విశాఖ వెళ్లేలోపు జగన్ లగేజీని వదిలించేసుకుంటున్నాడా?

ఏదైనా అనుభవమయితే కాని తెలిసి రాదట. రెండున్నరేళ్ల పాలనలో జగన్ డక్కీమొక్కీలను తిన్నారు. ఎవరు తనవాళ్లో, ఎవరు కాదో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నట్లుంది. బెజవాడ నుంచి విశాఖకు వెళ్లే [more]

Update: 2021-07-15 05:00 GMT

ఏదైనా అనుభవమయితే కాని తెలిసి రాదట. రెండున్నరేళ్ల పాలనలో జగన్ డక్కీమొక్కీలను తిన్నారు. ఎవరు తనవాళ్లో, ఎవరు కాదో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నట్లుంది. బెజవాడ నుంచి విశాఖకు వెళ్లే ముందుగానే లగేజీ భారాన్ని జగన్ వదిలించుకోవాలని భావిస్తున్నట్లుంది. ఒక్కొక్కరిని తప్పిస్తున్నారు. తనకు అతి దగ్గరగా ఉంటూ మంచి చేయడం బదులు చెడు చేసే వారిని దూరం పెట్టాలని నిర్ణయించుకున్నట్లుంది. ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ బదిలీయే ఇందుకు ఉదాహరణ.

ప్రవీణ్ ప్రకాష్ విషయంలో….

ప్రవీణ్ ప్రకాష్ జీఏడీ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. సీఎంవోలో పొలిటికల్ కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఆయన బాధ్యత పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకోవాలి. ముఖ్యమంత్రి వద్దకు ముఖ్యమైన అపాయింట్ మెంట్లను ఖరారు చేయాలి. కానీ జగన్ కంటే ముందు ప్రవీణ్ ప్రకాష్ ను ఒప్పించడమే కష్టంగా ఉందన్నది వైసీపీ నేతల అభిప్రాయం. ఆయన పెత్తనం మితి మీరిపోయిందట. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను జగన్ ను కలవనివ్వకుండా ప్రవీణ్ ప్రకాష్ అడ్డుకుంటున్నారని ఎప్పటి నుంచో పార్టీలో విన్పిస్తున్న మాట.

గ్యాప్ పెంచుతున్నారని….

దీంతో కొందరు మంత్రులతో పాటు ఎంపీలు సయితం ముఖ్యమంత్రి జగన్ దృష్టికి ఈ వ్యవహారం తీసుకెళ్లినట్లు సమాచారం. తాము ముఖ్యమైన విషయాలను నేరుగా మీ దృష్టికి తీసుకొద్దా మనుకున్నా వీలుపడటం లేదని జగన్ జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు చెప్పినట్లు తెలిసింది. ప్రవీణ్ ప్రకాష్ కారణంగా గతంలో చీఫ్ సెక్రటరీలే మారాల్సి వచ్చింది. ఆయన తొలి నుంచి వివాదాస్పద అధికారిగా పేరపొందారు. జగన్ కు పరిస్థిితి అర్థమై ప్రవీణ్ ప్రకాష్ ను సీఎంవో నుంచి తప్పించి ఆ బాధ్యతలను మరో ఐఏఎస్ అధికారి ముత్యాల రాజుకు అప్పగించారు.

మరికొందరికి కూడా?

ఇప్పుడు కేవలం ప్రవీణ్ ప్రకాష్ తోనే ఇది ముగియడం లేదంటున్నారు. మరికొందరు సలహాదారులను కూడా జగన్ తప్పించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. తనకు, పార్టీ నేతలకు మధ్య గ్యాప్ తెచ్చే విధంగా వ్యవహరించే వారిపై వేటు వేయాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. జగన్ విశాఖ బయలుదేరి వెళ్లకముందే తనకు, పార్టీకి, ప్రభుత్వానికి భారంగా మారిన వారిని వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు. మొత్తం మీద రెండున్నరేళ్ల తర్వాత గాని జగన్ కు అర్థమయినట్లు లేదు.

Tags:    

Similar News