జగన్ సైకో ఫ్యాన్స్ బెదిరింపులకు లొంగను

పదేపదే చంద్రబాబు తప్పులను ఎత్తి చూపిన జగన్ చివరికి కొన్ని కీలక అంశాల్లో ఆయన్నే అనుసరిస్తున్నారా ? అవుననే అంటున్నారు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్. [more]

Update: 2020-12-24 05:00 GMT

పదేపదే చంద్రబాబు తప్పులను ఎత్తి చూపిన జగన్ చివరికి కొన్ని కీలక అంశాల్లో ఆయన్నే అనుసరిస్తున్నారా ? అవుననే అంటున్నారు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్. తాజాగా ఆయన పోలవరం ప్రాజెక్ట్ అప్ డేట్స్ ఇచ్చే సందర్భంలో చేసిన వ్యాఖ్యలు వైఎస్ తనయుడిపై తన ఆగ్రహాన్ని నేరుగా వ్యక్తం చేసేలాగే సాగాయి. అదే విధంగా ఉండవల్లి చేసిన కొన్ని కామెంట్స్ చర్చనీయమే అవుతున్నాయి. అరుణ కుమార్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు అధికార వైసిపి ని మాత్రం డిఫెన్స్ లోకి నెట్టాయి. బస్సులు పెట్టి చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ ను చూపిస్తే జగన్ ఎవరు అక్కడకు వెళతానన్నా అరెస్ట్ చేయడం చోద్యం కాక మరేమిటన్నది ఉండవల్లి అరుణ కుమార్ వ్యాఖ్య.

ఎత్తు కాదు నీటి నిలువ పై సందేహాలు … ?

పోలవరం ప్రాజెక్ట్ లో అంతా గందరగోళమే నెలకొని ఉందని చంద్రబాబు, జగన్ కేసులకు భయపడి కేంద్రం తో రాజీ పడటం రాష్ట్రానికి శాపం గా మారిందని ఉండవల్లి అరుణ కుమార్ ఘాటైన వ్యాఖ్యలే చేశారు. ప్రాజెక్ట్ ఎత్తు సమస్య కాదని నీటి నిల్వ సామర్ధ్యాన్ని తగ్గించడం ద్వారా ముంపు తగ్గించి నిర్వాశితుల ఖర్చు తగ్గించేందుకు గతం లో బాబు డిజైన్ చేశారని ఆయన్ను తీవ్రంగా నాడు విమర్శలు చేసిన జగన్ అధికారంలోకి వచ్చాకా అదే ప్రణాళికతో సాగుతున్నట్లు స్పష్టం చేశారు ఉండవల్లి. ఇప్పటికే జలవిద్యుత్ ప్రాజెక్ట్ కి మంగళం పాడేశారని ఎడమ కాలువ కు గ్రావిటీ పై నీరిచ్చే అంశం లేకుండా పోతుందన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అక్కడ ఎత్తిపోతల పథకంతో మమ అనిపించేస్తారన్నారు. ఇవి నిజమే అనడానికి పవర్ ప్రాజెక్ట్ లేకపోవడమే అని అది ఉంది అంటే ఎక్కువ నీటి నిల్వ సామర్ధ్యం ఉంటె తప్ప టర్బెన్స్ పనిచేయవని క్లారిటీ ఇచ్చేశారు ఉండవల్లి అరుణ కుమార్.

నేను ఎవరికి భయపడను …

పోలవరం పై నిజాలు మాట్లాడుతుంటే జగన్ సైకో ఫ్యాన్స్ తనను వివిధరకాల బెదిరించాలని చూస్తున్నారని కూడా ఉండవల్లి అరుణ కుమార్ చెప్పడం గమనార్హం. అయితే తాను ఎవరికి తలవంచే ప్రశ్నే లేదని చిన్నతనం నుంచి రాజకీయాల్లో ఉంటూ చాలా చూశామని తనను బెదిరిస్తే రెట్టింపు రియాక్షన్ తన నుంచి ఎదుర్కోక తప్పదని ఉండవల్లి వైసిపి శ్రేణులకు సూటీగా చెప్పేశారు.

