చంద్రబాబు చెప్పేదే నిజాలా?

Update: 2018-04-10 11:30 GMT

"రాత్రి రైలెక్కితే పొద్దున్నే దిగిపోయేంత పక్కన వున్న కేరళ రాష్ట్రం చూడండి. అక్కడి ముఖ్యమంత్రి ఉమన్ చాందీ 70 లక్షల రూపాయల అవినీతిపై అక్కడి రాష్ట్రం భగ్గుమంది. ఫైరింగ్ జరిగి రాష్ట్రం అట్టుడికింది. అదే ఇక్కడ ఒక కార్పొరేటర్ 70 లక్షలు తినేశాడంటే చిన్న చూపు చూసే దుస్థితి. అంత తక్కువ తిన్నానంటారేమిటి అని ఆరోపణలు ఎదుర్కొనే వారే ఆక్శ్చర్య పోయే వాతావరణం. ఎక్కడ తేడా వుంది. పక్క రాష్ట్రం అలా ఎందుకు వుంది? మన రాష్ట్రం ఇలా ఎందుకు తగలడింది.? ఇప్పుడు అందరికి తెలిసిపోయింది. రాజకీయం డబ్బు సంపాదించుకునే వ్యాపారం అయిపొయింది. మనందరం మనకు తెలియకుండానే భాగస్వాములు అయిపోయాం." అని ఉండవల్లి అన్నారు.

కోర్టు లు రాజకీయ పార్టీల చేతుల్లో ఉన్నాయా ..?

కోర్టు లు రాజకీయ పార్టీల చేతుల్లో ఉన్నాయా ? వారు చెబితే వింటారా ? ఇదెక్కడా వినలేదు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ఇది నిజం అని చెప్పారు. ఆయన కోర్టు లను మ్యానేజ్ చేస్తారని అంటే నేను నమ్మలేదు. బాబు పై వచ్చిన ఆరోపణలు. ఇప్పుడు ఆయన అది నిజమే అని విజయ సాయి రెడ్డి పై చేసిన ఆరోపణల్లో చెప్పడం చూశాం. ప్రధాని కార్యాలయంలోనికి ఆయన వెళ్లి కుర్చున్నాక తరువాత రోజు జగన్ కేసుల్లో 30 కోట్ల ఆస్తులు రిలీజ్ చేస్తూ ట్రిబ్యునల్ తీర్పు చెప్పిందని బాబు ఆరోపించారు. ప్రధాని కోర్టు లను ఆదేశిస్తారా ? ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రధానిపై నేరుగా చేసిన ఆరోపణ ఇది. అదే నిజమైతే కోర్టులు ఎందుకు ? చాలా ప్రమాదకర పరిస్థితుల్లోకి దేశాన్ని తీసుకుపోతున్నారు. రాజులంటే ప్రజాస్వామ్యంలో ఓటర్లు. పరిపాలకులు చూసి ఓటర్లు గడ గడ లాడిపోకూడదు." అని ఉండవల్లి చెప్పారు.

రెండువేల నోట్లు ఏపీలో దాచేశారా ?

"రెండువేలరూపాయలను ఏపీలో రాజకీయపార్టీలు వచ్చే ఎన్నికల కోసం దాచేశారని సాక్షాత్తు ఒక కేంద్ర మంత్రి నాతో అన్నారు. ఏపీలోని ఏటీఎం లలో నగదు కొరతపై నే అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఇది. ఇంత దారుణమైన పరిస్థితుల్లోకి మనం వెళుతున్నామా ? ఈ దేశం పట్ల అంకితభావం వున్నవారు అనేకం వున్నారు. వారంతా నిత్యం ఆవేదన చెందుతన్నారు. వారు సోషల్ మీడియా ద్వారా నాకు అనేక మెసేజ్ లు ఇస్తూ వస్తున్నారు. దేశం, రాష్ట్రం ఏమైపోతుందని వారి ఆందోళన. ఎదో ఒకటి చేయాలని నేటి యువతరం కోరుకుంటుంది. పేదరికంలో వున్న వారు డబ్బు తీసుకోవద్దు అని చెప్పినా వినే స్థితి లో లేరు. పార్టీలు ఓట్లు కొనుగోలుకు ఇచ్చే సొమ్ము ఎవరిదో కాదు ప్రజల సొమ్మే అని చెప్పండి. ఇచ్చిన వారికి వేయాలనే ధర్మం ఇక్కడ వర్తించదని చెప్పండి. డబ్బు ఇచ్చే వారికి మాత్రం ఓటు వేయొద్దని ఇంటింటా ప్రచారం చేయండి. అందరు డబ్బిస్తే మాత్రం నోటా వుంది అది నొక్కేయండి. దుర్మార్గులను ఓటు కోరాడాతో కొట్టండి. మళ్ళీ అడుగుతారా అని. పవన్ కళ్యాణ్ కాదు. కమ్యూనిస్ట్ లైనా ఓటుకు డబ్భిస్తే వారికి దెబ్బేసేయ్యండనే చెబుతా. అలా డబ్బు ఇచ్చేవాడు ఇండిపెండెంట్ అయినా ఇదే శిక్ష. డబ్బు ఇచ్చిన వాడికి ఓటేస్తే భగవంతుడు క్షమించడు." అని అరుణ్ కుమార్ ఆవేదన చెందారు.

ఇసుక సంగతి చూడండి.....

