జగన్ ఫెయిలవుతుంది ఇక్కడేనట

ఆంధ్రప్రదేశ్ కు ప్రతి బడ్జెట్ లోనూ అన్యాయం జరుగుతోంది. కేవలం ముఖ్యమంత్రి జగన్, మంత్రుల ఢిల్లీ పర్యటనలతో రాష్ట్రానికి ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరడం లేదు. జగన్ కూడా [more]

Update: 2020-02-23 13:30 GMT

ఆంధ్రప్రదేశ్ కు ప్రతి బడ్జెట్ లోనూ అన్యాయం జరుగుతోంది. కేవలం ముఖ్యమంత్రి జగన్, మంత్రుల ఢిల్లీ పర్యటనలతో రాష్ట్రానికి ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరడం లేదు. జగన్ కూడా విజయసాయిరెడ్డి వంటి నేతలపైనే ఆధారపడుతున్నారు. కానీ అసలు విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఐఏఎస్ ల లాబీయింగ్ లేకపోవడం వల్లనే గత ఆరేళ్లుగా ఏపీ నష్ట పోతుందన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్ కూడా అదే పంథాను పాటస్తున్నారు.

ఐఏఎస్ లే కీలకం…..

ఏ ప్రభుత్వానికైనా ఐఏఎస్ లు కీలకం. ఐఏఎస్ లాబీయింగ్ ఉంటేనే పనులు జరుగుతాయిి. కేంద్ర సర్వీసుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ లు లేకపోవడంతో నిధుల విడుదల కూడా సాధ్యం కావడం లేదు. అంతేకాదు ముఖ్యమంత్రి ఇచ్చిన వినతి పత్రాలను కూడా ఫాలో అప్ చేసే అధికారి లేకపోవడంతోనే ఈ దుస్థితి. నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక రకాలైన ఈక్వేషన్లతోనే రాష్ట్రాలకు నిధుల కేటాయింపు జరుపుతుందన్నది వాస్తవం.

నిధుల కేటాయింపులోనూ…..

కీలకమైన ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు జరగాలంటే సీనియర్ ఐఏఎస్ ల సహకారం అవసరమన్న విషయాన్ని పాలకులు గుర్తించలేక పోతున్నారు. ఐఏఎస్ లను తక్కువ అంచనాలు వేసి రాజకీయ నేతలే పనులు చక్కబెట్టుకోవాలనుకోవడం ఇందుకు కారణం. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటాలు కూడా దక్కడం లేదు. రాజకీయంగా కంటే సివిల్ సర్వీసెస్ లాబీయింగ్ ఎక్కువ ఉంటేనే పనులు జరుగుతాయన్నది వాస్తవం. ఐఏఎస్ ల లాబీయింగ్ కేంద్రంలో బలంగా ఉంటున్నది కాదనలేని వాస్తవం. మంత్రులను సయితం వారు ఒప్పించ గల నైపుణ్యం, సమర్థత ఉంటుంది.

లాబీయింగ్ కొరవడటంతో…..

అయితే కొంతకాలంగా ఢిల్లీలో ఐఏఎస్ ల లాబీయింగ్ కొరవడింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ లు ఎవరూ కీలక శాఖల్లో లేరు. ముఖ్యమైన రైల్వే, చమురు, వాణిజ్య ఆర్థిక శాఖల్లో తెలుగు ఐఏఎస్ లు లేకపోవడంతో రాష్ట్ర ప్రయోజనాలు దక్కడం లేదు. ఎక్కువగా తమిళనాడు, బీహార్, పశ్చమ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్ లకు చెందిన ఐఏఎస్ లే ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ లు అప్రధాన శాఖల్లో ఉన్నప్పటికీ వారి లాబీయింగ్ ను మన నేతలు ఉపయోగించుకోవడం లేదు. అందుకే గ్యాస్, చమురు నిక్షేపాలు మన రాష్ట్రం నుంచి మహారాష్ట్ర, గుజరాత్ లకు వెళ్లిపోతున్నా ఏం చేయలేకపోతున్నాం. ఇప్పటికైనా ఐఏఎస్ లను జగన్ ఉపయోగించుకుని రాష్ట్రాలకు అధిక వాటా దక్కేలా ప్రయత్నించాలని పలువురు సూచిస్తున్నారు. ఐఏఎస్ ల సహకారం లేకుండా జగన్ ఎన్నిసార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా ఫలితం ఉండకపోవచ్చు.

Tags:    

Similar News