ఠాక్రే టోన్ మారింది… కారణమదేనా?

ఎమ్మెల్సీ ఎన్నిక జరిగే వారకూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే టోన్ ఒకలా ఉంది. కేంద్రప్రభుత్వంతో కొంత సఖ్యతగా ఉన్నట్లు కన్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి [more]

Update: 2020-05-28 17:30 GMT

ఎమ్మెల్సీ ఎన్నిక జరిగే వారకూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే టోన్ ఒకలా ఉంది. కేంద్రప్రభుత్వంతో కొంత సఖ్యతగా ఉన్నట్లు కన్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడారు. ప్రధానంగా మే 28వ తేదీ నాటికి ఉద్ధవ్ ఠాక్రే ఎమ్మెల్సీగా ఎన్నిక కాకుంటే ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేసిన ఆరునెలలులోగా చట్ట సభలకు ఎన్నిక కావాల్సి ఉంటుంది.

ఎన్నిక కోసం…

కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగలేదు. గవర్నర్ కు రెండు సార్లు మంత్రి వర్గం సమావేశమై వినతిని పంపినా పట్టించుకోలేదు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేయాలంటూ మంత్రి వర్గ సమావేశం నిర్ణయాన్ని గవర్నర్ పట్టించుకోలేదు. చివరకు ప్రధాని నరేంద్ర మోదీ జోక్యంతో గవర్నర్ ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. రాజ్యాంగ సంక్షోభం నెలకొనే అవకాశమున్నందున ఎమ్మెల్సీ ఎన్నికలు జరపాలని గవర్నర్ కోరడంతో ఎన్నికల కమిషన్ ఓకే చెప్పింది.

ఎమ్మెల్సీ ఎన్నిక అనంతరం…

మొత్తం 9 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. 9 మంది నామినేషన్లు వేయడంతో అందరూ ఏకగ్రీవంగా గెలిచారు. ఉద్ధవ్ ఠాక్రే పదవీ గండం నుంచి తప్పించుకున్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికయిన నాటి నుంచే కేంద్ర ప్రభుత్వం పట్ల ఉద్ధవ్ ఠాక్రే వైఖరి మారిందనే చెప్పాలి. మరోవైపు మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజుకు వందల కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువగా ఉంది.

అంతా అయిపోయాక….

ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఉద్ధవ్ ఠాక్రే తప్పు పట్టారు. ఆకస్మికంగా లాక్ డౌన్ విధించడం శుద్ధ తప్పు అని వ్యాఖ్యానించారు. అలాగే ఒక్కసారిగా లాక్ డౌన్ ఎత్తివేయడం కూడా సరికాదన్నారు. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య యాభై వేలు దాటింది. మరణాల సంఖ్య కూడా 1700కు చేరువలో ఉంది. అందుకే తమ ప్రభుత్వ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఉద్ధవ్ ఠాక్రే కేంద్ర ప్రభుత్వంపై నెపాన్ని నెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తుంది. మొత్తం మీద ఎమ్మెల్సీగా ఎన్నికయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంపై ఉద్ధవ్ ఠాక్రే టోన్ మారిందనే చెప్పాలి.

Tags:    

Similar News