బైడెన్ టీం లో కీలకం వీరేనట

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ముగిసింది. డొనాల్డ్ ట్రంప్ ఓటమి పాలయ్యారు. జో బైడెన్ ను విజయం వరించించి. ఇక మిగిలింది అదికారిక ప్రకటనే. వచ్చే జనవరి [more]

Update: 2020-12-05 16:30 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ముగిసింది. డొనాల్డ్ ట్రంప్ ఓటమి పాలయ్యారు. జో బైడెన్ ను విజయం వరించించి. ఇక మిగిలింది అదికారిక ప్రకటనే. వచ్చే జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయడంతో జో బైడెన్ అధ్యాయం మొదలవుతుంది. ఆయన విధి విధానాలు, వైఖరి, వ్యూహాలు ఎలా ఉంటాయన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదే విధంగా ఆయన మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారన్న దానిపైనా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అదేసమయంలో మంత్రివర్గ సహచరుల్లో అమెరికన్లనే కాకుండా ఇతరులు ఎవరైనా ఉంటారన్న అంశంపైనా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో ఆరోగ్య మంత్రి, కీలకమైన ఇంధన శాఖ మంత్రిగా ఎవరుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది. రక్షణ,విదేశాంగ వంటి కీలకశాఖల పైన మరింత ఆసక్తి ఉండటం సహజం. అగ్రరాజ్యంలో మనలాగా మంత్రులు అని పిలవరు. వారిని సెక్రటరీ ఆఫ్ స్టేట్ అని వ్యవహరిస్తారు. విదేశాంగ మంత్రిని సెక్రటరీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ అని వ్యవహరిస్తారు.

కర్ణాటకకు చెందిన…

జో బైడెన్ మంత్రివర్గంలో ఇద్దరు ప్రవాస భారతీయులకు చోటు లభించవచ్చన్న చర్చలు, ఊహాగానాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. వివేక్ మూర్తి, అరుణ్ మజుందార్ లను జో బైడెన్ తన సహచరులుగా ఎంపిక చేసుకోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బైడెన్ కూడా పరోక్షంగా ఈ విషయాన్ని చెబుతున్నారు. వివేక్ మూర్తిది కర్ణాటక. ఆయన పూర్తి పేరు వివేక్ హల్లెగెరే మూర్తి. ఆయన కుటుంబం తొలుత బ్రిటన్ వలస వెళ్లింది. మూర్తి (43) 70 దశకంలో యార్క్ షైర్ లో జన్మించారు. ఆ తరవాత ఆయన కుటుంబం అమెరికాకు చేరింది. అక్కడే స్థిరపడింది. మూర్తి ప్రముఖ వైద్యుడు. డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారుడు. ఒబామా హయాం నుంచే ఆయనకు ఆ పార్టీతో అనుబంధం ఉంది. ఒబామా అధికారంలో ఉండగా 19వ సర్జన్ జనరల్ గా పనిచేసిఆయన అభిమానాన్ని చూరగొన్నారు. జో బైడెన్ తోనూ మూర్తికి మంచి అనుబంధం ఉంది. ఆగస్టు 17న ఆయన నామినేషన్ ను సమర్థిస్తూ మాట్లడారు.కీలకమైన కోవిడ్ నియంత్రణకు సంబంధించి జో బైడెన్ ఏర్పాటు చేసిన టీమ్ కు వివేక్ మూర్తి కో ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. కోవిడ్ ను ఎలా నియంత్రించాలన్న అంశంపై ఆయన ఇప్పటికే ఒక నివేదికను బైడెన్ కు సమర్పించారని చెబుతున్నారు. ఈ నివేదికను పరిశీలించిన జో బైడెన్ సంతృప్తి చెందారని, దీంతో ఆయనను ఆరోగ్య శాఖా మంత్రిగా తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ వంటి పత్రికలు ప్రచురించాయి. ఒంటరితనం, మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై ఆయన పుస్తకాలు రాశారు.

గుజరాత్ మూలాలున్న…

మరో ప్రవాస భారతీయడు అరుణ్ మజుందార్ నూ జో బైడెన్ తన మంత్రివర్గంలోకి తీసుకోనున్నారన్న వార్తలు వస్తున్నాయి. మజుందార్ గుజరాత్ మూలాలున్న ప్రవాస బారతీయుడు. 1985లో బాంబే ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తరవాత స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. ప్రొఫెసర్ అయ్యారు. ఇంధన రంగానికి సంబంధించి ఏర్పాటు చేసిన అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్టు ఏజెన్సీకి ఆయన తొలి డైరెక్టర్ గా వ్యవహరించారు. మెకానికల్ ఇంజనీరింగ్ లో ఆయనకు గల విశేష అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని మజుందార్ కు ఇంధన మంత్రిత్వ శాఖ బాధ్యతలను అప్పగించవచ్చని చెబుతున్నారు. ఒబామా హయాం నుంచి ఆయనకు డెమొక్రటిక్ పార్టీతో అనుబంధం ఉంది. ఇంధన శాఖ సుమారు 35 బిలియన్ డాలర్ల బడ్జెట్ ను కలిగి ఉంటుంది. అణు వార్ హెడ్ లను నిర్మించడంలో, అత్యవసరం చమురు నిల్వలు నిర్వహించడంలో ఈ శాఖ కీలకపాత్ర పోషిస్తుంది. మొత్తం మీద ఇద్దరు ప్రవాస భారతీయులకు కీలక పదవులు లభించనుండటం భారతీయులకు గర్వ కారణం. అధ్యక్షుడి తరవాత అంత ప్రాధాన్యం గల ఉపాధ్యక్ష పదవికి భారతీయ మూలాలున్న మహిళ కమలా హారిస్ ఎన్నికవడం చరిత్రాత్మకం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News