వాజపేయి అనారోగ్యంగా లేకుంటే ...?

Update: 2018-11-26 18:29 GMT

ఖురాన్ లో చెప్పింది అందరికి వర్తిస్తుంది. ముస్లిం లకే వర్తించదు. ఆయన చెప్పిన నీతులు ఏమైతే ఉన్నాయో హిందువులప ట్ల మనం అదే పాటించాలి. అందరికి వర్తిస్తుంది తప్ప ఇది కాదు మనం మన మతం వాళ్లనే కాపాడుకోవాలనే పద్ధతే తప్పు అని డైరెక్ట్ గా చెప్పాడు షేక్ అబ్దుల్లా. వీళ్ళంతా ఎవరు ? షేక్ అబ్దుల్లా ఎవరు ? షేక్ అబ్దుల్లా తాత బ్రాహ్మణుడు. కొన్ని కారణాల వల్ల ఇస్లాం స్వీకరించారు. ఈదేశం లో ముస్లింలు బయట దేశాలనుంచి వచ్చినవారు కాదు. ఇక్కడ వారే మత స్వీకరణలు చేసుకోవడం వల్ల ముస్లిం లు గా మారారు.

అన్ని కులాల వారూ.....

ఇందులో బ్రాహ్మణులు అన్ని కులాల వారు వున్నారు. పెద్ద టెర్రరిస్ట్ అని గొడవ గొడవ చేరిన మక్మల్ భట్ ... భట్ అంటే బ్రాహ్మణుడు. ఈ మధ్యే చంపేశారు వేణి అంటే వైశ్య . ఇంకొకరు మాలి అంటే తోట మాలుల కులం. వృత్తిని బట్టి ఇవన్నీ. హిస్టరీ చూస్తే క్లియర్ గా తెలుస్తాయి. మెజారిటీ కాశ్మీరీలు బ్రాహ్మణులు. కన్వర్టెడ్ ఇన్ టూ ఇస్లాం. పటేల్ ను పెంచి నెహ్రూను తగ్గిస్తే రాహుల్ మునిమనుమడు కాబట్టి అదేమైనా తగ్గుతుందేమో అన్న ఆలోచన చేయడం లోనే డొల్లతనం బయటపడింది. అంటే వాళ్ళకు లీడర్ లేడు. అని తేల్చారు బీజేపీని టార్గెట్ చేశారు ఉండవల్లి.

వాజపేయి ని ఎందుకు విస్మరిస్తున్నారు ...?

వాజపేయిని వారు ఎందుకు విస్మరిస్తున్నారు..? వాజ్ పేయి మంచి ప్రభుత్వాన్ని ఇచ్చాడు. లిబరల్ గా ఉండేవాడు చేయమనండి. మోదీని గుజరాత్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోమని చెప్పినవాడు వాజ్ పేయి. అతని పేరు చెప్పడు. అద్వానీ లాంటివాడు లేకపోతే పార్టీ లేదు. అద్వానీ పటేల్ లాంటి వ్యక్తి. పార్టీ మొత్తం అద్వానీ చేతుల్లో పెట్టుకుని నడిపించాడు. వాజ్ పేయి కేవలం గ్లామర్ ఫిగర్. సేమ్ వాళ్లిద్దరూ ఇదే కాంబినేషన్. ఈయన అద్వానీని కొట్టాడు. వాజ్ పేయి అనారోగ్యంతో బతికిపోయాడు లేకపోతే వాజ్ పేయికి ఇదే పరిస్థితి వచ్చేది. వీళ్ళు వల్లభాయ్ పటేల్ ను తీసుకొచ్చి హైలెట్ చేయడం తప్పేమి లేదు.చాలా పేర్లు వున్నాయి వాటి స్థానంలో పటేల్ పేరు పెట్టి మార్చేయండి.

చరిత్రను వక్రీకరించడమే....

పోలవరం ప్రాజెక్ట్ ఇందిరాగాంధీ పేరుతో ఉండేది. తీసేసారు. మీరు కూడా మార్చేయండి. రాజీవ్ ఆరోగ్యశ్రీ వుంది. పటేల్ ఆరోగ్యశ్రీ చేయండి. ఎయిర్ పోర్ట్ లు పటేల్ ఎయిర్ పోర్ట్ లు చేసేయండి. ఊళ్ల పేర్లనే మార్చేస్తున్నారు. ఫైజాబాద్ ను అయోధ్య చేసేసారు. కాశిని వారణాశి చేస్తారట. ఏదేదో మార్చేయండి. తప్పులేదు. ఎందుకని అన్ని వేలకోట్లు పెట్టి విగ్రహం పెట్టడం..? సరే వాళ్ళు ప్రభుత్వ నిర్ణయం అనుకోండి దాంట్లోకి మనం వెళతాం. అన్ని వేలకోట్ల రూపాయలు పెట్టి విగ్రహాలు ఇవాళా పటేల్ ను తీసుకువచ్చి పటేల్ నెహ్రు రోజు దెబ్బలాడేసుకునేవారు, పటేల్ ను తొక్కేసి నెహ్రు ... ఈ తరహా ప్రచారం చరిత్ర కాదు. చరిత్రను వక్రీకరించడమే అది. అని వివరించారు ఉండవల్లి అరుణ కుమార్.

Similar News