ఉండవల్లి అనుకున్నది సాధించారు గా

Update: 2018-07-17 04:18 GMT

రాష్ట్ర విభజన జరిగినప్పటినుంచి మాజీ పార్లమెంట్ సభ్యుడు నాటి విభజన రాజ్యాంగ విరుద్ధమంటూ ఒంటరి పోరు సాగిస్తూ వచ్చారు. అవకాశం దొరికినప్పుడల్లా పార్లమెంట్ వేదికగా బిజెపి, కాంగ్రెస్ పార్టీలను కడిగేయమంటూ టిడిపి, వైసిపి ని పదేపదే ప్రాధేయపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా జరిగిన తప్పు ఎందుకు నిలదీయడంలేదంటూ ఆయన టిడిపి అధినేత చంద్రబాబు కి లేఖలపై లేఖలు రాసారు. ప్రస్తుత వర్షాకాల సమావేశాలే ఆఖరిగా జరగబోతున్నందున ఇప్పటికైనా అశాస్త్రీయంగా జరిగిన విభజన తప్పులు ఎత్తి చూపకపోతే తెలుగు జాతి చరిత్రలో క్షమించదని అరణ్యరోదనే చేశారు ఉండవల్లి. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఏ పార్టీ తో అయినా కలిసేందుకు సిద్ధమని రాజకీయాలనుంచి విరమించుకున్నందున అన్ని పార్టీలు తన మాటకు విలువ ఇవ్వాలని కోరారు అరుణ్ కుమార్.

ఎట్టకేలకు మెట్టు దిగిన బాబు ...

కేంద్రం ఏపీకి చేసిన అన్యాయం పై ధర్మపోరాటం పేరుతో ఉద్యమిస్తున్న చంద్రబాబు ఎట్టకేలకు మెట్టు దిగారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం ఎవరితో అయినా కలిసేందుకు సిద్ధమని చెప్పేందుకు పార్లమెంట్లో పోరాడాలిసిన వ్యూహంపై ఉండవల్లి వంటి మేధావి సలహాలు తక్షణం అవసరమని గుర్తించిన చంద్రబాబు ఆయన దగ్గర వున్న ఆధారాలు అధికారుల ద్వారా తెప్పించుకుని పరిశీలించారు. అనంతరం తనతో భేటీ కావాలిసిందిగా ఉండవల్లి ని ఆహ్వానించారు. దీనిపై స్పందించిన అరుణ కుమార్ అమరావతిలోని సచివాలయంలో చంద్రబాబు ను కలిసి గంటన్నరపాటు పార్లమెంట్లో అనుసరించాలిసిన వ్యూహం పై సుదీర్ఘంగా చర్చించారు. ఎప్పటినుంచో తనగోడు వినండి మహాప్రభో అంటూ గొంతు చించుకున్న ఆయన ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది.

రాజీనామాలు చాలా తప్పు ...

ముఖ్యమంత్రి తో భేటీ తరువాత ఉండవల్లి హాట్ కామెంట్స్ చేశారు. అందులో వైసిపి ఎంపీలు పార్లమెంట్ వేదికగా పోరాటం మాని రాజీనామాలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. చంద్రబాబు అండ్ టీం పార్లమెంట్లో అనుసరించాలిసిన వ్యూహాన్ని నిర్దేశించానని వారు ఆవిధంగా చేసి రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. రాజ్యాంగ విరుద్ధ విభజన పై తనదగ్గర వున్న ఆధారాలు ముందుగానే అందజేశామని వివరించారు. లోక్ సభలో రూట్ చెప్పా జరిగిన తప్పును లేవనెత్తాలని కోరాను అని ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు అరుణ కుమార్.

రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ...

రాష్ట్ర ప్రయోజనాల రీత్యా వేయాలిసిన అడుగులను ప్రభుత్వానికి నిర్ధేశించారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఉండవల్లి తెలుగుదేశం పార్టీని ఉతికి ఆరేస్తూ వచ్చారు. స్వర్గీయ వైఎస్ ఆర్ ప్రధాన సహచరుడిగా, సన్నిహితుడిగా కొనసాగారు. వైఎస్ మరణం రెండుసార్లు పార్లమెంటేరియన్ గా రాణించడం , తాను పెట్టుకున్న 60 ఏళ్లకే రాజకీయాలనుంచి రిటైర్మెంట్ వంటి స్వయం నిర్ణయాలతో పాటు రాష్ట్ర విభజన జరిగిన తీరుతో మనస్తాపంతో ప్రత్యక్ష ఎన్నికలకు గుడ్ బై చెప్పేశారు. కానీ క్రీయాశీలకంగా రాజకీయాల్లో ఉంటానని, రాష్ట్ర ప్రయోజనాలు లక్ష్యంగా, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఆయన మీడియా ద్వారా చురుకైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నడుమ తేలని నిధుల బట్వాడా పై నిజనిర్ధారణ కమిటీ లో చేరారు. వైసిపి సిద్ధాంత కర్త అంటూ ఆయన్ను తెలుగుదేశం శ్రేణులు విమర్శించినా తాను అనుకున్నదే చేస్తూ వచ్చారు ఉండవల్లి. అలా పార్టీలతో సంబంధం లేకుండా తనదైన శైలిలో రాజకీయ చక్రం తిప్పేస్తున్నారు ఉండవల్లి.

Similar News