జగన్ టీం బాగా వర్క్ చేస్తోంది

మాజీ పార్లమెంట్ సభ్యడు ఉండవల్లి అరుణ కుమార్ కరోనా వైరస్ పై తన అభిప్రాయాలను తెలుగుపోస్టు తో ప్రత్యేకంగా పంచుకున్నారు. వైరస్ బిహేవియర్ రిచ్ కంట్రీస్ కి [more]

Update: 2020-03-26 03:30 GMT

మాజీ పార్లమెంట్ సభ్యడు ఉండవల్లి అరుణ కుమార్ కరోనా వైరస్ పై తన అభిప్రాయాలను తెలుగుపోస్టు తో ప్రత్యేకంగా పంచుకున్నారు. వైరస్ బిహేవియర్ రిచ్ కంట్రీస్ కి ఎఫెక్ట్ బాగా ఎక్కువన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఆఫ్రికాలో ఎబోలా దీని తర్వాత స్వైన్ ఫ్లూ మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చినప్పుడు తీవ్రత చాలా ఎక్కువ ఉందని మనకి తెలుసు. స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది చనిపోయారు. అదృష్టవశాత్తు ఇప్పుడు కరోనా ప్రమాదకరమైన వైరస్ అయినా అంత ప్రాణ నష్టం లేదు. అయితే ఆ వైరస్ లకు మందు కనుగొన్నారని, కరోనా కు మందు లేకపోవడమే ప్రమాదం కొనితెస్తుందన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్.

నెట్ లో చూసి ఇంగ్లీష్ మందులు వాడకండి …

అల్లం, వెల్లుల్లి, తింటే ఇబ్బంది లేదని హైడ్రో క్లోరోక్విన్, వంటివి ఇంగ్లీష్ మందులు నెట్ లో చూసి వాట్స్ అప్ లలో చూసి ప్రాణాలమీదకు తెచ్చుకోవొద్దని హెచ్చరించారు ఉండవల్లి అరుణ కుమార్. ఇప్పుడు ఫోన్ ఉన్న ప్రతివాడు ఎడిటర్ అయిపోవడంతో చిన్న పొరపాటు దొర్లినా పారాసిట్ మాల్ 65 అనబోయి 650 గ్రాండ్ అని ఒక అధికారి అంటే పెద్ద వైరల్ అయ్యిందని గుర్తు చేశారు.

ప్రభుత్వం చెప్పిందే చేయాలి …

ఇప్పుడు దేశవాసులంతా ప్రభుత్వాలు చెప్పిందే చేయాలని ఇంతకన్నా చేసేది ఏమి లేదన్నారు. ఇటలీలో వైద్యం అందకపోయిన 80 నుంచి 90 శాతం కేసుల్లో వృద్ధులే మరణించారని అదీ కూడా వైద్యం అందించలేకే మృత్యువాత పడ్డారని వివరించారు ఉండవల్లి. వెంటిలేటర్లు 50 ఏళ్లలోపు వారికే అమర్చడంతో వృద్ధులు చనిపోయారు. ఆ పరిస్థితి భారత్ కి వస్తే భయానకం. ఒక పెద్దాయన చెప్పినట్లు దేశం నీకేమిచ్చింది అన్నది కాదు దేశానికి నువ్వేమి ఇచ్చావు అన్నదే ప్రధానం. ఇప్పుడు దేశ లీడర్ అడిగారు. ఈ దేశం కోసం మీ 21 రోజులు త్యాగం చేయమని. మూడు వారాలు ప్రాణాలు రక్షించుకుంటే మీ ప్రాణాలు రక్షించుకున్నట్లే అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్.

పేదల కోసం ఆలోచించాలి….

దేశంలో 20 శాతం మాత్రమే పేదలు ఉన్నారని అంటారు కానీ నా లెక్క ప్రకారం 40 శాతం పేదవర్గాలు ఉన్నాయి. ఇది ఉత్తరాది లో ఎక్కువ. దక్షిణాదిలో తక్కువే. అందుకే కూటికి గతి లేని వారికోసం కూడా ప్రభుత్వ అధినేతలు సైతం ఆలోచించాలి. నిత్యావసరాలు ఇళ్లవద్దకే వచ్చేలా లారీల్లో పంపించాలి. వారికి ఇలా అందుబాటులోకి వస్తే రైతు బజార్లు ఇతర దుకాణాల వద్ద జనం గుమ్మి గూడె ప్రమాదం నివారించవచ్చు అని సూచించారు మాజీ ఎంపి ఉండల్లి అరుణ్ కుమార్.

