ఉండవల్లి సిగ్నల్స్ తో జగన్?

ఏపీ ముఖ్యమంత్రి జగ మొండి గా అంతా ముద్దుగా పిలుచుకునే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మారిపోయారన్న టాక్ వైసిపి వర్గాల్లో వినవస్తుంది. ఆయన అనుకున్నదే చేస్తారు. [more]

Update: 2020-02-29 03:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగ మొండి గా అంతా ముద్దుగా పిలుచుకునే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మారిపోయారన్న టాక్ వైసిపి వర్గాల్లో వినవస్తుంది. ఆయన అనుకున్నదే చేస్తారు. ఎవరు చెప్పినా వినరు. ఎమ్యెల్యేలు, ఎంపి లకు దూరంగా ఉంటారని కొందరికే ఆయన దర్శన భాగ్యం అని నిన్న మొన్నటివరకు ప్రచారం నడిచింది. నిప్పులేకుండా పొగ రాదు కనుక ఇందులో చాలా వరకు సత్యమే ఉందని సొంత పార్టీ వారే అంటారు. అయితే ఆయన పనితీరును గమనించి ఇటీవల గట్టిగానే చురకలు అంటించారు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్.

పెద్దాయన చెప్పింది వినకపోతే ….

తన తండ్రికి అత్యంత సన్నిహితుడు రాజకీయ అనుభవజ్ఞుడు అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పింది వినకపోతే ఎలా ఉంటుందో గత బాబు సర్కార్ కు జరిగిన ఘోరఓటమి ప్రత్యక్షంగా అధికారపార్టీకి ఇప్పుడు కనిపిస్తుంది. దాంతో జరిగిన జరుగుతున్న పొరపాట్లను సరిదిద్దుకునే పనిలో ముఖ్యమంత్రి పడ్డారని అంటున్నారు అధినేత తో సన్నిహితంగా వుండే వర్గాలు. ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన అంశాలపై జగన్ ఫోకస్ పెట్టడమే ఆయన మాటను ఫాలో అవుతున్నారని చెప్పక చెబుతుంది. ఇసుక, మద్యం అంశాల్లో సర్కార్ ఫార్ములా పై ఉండవల్లి తప్పులు ఎత్తి చూపారు. అలాగే పెన్షన్ ల రద్దు అంశంలోనూ గట్టిగానే దాని ప్రభావం ఎలా ఉంటుందో చెప్పారు. ఇక పోలవరం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజలు ఎన్నుకున్న నేతలైన ఎమ్యెల్యేలు, ఎంపీలతో తరచూ భేటీ కావాలని కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ కి పలు సందర్భాల్లో చెప్పారు. వారి మధ్య గ్యాప్ ప్రభుత్వానికే ప్రమాదమని కూడా హెచ్చరించారు. ఎంతో పెద్ద మెజారిటీలతో గెలిచిన పివి నరసింహారావు, ఎన్టీఆర్ లు ఎలా అధికారాన్ని కోల్పోయింది చారిత్రక ఉదాహారణలతో వివరించారు ఉండవల్లి.

పోలవరంపై జగన్ ఫోకస్ పెంచారు ….

ఉండవల్లి అరుణ్ కుమార్ నుంచి వచ్చిన సూచనలను హెచ్చరికలను చాలా సీరియస్ గానే పరిగణించారు ముఖ్యమంత్రి జగన్. పోలవరం తమ టాప్ ప్రయారిటీ గా నిర్ణయించుకుని వారం తిరగకుండా క్షేత్ర స్థాయి పర్యటన చేపట్టారు. గోదావరి తీరంలోని ఇసుక మాఫియా పై కఠిన చర్యలకు అధికారులను ఆదేశించారు. మద్యం షాపుల్లో కొని బార్లలో విక్రయించే వారిపై కేసులు పెట్టాలని ఆదేశించారు. అదే విధంగా పెన్షన్ల రీ వెరిఫికేషన్ గట్టిగానే మొదలు పెట్టాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి దర్శన భాగ్యం కోసం వేచి చూస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి రోజు కొంత సమయాన్ని కేటాయించాలని జగన్ నిర్ణయించారు. ఇలా అనేక అంశాల్లో ఉండవల్లి చెప్పిన ముఖ్య విషయాలను సిఎం చెవికి ఎక్కించుకున్నారు.

గతంలో వైఎస్ కి ….

ప్రజల మూడ్ ఎలా వుంది. ఎలాంటి సమస్యలు సర్కార్ పరంగా వారికి ఎదురు అవుతున్నాయి. ఏం చేస్తే వారు సంతోష పడతారు. అసెంబ్లీలో విపక్షాన్ని ఎలా ఎదుర్కోవాలి. అధిష్టానం తో సాగించాలిసిన వ్యవహారాలు కొత్త సంక్షేమ పథకాలు ఎలా ఉండాలి, ఇలాంటి నిర్ణయాలను వైఎస్ తీసుకునే ముందు కెవిపి, ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి అత్యంత ముఖ్యమైన కొర్ టీం కి ఉండేది. వారంతా నిరంతరం వైఎస్ బ్యాక్ ఆఫీస్ రౌండ్ ది క్లాక్ చూసుకునేవారు. రాజశేఖర రెడ్డి అంటే ప్రాణాలు విడిచే టీం అది. ఆయన కూడా వారి మాటలకు అంతే విలువ ఇచ్చేవారు. ఏ సమస్య వచ్చినా పరిష్కారం ఏమిటి అనే దానిపై టీం తో విస్తృతంగా చర్చించి ఫైనల్ గా తమ వారు తన మంచి కోసమే చెబుతారని ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే వెళ్ళిపోయేవారు. అలాంటి కోర్ టీం లో కీలక సభ్యుడిగా దశాబ్దాల పాటు వైఎస్ కి సేవలు అందించిన ఉండవల్లి అరుణ కుమార్ మాటలను వైసిపి నే కాదు టిడిపి, జనసేన, కూడా పాటిస్తాయి. రాజకీయాల్లో డౌన్ టూ ఎర్త్ చూసిన ఉండవల్లి అరుణ కుమార్ కొత్త ప్రభుత్వం వచ్చిన నాటినుంచి అనేక సూచనలు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పటివరకు ఆయన చెప్పింది ఏమి జగన్ సర్కార్ పట్టించుకున్నది లేదు. దాంతో ఇటీవల ఉండవల్లి స్వరం హెచ్చరికల స్థాయికి చేరింది. డేంజర్ బెల్స్ మోగుతున్నాయని ఆయన ముందస్తు సిగ్నల్స్ పంపారు. ఈ నేపథ్యంలో జగన్ ఇప్పుడు పెద్దాయన చెప్పిన ఒక్కో తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో పడటం తో వైసిపి వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతుంది.

Tags:    

Similar News