ప్రధాని ఎలా అయ్యారు ..?

Update: 2018-11-26 17:30 GMT

ఆ రోజు ఇందిరను ప్రధానిగా పెట్టడానికి కారణం ఆవిడకు ఎదో కాంగ్రెస్ లో బలం ఉందని కాదు. ప్రజల్లోకి నెహ్రు కూతురుగా ఇందిరను తీసుకువెళితే కాంగ్రెస్ కి లబ్ది ఉంటుందని కామరాజ్ నాడార్ తదితరులు, వారిని సిండికేట్ అని పిలిచేవారు ఆ నలుగురు కలిసి నిర్ణయం చేశారు. ఈరోజు పటేల్ కుటుంబానికి చేసింది వాళ్ళు ఎంపీలు అయ్యారు రాజకీయాల్లో వున్నారు. తరువాత మణిబాయ్ పటేల్ పోయినప్పుడు ఎంపీగా చనిపోయినట్లు గుర్తు. అన్నారు ఉండవల్లి.

కాశ్మీర్ రహస్యం ఇదే ...?

కాశ్మీర్ నెహ్రు జోక్యం వల్లే ఇలా తగలబడింది అన్నది వుంది. పటేల్ జోక్యం చేసుకుని ఉంటే సక్సెస్ అయ్యేది. నెహ్రూ ఎంటర్ కావడం వల్లే ఇలా అయిపొయింది అనే ప్రచారం సాగుతుంది. అది నిజమే. కాశ్మీర్ సమస్య తలెత్తినప్పుడు పటేల్ మంత్రిగానే వున్నారు. అందరికి తెలియని రహస్యం ఏమిటి అంటే ? రహస్యం ఏమి కాదు పుస్తకాల్లో వున్నదే. పటేల్ కాశ్మీరును పాకిస్తాన్ కు ఇచ్చేందుకు ఒప్పేసుకున్నాడు. చాలా సింపుల్ రూల్ ఏమిటంటే జునాగఢ్ బోర్డర్ లో వుంది. జునాగఢ్ లో హిందువులు ఎక్కువ. పాలకుడు ముస్లిం. జునాగఢ్ పాకిస్తాన్ లో కలిసిపోతామని రాజు రాసిచ్చాడు నవాబ్ గారు. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం.. రిఫరెండం పెట్టండి. ఫ్లెబిసైట్ పెట్టండి. ప్రజలు ఏమని అనుకుంటే అదే జరగాలి అంతే తప్ప రాజుకు ఇస్తే కుదరదు. ఇండియా ఇండిపెండెంట్ యాక్ట్ ప్రకారం రాజు ఎవరితో కలుస్తాను అంటే వారితో కలవొచ్చు. లేదు ఇండిపెండెంట్ గా ఉండాలనుకుంటే ఉండిపోవచ్చు. కానీ జునాగఢ్ లో వారు కలుస్తాం అన్నది వ్యతిరేకించం. జునాగఢ్ ఎవరిది పటేల్ పుట్టి పెరిగిన ప్రదేశం. జునాగఢ్ లో ఈ రూలు పెట్టినప్పుడు కాశ్మీర్ లో ముస్లింలు అధికంగా వున్న చోట దాని వ్యతిరేక రూలు ఎలా పెడతాం? రాజుగారు కాశ్మీర్ పాకిస్థాన్ లో కలిపేయడం కరెక్ట్ అని పటేల్ అభిప్రాయపడ్డాడు. దాన్ని నెహ్రూ వ్యతిరేకించాడు. నెహ్రు ఏమన్నారంటే అది పాకిస్థాన్ ముస్లిం రాజ్యం ఇది హిందువుల రాజ్యం కాదు. సెక్యులర్ రాజ్యం. సో అక్కడ జనాన్ని డిసైడ్ చేసుకోమనండి. కాశ్మీరీలు పాకిస్తాన్లో కలవాలంటే కలవొచ్చు, ఇండియా లో కలవాలంటే కలవొచ్చు. జునాగఢ్ లో పెట్టినట్లే ఇక్కడ కూడా ఫ్లెబిసైట్ పెట్టండి అన్నారు నెహ్రు. ముస్లిం లు అత్యధికంగా వున్న చోట పాకిస్తాన్ లో కలుస్తారా ? ఇండియా లో కలుస్తారా ? అంటే పాకిస్తాన్ లో కలుస్తాం అంటారు కానీ ఇండియాలో కలుస్తారా ? కానీ విచిత్రం ఏమిటంటే ఇండియా లో కలుస్తాం అంటారు. కారణం షేక్ అబ్దుల్లా. అని వెల్లడించారు చరిత్రను అరుణ కుమార్.

నెహ్రు, తో అబ్దుల్లా కు వున్న స్నేహం ...

