిపై త్వరలోనే ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలపై సమీక్ష జరపాలని కేంద్ర నాయకత్వం నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. బీహార్ ఎన్నిలకు ముగిసిన తర్వాత ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. మొత్తం మీద అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ చేజారి పోతుందన్న భయం పట్టుకుంది.

Tags:    

Similar News