థాక్రే తరహాలోనే స్టాలిన్ కూడా…?

తన తండ్రిలాగే స్టాలిన్ కూడా వారసత్వాన్ని తనకు అనుకూలంగా ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి దించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో డీఎంకే పరిస్థితి అనుకూలంగా ఉంది. దానికే విజయావకాశాలు [more]

Update: 2021-03-17 17:30 GMT

తన తండ్రిలాగే స్టాలిన్ కూడా వారసత్వాన్ని తనకు అనుకూలంగా ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి దించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో డీఎంకే పరిస్థితి అనుకూలంగా ఉంది. దానికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. దీంతో స్టాలిన్ తాను మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యులను కూడా ఎన్నికల బరిలోకి దించాలని భావించారు. స్టాలిన్ తన తనయుడు ఉదయనిధిని ఈ ఎన్నికల్లో పోటీ చేయించాలని డిసైడ్ అయ్యారు.

థాక్రే తరహాలో…..

మహారాష్ట్రలోనూ ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి అయినా ఆయన తనయుడు ఆదిత్య థాక్రే తండ్రికి సహాయంగా ఉంటున్నారు. తండ్రి వెంటే ఉండి పలు కీలక నిర్ణయాల్లో భాగస్వామి అవుతున్నారు. ఇందుకు ఆదిత్య థాక్రే కు అనుభవంతో పాటు రాజకీయ మెళుకువలు కూడా తెలిసే అవకాశముంది. స్టాలిన్ కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నారు. స్టాలిన్ కు ఇప్పటికే అరవై ఏళ్లు దాటాయి. ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నప్పటికీ భవిష్యత్ లో డీఎంకేకు సారథ్యం వహించాల్సింది ఉదయనిధి మాత్రమే.

యువజన విభాగానికి…..

అందుకే స్టాలిన్ ఇదివరకే ఉదయనిధిని డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడిగా చేశారు. ఉదయనిధి కూడా ఆ మధ్య జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. కొందరు సీనియర్లు ఉదయనిధి జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నా స్టాలిన్ మాత్రం ఉదయనిధి త్వరగానే రాజకీయాల్లో రాణించాలని కోరుకుంటున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ఉదయనిధిని బరిలోకి దింపాలనుకున్నారు ఉదయనిధి కి ఇప్పటికే సినీ గ్లామర్ ఉంది.

కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన….

దీంతో పార్టీకి మరింత ఉపయోగపడతారని ఉదయనిధిని ఎమ్మెల్యేగా చేయాలని స్టాలిన్ బలంగా విశ్వసిస్తున్నారు. అయితే గతంలో కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన స్థానం నుంచే ఉదయనిధిని పోటీ చేయించాలని స్టాలిన్ డిసైడ్ అయ్యారరు. కరుణానిధి గతంలో చెపాక్, తిరువారూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈరెండింటిలో ఒక నియోజకవర్గం నుంచి ఉదయనిధి పోటీ చేసే అవకాశాలున్నాయని అందరూ అనుకున్నారు. కానీ చివరకు ఉదయనిధికి చెపాక్ స్థానాన్ని కేటాయించారు.

Tags:    

Similar News