జగన్ టీం పని ఇప్పుడు …

ముఖ్యమంత్రి పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ చాలా బాగుంది. దానికి పూర్తి పని ఇప్పుడే. ఈ వాలంటీర్లతో అంతా యువకులు ఇంజనీరింగ్ కూడా చదివిన వారు ఉన్నారు. నాకు తెలిసి యువతకు వ్యాధి నిరోధక శక్తి అధికం కాబట్టి వారు ధైర్యంగా ప్రజావసరాలను తీర్చేందుకు రంగంలోకి దిగొచ్చు. వారు వారు భయపడాలిసిన పనేమీ లేదు. సరైన క్రమశిక్షణ పాటించి దూరంగా ఉంటే ప్రపంచం ఆశ్చర్య పోయే స్థాయికి ఖచ్చితంగా చేరుకోగలం అని విశ్లేషించారు ఉండవల్లి. భారత్ కి స్వాతంత్ర్యం ఇచ్చేముందు ప్రపంచ మేధావిగా అందరిలో గుర్తింపు పొందిన చర్చిల్ కుక్కలతో పోల్చాడు. ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యలు తిప్పికొట్టే రోజులు వచ్చాయి. మనం స్వీయ నియంత్రణ పాటిద్దాం కుక్కలు ఎవరో తేలుద్దాం అన్నారు ఉండవల్లి అరుణ కుమార్.

ఇది అధిగమిస్తే మనమే ప్రపంచ నెంబర్ వన్ ..

ఈ సంక్షోభాన్ని అధిగమిస్తే ప్రపంచం లోనే భారత్ నెంబర్ వన్ అవుతుంది. అత్యంత హైజినిక్ అని చెప్పుకునే అమెరికన్స్ వంటివారు నేడు కరోనా ధాటికి గజ గజా వణుకుతున్నారు. సంక్షోభాన్ని అవకాశం గా మలుచుకోవాలంటే అంతా ఒక్కటే చేయాలి. అది ఇల్లు వదిలి వీధుల్లోకి రాకుండా మన దేశభక్తిని చాటడం. మన వ్యాధినిరోధికత చాలా ఎక్కువ. ధనిక దేశాలపై విజృంభించిన కరోనా పేద దేశాలపై అంతగా లేకపోవడం గమనిస్తే ఈ వైరస్ బిహేవియర్ నాకు అర్ధం కావడం లేదు. అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్.

బాధితులకు జగన్ భరోసా ఇవ్వాలి …

రాజమండ్రిలో కరోనా పాజిటివ్ వచ్చిన హర్ష అనే యువకుడి తల్లితో నేరుగా తాను మాట్లాడానని చెప్పారు అరుణ కుమార్. హర్ష తల్లి ఈ కేసుపై అన్ని వివరాలు తెలిపారని ఆమె ఒక స్కూల్ టీచర్ గా ఎంతో బాధ్యతగా వ్యవహరించారని ఉండవల్లి ప్రశంసించారు. ఇంగ్లాండ్ నుంచి తన కుమారుడు రాజమండ్రి రాగానే ఒక రూమ్ లో ఉంచి ఆమె భోజనం పెట్టేవారని వచ్చిన మూడో రోజు లక్షణాలు బయట పడగానే హర్ష స్వయంగా తనకు పరీక్షలు నిర్వహించాలని స్వచ్ఛందంగా ప్రభుత్వ అధికారులకు బాధ్యతగల పౌరుడిగా సమాచారం ఇచ్చాడని దేశానికి ఎంతో సేవ చేశాడని కొనియాడారు అరుణ కుమార్. కానీ బయట మాత్రం దీనిపై చాలా రూమర్స్ ప్రచారం అయ్యాయి అని చాలామంది కి అతను వైరస్ అంటించాడని పారిపోతుంటే పట్టుకున్నారన్న వార్తలు విచారకరం అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. కాకినాడ లో ఉంటున్న ఆ కుటుంబాన్ని ఫోన్ లో పరామర్శించా అని వారంతా సౌకర్యవంతంగా ఉన్నామని ఆనందంగా చెప్పారని అన్నారు. అయితే మనిషి జాడ లేక మానసికంగా కుంగి పోతున్నట్లు తెలిపారని వెంటనే ముఖ్యమంత్రి పాజిటివ్ బాధితులతో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పాలని మంత్రులు కూడా పలకరించాలని సూచించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.

కరోనా లెక్కలు చెబుతున్న నిజం …

కరోనా లెక్కలు చెబుతున్న వాస్తవాలు ఇవే అని డేటా వెల్లడించారు ఉండవల్లి అరుణ్ కుమార్. 13 కోట్లమందికి దేశం లో ఒకరు చనిపోతున్నారని ఆ లెక్కన రాజమండ్రిలోని మూడు లక్షల మంది కి వైరస్ సోకితే చనిపోయే అవకాశం 15 మందికి మాత్రమే ఉందని విశ్లేషించారు. అందువల్ల అతిగా భయపడటం అలాగే అతి నిర్లక్ష్యం సరికాదన్నారు. రాష్ట్ర విభజన జరిగాక వచ్చిన స్వైన్ ఫ్లూ మరణాలు 100 కు పైనే అని అయితే దానికన్నా దీని తీవ్రత తక్కువే అని కాకపోతే కరోనా కు మందు లేకపోవడమే అసలు సమస్య అని స్వైన్ ఫ్లూ కి మందు ఉండటం తేడా అన్నారు ఉండవల్లి అరుణ కుమార్.

Tags:    

Similar News