టోటల్ గా సీన్ ఏంటంటే.. ఇది బాగుపడదు

కాంగ్రెస్ కు శత్రువులు ఎవరో లేరు. పార్టీలోనే ఉంటారు. గ్రూపులు, ఘర్షణలు కాంగ్రెస్ పార్టీలో షరా మామూలే. మొత్తానికి అర్థమయ్యేదేంటంటే…? పీసీసీ చీఫ్ పదవి ఎవరికి వచ్చినా.. [more]

Update: 2020-12-26 09:30 GMT

కాంగ్రెస్ కు శత్రువులు ఎవరో లేరు. పార్టీలోనే ఉంటారు. గ్రూపులు, ఘర్షణలు కాంగ్రెస్ పార్టీలో షరా మామూలే. మొత్తానికి అర్థమయ్యేదేంటంటే…? పీసీసీ చీఫ్ పదవి ఎవరికి వచ్చినా.. ఇంకొకరు సహకరించరని, సో.. టోటల్ గా తెలంగాణలో కాంగ్రెస్ బాగుపడదని. కొన్నాళ్లుగా పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ పడుతున్న తీరు, నేతలు చేస్తున్న విమర్శలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ పీసీపీ చీఫ్ ను ఎవరిని నియమించినా మరొకరు సహకరించరనేది తేలిపోయింది. తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పేరు ఖరారయిందని వార్తలు వచ్చాయి.

సీనియర్ నేతలు….

దీంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం దీనిపై సీరియస్ అవుతున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తే తాను పార్టీ నుంచి వెళ్లిపోతానని సీనియర్ నేత వి.హనుమంతరావు తేల్చి చెప్పారు. అంతేకాదు రేవంత్ రెడ్డి తన డబ్బులు వెదజల్లి కాంగ్రెస్ లోని కొందరు నేతలను తనవైపునకు తిప్పుకున్నారని ఆరోపించారు. అంతేకాదు రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ఎస్ మూలాలున్నాయని, ఆయనకిస్తే తాము బహిరంగంగానే వ్యతిరేకిస్తామని వీహెచ్ చెబుతున్నారు.

రెండు వర్గాలుగా…..

మొత్తం మీద పీసీసీ చీఫ్ పదవి కోసం తెలంగాణ కాంగ్రెస్ లో రెండు వర్గాలు బయలుదేరాయి. ఒకటి రేవంత్ రెడ్డి వర్గం, మరొకటి రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం గా ఉంది. రేవంత్ రెడ్డి ఢిల్లీలో పెద్దయెత్తున లాబీయింగ్ చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జైపాల్ రెడ్డికి ఉన్న సంబంధాలను రేవంత్ రెడ్డి ఉపయోగించుకుని సైలెంట్ గానే పావులు కదిపారు. నేతల నుంచి అభిప్రాయాన్ని సేకరించినప్పుడు కూడా రేవంత్ రెడ్డి పేరే ప్రముఖంగా విన్పించింది.

రేవంత్ కు వ్యతిరేకంగా…..

అయితే ఇప్పుడు సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అంగీకరించే పరిస్థితుల్లో లేరు. వారికి సంతృప్తి పర్చడానికి సీడబ్ల్యూసీ, ఏఐసీసీలో పదవులు ఇచ్చినా ఫలితం ఉండదు. అలాగని రేవంత్ రెడ్డికి ఇవ్వకుండా మరొకరికి ఇస్తే ఈ వర్గం సహకరించదు. మొత్తం మీద ఎలా చూసుకున్నా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల గొడవ నిరంతరం కొనసాగుతూనే ఉంటుందన్నది వాస్తవం. పార్టీ బలోపేతం అవ్వదన్నది కఠిన సత్యం. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

Tags:    

Similar News