Ummareddy : ఉమ్మారెడ్డికి ఆ పదవి వద్దట

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీలో సీనియర్. ఆయన తొలి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నారు. కాపు సామాజికవర్గం నేతగా ఉన్న ఆయన టీడీపీని వీడి జగన్ కు సన్నిహితంగా [more]

Update: 2021-10-27 03:30 GMT

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీలో సీనియర్. ఆయన తొలి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నారు. కాపు సామాజికవర్గం నేతగా ఉన్న ఆయన టీడీపీని వీడి జగన్ కు సన్నిహితంగా మారారు. 2019 ఎన్నికల్లో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును జగన్ మ్యానిఫేస్టో కమిటీ ఛైర్మన్ గా కూడా నియమించారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించారు. ఆయన అల్లుడికి పొన్నూరు టిక్కెట్ కూడా జగన్ ఇచ్చి ఉమ్మారెడ్డి ఫ్యామిలీకి జగన్ బాగానే న్యాయం చేశారు.

మరోసారి ఎమ్మెల్సీగా….

అయితే జగన్ మరోసారి ఆయనకు శాసనమండలి పదవి ఇవ్వాలనుకున్నారు. పెద్దల సభ కావడంతో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి సీనియర్లు ఉండాలని జగన్ భావించారు. అయితే మండలి పక్ష నేతగానే ఆయనను నియమిస్తారు. శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ వంటి పదవులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు ఇచ్చే అవకాశం లేదు. ఆ రెండు పదవులు ఎస్సీ, మైనారిటీలకు జగన్ రిజర్వ్ చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రాజ్యసభ కావాలని….

కానీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శాసనమండలి పదవి పట్ల విముఖత చూపుతున్నారు. ఆయనకు రాజ్యసభ పదవి కావాలని బలంగా ఉంది. తన మనసులో మాటను ముఖ్యమంత్రి జగన్ కు ఆయన తెలియజేసినట్లు సమాచారం. అయితే రాజ్యసభ పదవి అయితే మరింత లేటు అవుతుందని చెప్పినట్లు తెలిసింది. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు త్వరలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటి జగన్ ఇవ్వాలనుకున్నారు. ఆయన మాత్రం విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఏదో ఒక పదవి…..

ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను అనుసరించి జగన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. కాపులకు ప్రయారిటీ ఇచ్చామని చెప్పుకోవాలన్నా ఉమ్మారెడ్డికి ఏదో ఒక పదవి ఇవ్వాలి. అందుకోసమే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును జగన్ బుజ్జగించి శాసనమండలికి పంపుతారా? లేదా ఆయన కోరినట్లు రాజ్యసభకు పంపుతారా? అన్నది మరికొద్ద ిరోజుల్లోనే తేలనుంది.

Tags:    

Similar News