తిరుపతి ఎన్నికల తరువాత తేలుస్తా …

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎదుగుదలపై ఉండవల్లి అరుణ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే తిరుపతి ఉప ఎన్నికల తరువాత ఎపి లో బిజెపి ఎదుగుదలపై పూర్తి క్లారిటీ ఇస్తా అన్నారు ఆయన. ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతాలు సెక్యులర్ దేశానికి మంచిది కాదని గురూజీ గోల్వల్కర్ రాసిన పాంచజన్యం పుస్తకాన్ని ప్రస్తుతించారు ఉండవల్లి. ఎంఐఎం ఎక్కడ పోటీ కి దిగితే అక్కడ బిజెపి సులువుగా హిందూ ఓట్లను గంపగుత్తగా తనఖాతాలోకి మరల్చుకుంటుందని దేశంలో పలు ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు తేల్చాయని అరుణ కుమార్ విశ్లేషించారు. ఇది తన మిత్రుడు అసదుద్దీన్ ఒవైసి గుర్తించుకోవాలని సూచించారు ఉండవల్లి.

అదే బెటర్ …

పోలవరం ప్రాజెక్ట్ ను గతంలో వైఎస్ అనుకున్న రీతిలో పూర్తి చేయాలంటే ఒకటే మార్గమని ఉండవల్లి అరుణ కుమార్ పేర్కొంటున్నారు. జాతీయ ప్రాజెక్ట్ గా చట్టం లో పేర్కొన్నందున కేంద్ర ప్రభుత్వం కట్టి తీరాలని దీనికి క్వశ్చన్ లేదు ఆర్గ్యుమెంట్ అంతకన్నా లేదన్నారు ఆయన. అందుకే ప్రాజెక్ట్ ను కేంద్రం చేతిలో పెట్టి పర్యవేక్షణ బాధ్యత చేపట్టాలని జగన్ సర్కార్ కి ఉండవల్లి సూచించారు. ప్రజలను నమ్మించేందుకు ఎపి సర్కార్ ఇస్తున్న ప్రాజెక్ట్ పై ప్రకటనలు కేంద్ర ప్రభుత్వం తో చేయిస్తే తాను ఇకపై దీనిపై మాట్లాడనని క్షమాపణలు కోరతానంటూ ఆఫర్ ప్రకటించారు ఉండవల్లి అరుణ కుమార్.

ఇదే ఉత్తమ మార్గమా ?

కేంద్రంలోని బిజెపి సర్కార్ విభజన హామీలను ఆరేళ్ళుగా అమలు చేయడం లో ఆటలాడుతుందన్నది స్పష్టం అవుతున్న నేపథ్యంలో ఉండవల్లి అరుణ కుమార్ చెప్పిన మార్గం ఉత్తమమే అంటున్నారు విశ్లేషకులు. పోలవరం ప్రాజెక్ట్ ను కేంద్రం నెత్తినే పెట్టడం ద్వారా పునరావాసం, పవర్ ప్రాజెక్ట్ వంటి వాటిల్లో ఎక్కడ తక్కువ చేసినా బిజెపి సర్కార్ ను ప్రజల్లో కడిగేయొచ్చని రాజకీయంగా కూడా వైసిపి కి ఇది కలిసి వచ్చే అంశమేనని అంచనా వేస్తున్నారు. నిధుల లేమితో తిప్పలు పడుతున్న ఎపి సర్కార్ రాష్ట్ర ప్రజలపై భారం మోపేలా వ్యవహారం నడపకుండా చట్టంలో చెప్పినట్లే కట్టి ఇవ్వమనడం సరైందంటుంన్నారు అంతా. ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ ద్వారా 20 శాతం మాత్రమే పునరావాస పనులు అయ్యాయని ఇలా అయితే నీటి నిల్వ కష్టమేనని ప్రాజెక్ట్ ముందుకు సాగడం మరింత ఆలస్యం అవుతుందంటూ ప్రకటనలు వస్తున్నాయి. ఇటీవలే జగన్ సైతం నీటి విడుదలపై 2021 నుంచి 2022 కి గ్రావిటీ పై నీరిస్తామంటూ మరో ఏడాది పొడిగించడం గమనిస్తే ఉండవల్లి అరుణ కుమార్ అనుమానాల్లో నిజమే ఉందని కొందరు నీటిపారుదల నిపుణులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. అయితే దీనికి జగన్ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News