ఉండవల్లి స్కూల్ స్టార్ట్ చేసింది అందుకేనా ?

మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల జగన్ సర్కార్ చేస్తున్న తప్పులను వరుసగా ఏకరువు పెడుతున్నారు. గతంలో టిడిపి సర్కార్ తప్పులను ఎలా ఎత్తి [more]

Update: 2020-12-08 12:30 GMT

మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల జగన్ సర్కార్ చేస్తున్న తప్పులను వరుసగా ఏకరువు పెడుతున్నారు. గతంలో టిడిపి సర్కార్ తప్పులను ఎలా ఎత్తి చూపారో అదేవిధంగా ఇప్పుడు స్కూల్ స్టార్ట్ చేశారు. తాను చంద్రబాబు కి జగన్ మోహన్ రెడ్డి కి వత్తాసు పలకాలిసిన అవసరం ఏమాత్రం లేదని కుండబద్ధలు కొట్టేశారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఎవరు తప్పు చేసినా ఎత్తిచూపడమే తన బాధ్యత అని అది విస్మరించనని ఒక పౌరుడుగా ప్రశ్నిస్తూనే ఉంటా అంటున్నారు. ఇలా ఉండవల్లి అరుణ్ కుమార్ చేస్తున్న పదునైన వ్యాఖ్యలు వైసిపి లో కలవరం రేపుతున్నాయి.

మొదట్లో ఖండించేందుకు వెనుకాడినా …?

ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ అంశంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నల వర్షమే నిప్పుల వానగా కురిపిస్తున్నారు. ఆయన లెక్కలతో సహా సహేతుకంగా చెబుతున్న వివరాలు అధికారపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మొదట్లో దీన్ని లైట్ గా తీసుకున్న వైసిపి ఇటీవలే ఆయనపై కూడా సుతిమెత్తగా విమర్శలు చేసేందుకు పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఉండవల్లి ప్రశ్నలకు మాత్రం సరైన జవాబులు వారి నుంచి లేకపోవడం గమనార్హం. పోలవరం ప్రాజెక్ట్ ఎపి లైఫ్ లైన్ అని అది పూర్తి అయ్యేవరకు మీడియా వేదికగా చేస్తున్న పోరాటం కొనసాగుతుందని ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేయడంతో ఇప్పుడు అధికారపక్షానికి ప్రధాన ప్రతిపక్షం గా మాజీ ఎంపి ఉండవల్లి మారిపోయారు.

ముఖ్యమంత్రిగా గౌరవిస్తా …

వైఎస్ ఆర్ తనయుడిగా జగన్ తన దృష్టి లో చిన్నవాడిని అయితే ముఖ్యమంత్రి పీఠం లో ఉన్నందుకు గౌరవంగానే చూస్తా అంటున్న ఉండవల్లి అరుణ్ కుమార్ వైసిపి కి మాత్రం కంట్లో నలుసులా మారిపోయారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తమ అధినేతకు సూచనలుగా తీసుకోవాలో లేక హెచ్చరికలా, బెదిరింపులా లేక భయపెడుతున్నారో అర్ధం కావడం లేదని కొందరు నేతలు ఆఫ్ ది రికార్డ్ లో పేర్కొంటున్నారు. పోలవరం ఇప్పట్లో పూర్తి అయ్యే ప్రాజెక్ట్ కాదు. అది కొనసాగినంత కాలం తలెత్తే అన్ని పరిణామాల్లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం విపక్షాలు బిజెపి, జనసేన ల కన్నా ఉండవల్లి తోనే తలపోట్లు తప్పేలా లేవన్నది వారి అభిప్రాయంగా వుంది. గతంలో బాబు హయాంలో ఉండవల్లి అరుణ్ కుమార్ వరుస ప్రెస్ మీట్లు టిడిపి సర్కార్ పై ప్రజల్లో వెగటు పుట్టించేలా చేశాయి. ఇప్పుడు అదే రీతిలో ఆయన వైసిపి సర్కార్ ను రేవు పెట్టేస్తుండటంతో కిమ్ కర్తవ్యం అన్నది అధికారపార్టీ కి ప్రశ్నగా మిగిలింది.

Tags:    

Similar News