అందరికీ షాక్ ఇవ్వనున్న జగన్.. అందలం ఆయనకేనట

ఉమ్మారెడ్డి సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన తెలుగుదేశం పార్టీలో దశాబ్దాల పాటు సేవ చేశారు. నాడు ఎన్టీఆర్ సీఎంగా ఉండగా ఎమ్మెల్యేగా నెగ్గి శాసనసభలో చురుకుగా వ్యవహరించారు. [more]

Update: 2020-07-07 06:30 GMT

ఉమ్మారెడ్డి సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన తెలుగుదేశం పార్టీలో దశాబ్దాల పాటు సేవ చేశారు. నాడు ఎన్టీఆర్ సీఎంగా ఉండగా ఎమ్మెల్యేగా నెగ్గి శాసనసభలో చురుకుగా వ్యవహరించారు. ఇక ఆ తరువాత లోక్ సభకు మూడు సార్లు నెగ్గారు. 1996 నుంచి 1998 వరకూ కేంద్రంలోని దేవెగౌడ, గుజ్రాల్ ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశారు. ఇంతటి అనుభవం కలిగిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు 2012లో జగన్ పార్టీ పెట్టాక అందులోకి వచ్చారు. ఆయన అల్లుడు కిలారి రోశయ్య గత ఏడాది ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు, మ్మారెడ్డి వెంకటేశ్వర్లు 2016లో ఎమ్మెల్సీగా అయ్యారు. ఆయన ఇపుడు మండలిలో నేత గా ఉంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఆయన రాజ్యసభ సీటు ఆశించారని పార్టీలో ప్రచారంలో ఉంది. ఇక గత పదేళ్ళుగా జగన్ వెన్నంటి ఉంటూ పెద్దాయనగా పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆయన అనుభవం కూడా జగన్ కి ఉపయోగపడుతోంది. దీంతో ఇపుడు పెద్దాయన‌ మీద కాస్తా మనసు పడ్డారని టాక్.

పోటీ పెద్దదే ….

ఇద్దరు మంత్రులు వైసీపీ నుంచి వైదొలగారు. వారిలో గుంటూరు నుంచి బీసీ మంత్రిగా మోపిదేవి వెంకటరమణ ఉండేవారు. ఆయన ఖాళీని జగన్ ఎవరితో భర్తీ చేస్తారు అన్నది పెద్ద చర్చగా ఉంది. బీసీ ఖాళీ కాబట్టి బీసీలకే ఇస్తే తనకు దక్కుతుందని విడదల రజనీ భావిస్తున్నారు. ఇక కాపులకు ప్రాధాన్యత ఇస్తే తనకు కచ్చితంగా అవకాశం ఇస్తారని అంబటి రాంబాబు భావిస్తున్నారు. ఆయన వైఎస్సార్ నుంచి నేటి జగన్ వరకూ పూర్తి విధేయంగా ఉంటున్నారు. మరి ఇంకా చాలా మంది లిస్ట్ లో ఉన్నారు. రెడ్డి సామాజికవర్గం నుంచి కూడా ఆళ్ళ రామక్రిష్ణారెడ్డి, పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి కూడా రేసులో ఉన్నారు.

అలా భర్తీ….

ఇక వీరిలో ఎవరికి ఇచ్చినా మిగిలిన వారు బాధపడతారు, అసంతృప్తి కూడా వస్తుంది. దాంతో జగన్ ఒక తెలివైన ఆలోచన చేస్తున్నారుట. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు మంత్రి పదవి ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా టాక్. నిజానికి కేంద్రంలో మంత్రి పదవి చేసిన తరువాత గత రెండు దశాబ్దాలుగా మ్మారెడ్డి వెంకటేశ్వర్లు రాజకీయంగా ఇబ్బందులు పడుతూనే వచ్చారు. మిగిలిన వారి మాటెలా ఉన్నా జగన్ని నమ్ముకుని ఆయన కొనసాగుతున్నారు. జగన్ గెలుస్తాడో లేదో తెలియని నాడే ఆయన పార్టీలో చేరి తన అనుభవం అంత వయసు లేకపోయినా జగన్ మాట మీదనె నమ్మకం ఉంచి వివాదరహితునిగా పార్టీలో వుంటున్నారు. పైగా ఆయన బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన నాయకునిగా ఉన్నారు

మంచిదేనా…?

నిజంగా జగన్ కనుక ఈ నిర్ణయం తీసుకుంటే పార్టీలో కూడా అంతా హర్షిస్తారు అంటున్నారు. ఎందుకంటే ఆయన సాటి సీనియర్ నేత ఎవరూ లేరు. పైగా వయసు పరంగా చూసినా ఆయనకే అగ్ర తాంబూలం ఇవ్వాలి. ఇక ఆయన ఎమ్మెల్సీ పదవీ కాలం మరో రెండేళ్ళలో అయిపోతుంది. ఈ లోగా మండలి రద్దు అయినా ఆయన మంత్రిగా చేసిన సంత్రుప్తి ఉంటుంది. జగన్ కూడా ఆయనకు ఏమీ పెద్దగా చేయలేదు అన్న ఆలోచనలో ఉన్నారు. దాంతో ఉమ్మారెడ్డికే పెద్ద పీట వేయాలని వ్యూహాత్మకంగా జగన్ నిర్ణయం తీసుకున్నారని టాక్ నడుస్తోంది. ఆయనను మంత్రిని చేయడం ద్వారా భారీ ఎత్తున వస్తున్న పోటీ నుంచి బయటపడాలని జగన్ పక్కా ప్లాన్ వేస్తున్నారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News