ఉద్ధవ్ ఇదేం పని? కళ్ల ముందు కన్పించడం లేదా?

ఎంతైనా అనుభవం విపత్కర సమయాల్లో ఉపయోగపడుతుంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేరళలో కంట్రోల్ చేయగలిగారు. అదే మహారాష్ట్రలో తొలిసారి ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టిన ఉద్ధవ్ థాక్రే [more]

Update: 2020-04-21 18:29 GMT

ఎంతైనా అనుభవం విపత్కర సమయాల్లో ఉపయోగపడుతుంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేరళలో కంట్రోల్ చేయగలిగారు. అదే మహారాష్ట్రలో తొలిసారి ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టిన ఉద్ధవ్ థాక్రే కరోనా కట్టడిలో విఫలమయ్యారన్న విమర్శలు సర్వత్రా విన్పిస్తున్నాయి. కరోనా అనుమానితులను గుర్తించడంలోనూ, నియంత్రణ చర్యల్లోనూ ఉద్ధవ్ థాక్రే అట్టర్ ఫెయిలయ్యారన్నది వాస్తవం. మహారాష్ట్రలో కేసులు పెరుగుతున్న తీరు చూస్తుంటే ప్రభుత్వ పనితీరును ప్రశ్నించాల్సి వస్తోంది.

రోజురోజుకూ కేసుల సంఖ్య….

మహారాష్ట్ర కరోనా వైరస్ వ్యాప్తితో అతలాకుతలం అవుతోంది. దేశంలో అత్యధికంగా కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర ఇప్పటికే మొదటి స్థానంలో ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా మహారాష్ట్రలో కరోనాను కట్టడి చేయలేకపోతున్నారు. రోజురోజుకూ కేసుల సంఖ్య వేలల్లో పెరుగుతోంది. ఐదువేలకు చేరువలో సంఖ్య ఉండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఇంత జరుగుతున్నా మహరాష్ట్రలో లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే విమర్శలను ఎదుర్కొంటున్నారు.

ఒక్క ముంబయిలోనే….

వాణిజ్య రాజధాని ముంబయిలో ఇప్పటికే మూడు వేలు కేసులు దాటి పోయాయి. మహారాష్ట్రలో గ్రామీణ ప్రాంతాల్లోనూ కరోనా వైరస్ వ్యాధి విస్తరించింది. దీంతో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అందరూ భావించారు. కానీ ఈ నెల 20వ తేదీ నుంచి లాక్ డౌన్ లో మినహాయింపులు ఇస్తూ ఉద్దవ్ థాక్రే ప్రకటన విమర్శలకు దారి తీసింది. పరిశ్రమలను తిరిగి పునరుద్ధరించారు. ఇది ఆందోళన కల్గించే విషయమని సొంత పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం కూడా….

ఒక్కరోజులోనే వందల కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. దేశంలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 590 ఉంటే ఒక్క మహారాష్ట్రలోనే 232 వరకూ ఉన్నాయి. మహారాష్ట్రలో మంత్రివర్గం సమావేశమై దీనిపై చర్చించింది. లాక్ డౌన్ మినహాయింపులపై మరోసారి చర్చించాలని ఉద్ధవ్ థాక్రే భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. మొత్తం మీద మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పట్లో ఆగేలా కన్పించడం లేదు.

Tags:    

Similar News