చికాకు తెప్పిస్తున్నారు…అందుకే వార్నింగ్ ఇచ్చారా?

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు అవినీతి మంత్రులు తలనొప్పిగా మారారు. సంకీర్ణ ప్రభుత్వం కావడంతో ఆయన దీనిపై పెదవి విప్పడం లేదు. శివసేనకు చెందిన నేతలు అవినీతికి [more]

Update: 2021-05-07 17:30 GMT

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు అవినీతి మంత్రులు తలనొప్పిగా మారారు. సంకీర్ణ ప్రభుత్వం కావడంతో ఆయన దీనిపై పెదవి విప్పడం లేదు. శివసేనకు చెందిన నేతలు అవినీతికి కొంత దూరంగా ఉన్నప్పటికీ మిత్రపక్షాలకు చెందిన మంత్రులపై ఎక్కువగా అవినీతి ఆరోపణలు వస్తుండటంతో ఉద్ధవ్ థాక్రేకు చికాకు తెప్పిస్తుంది. మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ వ్యవహారం ఉద్ధవ్ థాక్రేకు ఇబ్బందికరంగా మారింది. ఆయన రాజీనామా చేసిన ఆ ప్రభావం ఇంకా ప్రభుత్వంపై కన్పిస్తూనే ఉంది.

అవినీతి ఆరోపణలు….

మహారాష్ట్ర హోంమంత్రిగా అనిల్ దేశ్ ముఖ్ వంద కోట్ల రూపాయలు వసూలు చేయాలని తమపై వత్తిడి తెచ్చినట్లు పోలీసు అధికారి పరమ్ బీర్ సింగ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్సీపీకి చెందిన అనిల్ దేశ్ ముఖ్ చేత తొలుత రాజీనామా చేయించడానికి శరద్ పవార్ సయితం నిరాకరించారు. అయితే తర్వాత క్రమేణా ఆరోపణలు బలపడుతుండటం, సీబీఐ దర్యాప్తు కు ఆదేశించడంతో రాజీనామా చేయక తప్పింది కాదు.

విపక్షాలకు అస్త్రం….

దీంతో విపక్షాలకు అస్త్రం దొరికినట్లయింది. అనిల్ దేశ్ ముఖ్ వ్యవహారాన్ని బీజేపీ అసలు విడిచిపెట్టడం లేదు. ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. శివసేన నేతృత్వంలోని సంకీర్ణ కూటమి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆరోపించారు. అనేక శాఖల్లో అవినీతి జరుగుతుందని, ఉద్ధవ్ థాక్రే పూర్తిగా అవినీతిని అరికట్డడంలో విఫలమయ్యారని ఆయన ఆరోపిస్తున్నారు.

మంత్రులకు వార్నింగ్…..

ఇప్పుడు సీబీఐ కేసు నమోదు చేయడం, త్వరలోనే ఆయనకు శిక్ష పడటం ఖాయమని ప్రచారం జరుగుతోంది. అవినీతి ఆరోపణలు రాకుండా చూసుకోవాలని ఇటీవల మంత్రి వర్గ సభ్యులకు ఉద్ధవ్ థాక్రే సుతిమెత్తంగా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. మిత్రపక్షానికి చెందిన మంత్రులైనా తాను ఉపేక్షించబోనని, అవినీతి వ్యవహారం లేకుండా చూసుకోవాలని ఆయన పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. మొత్తం మీద మంత్రులపై అవినీతి ఆరోపణలు ఉద్ధవ్ థాక్రేకు చికాకు తెప్పిస్తున్నాయి.

Tags:    

Similar News