"ఇసుక ఉచితంగా ఇస్తున్నారా ? ఈ రేటు ఇది వరకు ఉందా ? ఇలా అన్ని దోచేస్తున్నారన్నది గుర్తుంచుకోవాలి. అలా దోచేసిన మనసోమ్మే మనకు ఇస్తున్నారు. ఇలా అనేక అడ్డగోలు దోపిడీలు ఓట్ల కొనుగోలుకు వాడుతున్నారు అని తెలుసుకోండి.పికె తో కలిపేస్తున్నారు . ఏ పార్టీ వారు పిలిచినా నే వస్తా. అది సరైన కార్యక్రమం అయితే టిడిపి పిలిచినా వెళతా. అక్కడికి వెళ్ళినా అంతా మా కాంగ్రెస్ వాళ్ళే గా వున్నది. ఇక ఈ మధ్య హోదా కోసం వైసిపి నాయకులు రౌతు సూర్య ప్రకాష్, జక్కంపూడి గణేష్ దీక్షలు చేస్తూ రమ్మన్నారు వెళ్ళాను. అందులో తప్పేముంది. నన్ను జనసేన పార్టీతో కలిపేయాలని కొందరు చూస్తున్నారు." అని ఉండవల్లి అన్నారు.

కాగ్ నివేదికపై ఎంత అన్యాయం...

"కాగ్ నివేదిక ఆరుపుస్తకాలుగా ఉంటుంది. అందులో కీలకమైన ఎకనమిక్ రిపోర్ట్ అసెంబ్లీలో టేబుల్ చేయలేదు. అందులోనే పోలవరం, పట్టిసీమ వంటివి ఉంటాయి. అసెంబ్లీలో టేబుల్ చేయకుండా బహిర్గతం చేయరు. ఇలా దాన్ని తొక్కి పెట్టడంలో పరమార్ధం ఏమిటి ? కాగ్ అని తేలిగ్గా తీసుకోకండి అందులోనే రాజీవ్ గాంధీ బోఫోర్స్ , టూజీ , లాలూ ప్రసాద్ యాదవ్ వంటివారు ఎందుకు పోయారో చూడండి. కాగ్ ఎకనామిక్ రిపోర్ట్ కి పట్టిన గతే పుష్కరాల్లో 29 మంది చనిపోతే వేసిన సోమయాజులు కమిషన్ కి పట్టింది. అదే తీరులో కాపు రిజర్వేషన్ ల కోసం వేసిన జస్టిస్ మంజునాథ కమిషన్ కి పట్టింది. సోమయాజులు కమిషన్ సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఆ కమిషన్ ఏమైందో కూడా తెలియలేదు. ఇక మంజునాథ లేకుండా కమిషన్ సభ్యులను మ్యానేజ్ చేసి నివేదిక ఇచ్చేశారు. మంజునాథ రిపోర్ట్ ఇవ్వకుండా కమిషన్ పని ఎలా పూర్తి అయినట్లు...? ఈ ప్రభుత్వానికి కమీషన్లపై వున్న శ్రద్ధ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ పై చర్యలు తీసుకోవడంపై ఏ మాత్రం లేదని తెలిసిపోయింది. ప్రతి ఏటా గ్రామాల్లో నాలుగు సార్లు గ్రామసభలు పెట్టి సమస్యలు రికార్డ్ చేసి పరిష్కరించాలి అని రాజ్యాంగం నిర్ధేశించింది. 74 వ రాజ్యాంగ సవరణ ఈ అంశం స్పష్టం చేస్తుంది. పదేళ్లు ఎంపీగా వున్నా నా మిత్రుడు దేశాయి చెప్పేదాకా నాకు తెలియదు. అలా ఎక్కడ జరుగుతుంది ? గ్రామసభల పేరు లేకున్నా జన్మభూమి కమిటీలు వేసుకుని పవర్ చేతిలో పెట్టుకుని ఓటుకు నోటు కోసం పని చేస్తున్నారు." అని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.

ఆయన చేసిందే ఈయన ...

"గత ఎన్నికలముందు చంద్రబాబు ఎపి భవన్ లో దీక్ష చేశారు. వైసిపి ఎంపీలు చేస్తున్నారు. బాబు పాదయాత్ర చేస్తున్నారు. జగన్ పాదయాత్ర చేస్తున్నారు. అధికారంలోకి ఎవరు వచ్చినా హోదా ఎలా ఇస్తారో చెప్పండి. రాష్ట్ర విభజన జరగలేదని నా దగ్గర ఆధారాలు వున్నాయి. ఢిల్లీ వెళ్ళిన బాబుతో ఇదే అంశం చెప్పించమని టిడిపి ఎంపీలకు మెసేజ్ పెట్టా. ఆయన ఆ మాటే ఎత్తలేదు. ఇక నాటి విభజన పై నోటిస్ ఇచ్చి చర్చించమంటే ఒక్క పార్టీ దృష్టి పెట్టదు. టివి చూస్తుంటే పాత స్టోరీ మళ్ళీ రీ ప్లే చేసినట్లు వుంది. డబ్బు ఇచ్చిన ఓట్లు వేయకపోతే రాజకీయాలే సమూలంగా మారతాయి. ఆ దిశగా అంతా పోరాడుదాం. మన తలసరి ఒక లక్షా 42 వేలు, జాతీయ తలసరి లక్షా 12 వేలు ఉంటే హోదా ఇచ్చేది ఎవరు..? అన్ని పార్టీలు మనకు అన్యాయంలో భాగం కనుక హోదా నష్టపరిహారంగా ప్రకటించాలి అనే మార్గం తప్ప మరొకటి లేదు" అని ఉండవల్లి చెప్పారు.

Similar News