పెద్దాయనకు పెద్ద పదవే

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.. పార్టీలో తొలి నుంచి నమ్ముకున్న పెద్దాయన. ఒకరకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని జగన్ స్థాపించినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి అప్పట్లో మైసూరారెడ్డి వంటి సీనియర్ [more]

Update: 2020-02-18 11:00 GMT

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.. పార్టీలో తొలి నుంచి నమ్ముకున్న పెద్దాయన. ఒకరకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని జగన్ స్థాపించినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి అప్పట్లో మైసూరారెడ్డి వంటి సీనియర్ నేతలు వచ్చారు. అయితే టీడీపీ నుంచి వచ్చిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైసీపీనే నమ్ముకుని ఉన్నారు. దీంతో జగన్ కూడా ఆయనకు మంచి ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమే కాకుండా మండలిలో పార్టీ నేత పదవి కూడా జగన్ ఇచ్చారు.

పెద్ద బాధ్యతలను అప్పగించి…..

ఇక ఎన్నికల సమయంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును మ్యానిఫేస్టో కమిటీ ఛైర్మన్ గా నియమించి జగన్ ఆయనకు పెద్ద బాధ్యతలను అప్పగించారు. మ్యానిఫేస్టోను సింపుల్ గా అన్ని అంశాలూ కవర్ అయ్యేలా చూడటంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కీలక భూమిక పోషించి జగన్ నుంచి శభాష్ అనిపించుకున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారు రోశయ్య కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. ఇలా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు పార్టీలో తగిన గౌరవమే లభిస్తుంది.

మండలి రద్దు అవుతుండటంతో…..

అయితే ఇప్పుడు శాసనమండలి రద్దు అవుతుండటంతో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు ఉన్న పదవి పోతుంది. వయసు రీత్యా ఆయన పార్టీ పదవులను చేపట్టలేని పరిస్థితి. ఈ సంగతి జగన్ కు తెలియంది కాదు. అందుకే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును పెద్దల సభకు పంపాలని జగన్ డిసైడ్ అయ్యారట. త్వరలోనే ఏపీకి సంబంధించి నాలుగు రాజ్యసభ పదవులు ఖాళీ అవుతున్నాయి. ఆ నాలుగు స్థానాలూ సంఖ్యాబలం ప్రకారం వైసీపీకే దక్కుతాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే రాజ్యసభకు ఎన్నికలు జరుగుతాయి.

రాజ్యసభ పదవికి….

ఈ ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేేసే నలుగురిలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే జగన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. పెద్దాయనను పెద్దల సభకు పంపించి గౌరవించుకోవాలని కూడా జగన్ డిసైడ్ అవ్వడంతో ఒక నాలుగింటిలో ఒకటి ఉమ్మారెడ్డికి ఇప్పటికే జగన్ రిజర్వ్ చేసినట్లు చెబుతున్నారు. మొత్తం మీద పార్టీని తొలి నుంచి నమ్ముకుని ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు గౌరవప్రదమైన స్థానం లభించబోతోంది.

Tags:    

Similar News