షేక్ అబ్దుల్లా నెహ్రూకు వున్న వ్యక్తిగత స్నేహమో లేకపోతే అబ్దుల్లా సెక్యులర్ భావాలో పబ్లిక్ లో రాజు గారిని వ్యతిరేకించిన ఏకైక నాయకుడు కావడం వల్ల డైరెక్ట్ గా ఫ్లెబిసైట్ పెడితే ఇండియాలో కల్సుస్తాం అంటారు గాని పాకిస్తాన్ లో కలుస్తాం అని అనరు. దీనివల్ల మాకు అన్యాయం జరుగుతుంది ఇప్పుడు ఫ్లెబిసైట్ పెట్టడానికి వీలు లేదు అని అన్నది ఎవరు జిన్నా. కానీ అందరు భావించేది వాయిదాలు వేసుకుంటూ వచ్చేశాం, కాశ్మీర్ ను ఆక్రమించేశాం అని భావిస్తారు. పాకిస్తాన్ వాళ్ళు కూడా అదే ఆరోపణ చేస్తారు. ముస్లిం లకు చెందాలిసింది కదా అని కానీ అది నిజం కాదు. డైరెక్ట్ గా పెడదాం ఇక్కడ అంటే జిన్నా అంగీకరించలేదు. షేక్ అబ్దుల్లా అక్కడ ఉండగా మాకు ద్రోహమే జరుగుతుంది. ఎవరైనా థర్డ్ పార్టీ చేత చేయించండి అన్నాడు జిన్నా. దానికీ ఒప్పుకున్నాడు నెహ్రు. ఒకే యుఎన్ఓ వాళ్ళ చేత చేయిద్దామని ముందుకు వచ్చారు. అప్పుడు జిన్నా దానికి ఒప్పుకోలేదు. అబ్దుల్లా ఉండగా కుదరదు. అబ్దుల్లా అప్పుడు కాశ్మీర్ కు ప్రధాని. అబ్దుల్లాను తీసేసి ఫ్లెబిసైట్ పెడితే మేం ఒప్పుకుంటాం అని జిన్నా చెప్పాడు. అని తెలిపారు అరుణ కుమార్.

జిన్నా జబ్బు తెలిసి ఉంటే అఖండ భారత్ ...?

1948 జనవరిలో గాంధీ గారిని చంపేశారు. ఆరునెలలకు జిన్నా చనిపోయాడు. మౌంట్ బాటన్ అంటాడు. జిన్నా ఇంకా టిబితో బాధపడుతున్నాడు, చనిపోతాడని తెలిస్తే నేను ఒక ఏడాది వాయిదా వేసి ఉండేవాడిని గొడవలు లేకుండా ఇండియా అంతా ఒకటిగా ఉండేది అని బాటన్ తన డైరీలో రాసుకున్నాడు. నాకు ఆసంగతి ఎవ్వరు చెప్పలేదు. జిన్నా కూడా ఎక్కడా దొరకలేదు. డాక్టర్స్ కి కూడా చెప్పాడట జిన్నా ఇది బయటకు రానీయకండి పాకిస్తాన్ ఏర్పడాలి అప్పుడే నేను చావాలి అది ఆ రోజున జరిగిన రాజకీయం. అన్నారు ఉండవల్లి.

పార్లమెంట్ లో అంబేద్కర్ ఏమన్నారు ..?

ఒక సందర్భంలో అంబేద్కర్ పార్లమెంట్లో అన్నారు. నెహ్రు ఎప్పుడో మూడు నాలుగు వందల ఏళ్ళక్రితం మీ కుటుంబం కాశ్మీర్ నుంచి వలస వచ్చేశారుగా. ఇంకా ఎందుకు నీకు ? ఆ కాశ్మీర్ మీద పిచ్చ. ఎందుకు అంత డబ్బు ఖర్చుపెడుతున్నావ్ కాశ్మీర్ మీద భారతీయుల సొమ్మంతా తీసుకువెళ్ళి ఆ కాశ్మీర్ మీద ఖర్చుపెడతావా ? అంటే నెహ్రు అనే మనిషి వల్లే కాశ్మీర్ అనేది ఇండియా లో వుంది. పటేల్ కాశ్మీర్ ఇండియా లో వుండాలని ఏనాడు అనుకోలేదు. నెహ్రు ఏదో చేస్తున్నాడు చేయనీయమని ఊరుకున్నాడు తప్ప. అని వివరించారు ఉండవల్లి.

కాశ్మీర్ లో మాత్రం...

డివిజన్ సమయంలో మొత్తం అగ్గి బుగ్గైపోయింది. పంజాబ్ లో హిందూ ముస్లింలు బెంగాల్ లో మత ఘర్షణలు చెలరేగి ఒకరినొకరు వేల సంఖ్యలో చంపేసుకున్నారు. వేల సంఖ్యలో చచ్చి పోయారంటే కనిపిస్తే నరుక్కోవడమే. భయంకరమైన గొడవ జరుగుతున్నా సమయంలో అలాంటి సమయంలో కాశ్మీర్ బారాముల్లా ప్రాంతంలో ఒక్క ఇన్సిడెంట్ జరగలేదు. ఒక్క హిందూ ముస్లిం గొడవ కానీ. అప్పుడు పండిట్స్ అంతా అక్కడే వున్నారు. పండిట్స్ వచ్చేసింది 1990 ప్రాంతంలో. కారణం ఏమిటి అంటే లీడర్ షిప్ ఆఫ్ షేక్ అబ్దుల్లా. షేక్ అబ్దుల్లా క్లియర్ గా చెప్పాడు ఒక మీటింగ్ లో అల్లా ఖురాన్ లో చెప్పింది అందరికి వర్తిస్తుంది. ముస్లింలకే వర్తించదు. అని చెప్పారు ఉండవల్లి.

 

(ఇంకా ఉంది)

Similar News