పెద్దపులికి పెద్ద చిక్కొచ్చిపడిందే?

ఉద్ధవ్ థాక్రేకు ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చి పడింది. ఆయన ముఖ్యమంత్రి పదవికే ఎసరు వచ్చింది. కరోనా వైరస్ తో ఆయన కుర్చీ కే ఇబ్బంది వచ్చి [more]

Update: 2020-04-10 18:29 GMT

ఉద్ధవ్ థాక్రేకు ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చి పడింది. ఆయన ముఖ్యమంత్రి పదవికే ఎసరు వచ్చింది. కరోనా వైరస్ తో ఆయన కుర్చీ కే ఇబ్బంది వచ్చి పడింది. దీంతో హడావిడిగా ఉద్ధవ్ థాక్రేను నామినేట్ చేయల్సిందిగా గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి పంపంది. గవర్నర్ చేతిలోనే ఇప్పుడు ఉద్ధవ్ థాక్రే పదవి ఉంటుందా? ఉండదా? అన్నది తేలనుంది. గవర్నర్ భగత్ సింగ్ కొష్యారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి…..

మహారాష్ట్ర రాజకీయ పరిణామాలన్నీ మనకు తెలిసినవే. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుతో బరిలోకి దిగిన బీజేపీ, శివసేనలు అత్యధిక స్థానాలు సాధించాయి. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబట్టారు. చెరి రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలన్న ఉద్ధవ్ సూచనను బీజేపీ తిరస్కరించడంతో ఆయన కాంగ్రెస్, ఎన్సీపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ ఇప్పుడు మహారాష్ట్రలో ప్రతిపక్షంగా ఉంది.

ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో…..

ఉద్ధవ్ థాక్రే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అసలు థాక్రే కుటుంబం తొలి నుంచి ప్రత్యక్ష్య రాజకీయాలకు దూరంగా ఉంటుంది. మొన్నటి ఎన్నికల్లో ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే వర్లీ నుంచి పోటీ చేసిి ఘన విజయం సాధించారు. ఒక దశలో ఆదిత్యను ముఖ్యమంత్రిగా చేయాలని ఉద్ధవ్ థాక్రే భావించినా ఎన్సీపీ అందుకు ఒప్పుకోకపోవడంతో ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది.

గవర్నర్ నిర్ణయం కోసం….

ఉద్ధవ్ థాక్రే గత ఏడాది నవంబరు 28వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ఆరు నెలల్లో ఆయన చట్టసభల్లో సభ్యుడిగా ఉండాలి. అంటే మే 28వ తేదీ వరకూ చట్ట సభకు ఎంపికయ్యేందుకు వీలుంది. కానీ కరోనా నేపథ్యంలో ఎన్నికల కమిషన్ రాజ్యసభ ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా వాయిదా వేసింది. మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తుండటంతో మే చివర వరకూ ఎన్నికలు జరిగే అవకాశం లేదంటున్నారు. ఎమ్మెల్సీగా మే 28వ తేదీ లోపు ఉద్ధవ్ ఎన్నిక కాకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు గవర్నర్ ను నామినేట్ చేయాల్సిందిగా కోరారు. మరి గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News